మా రచయితలు

రచయిత పేరు:    స్వాతి

కవితలు

ఆమె

నువ్వు నువ్వుగా మొదలవుతావు 

కానీ చివరికంటా మిగిలేది అతడే 

అద్దం ముందు నిలుచున్నపుడు 

నీ ప్రతిబింబం కన్నా 

అతడి నిలువెత్తు ఆకారమే 

కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది 

నీవు ఏ కళాత్మక ఊహానో 

ఊహించినపుడు  దాన్ని అణిచిపెట్టి 

ఆనవాళ్లు లేకుండా చేస్తాడు 

నీదంటూ ఏ కొత్త శైలినో 

ఏ కొత్త ప్రక్రియనో కనిపెట్టినపుడు 

తన సిద్ధాంతాలతో దాన్ని 

Utterly wrong అంటాడు 

నీ సరికొత్త ఆలోచనలను 

ముందుకు సాగనీయకుండా 

సూర్యుడు చుట్టూ తిరిగే భూమిలా 

తన వైపు తిప్పుకుంటాడు 

అనాది నుండి ఇప్పటి వరకు 

అతడిలో అదే వైఖరి   

నువ్వు  ఆమెగా మిగలాలంటే 

కొత్తగా మొలకెత్తిన మొలకలా 

నీ ఉనికి ఈ భూమిపై  చిగురించాలి

వాళ్లు వెళ్లిపోతున్నారు

ఆకలితో

దాహంతో

అలసటతో

కండ్లల్ల నీళ్లతో

వాళ్ళు వెళ్లిపోతున్నారు

 

సంకనపిల్ల

నెత్తినమూట

నెలలగుడ్డు

పగిలిన పాదాలతో

వాళ్ళు తిరిగి వెళ్లిపోతున్నారు

 

తమ ఊరిని తమ వాళ్ళని

కలుసుకునేందుకు

సత్తువనంతా కాళ్లలో నింపుకుని

వాళ్ళు తరలిపోతున్నారు

 

నెత్తి మీద భగభగమండుతున్న సూర్యున్ని

దారిమధ్యలో నీడనివ్వని చెట్టుని

సహాయం అందించని వ్యవస్థని

నిందించకుండా దేశరహదారిపై

నెత్తుటి పాదముద్రలు వేస్తూ

వాళ్ళు మరిలిపోతున్నారు

మనల్ని నిస్సహాయులని చేసి 

వాళ్ళు వెళ్లిపోతున్నారు ...

వాళ్ళు వెళ్లిపోతున్నారు...

వాళ్లు వెళ్లిపోతున్నారు 

ఆకలితో

దాహంతో

అలసటతో

కండ్లల్ల నీళ్లతో

వాళ్ళు వెళ్లిపోతున్నారు

 

సంకనపిల్ల

నెత్తినమూట

నెలలగుడ్డు

పగిలిన పాదాలతో

వాళ్ళు తిరిగి వెళ్లిపోతున్నారు

 

తమ ఊరిని తమ వాళ్ళని

కలుసుకునేందుకు

సత్తువనంతా కాళ్లలో నింపుకుని

వాళ్ళు తరలిపోతున్నారు

 

నెత్తి మీద భగభగమండుతున్న సూర్యున్ని

దారిమధ్యలో నీడనివ్వని ఏ చెట్టుని

సహాయం అందించని ఈ వ్యవస్థని

నిందించకుండా దేశరహదారిపై

నెత్తుటి పాదముద్రలు వేస్తూ

వాళ్ళు మరిలిపోతున్నారు

మనల్ని నిస్సహాయులని చేసి 

వాళ్ళు వెళ్లిపోతున్నారు ...

వాళ్ళు వెళ్లిపోతున్నారు...

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు