గుడిసెలు కూలిపోతున్నాయి!
గుండెలు రగిలి పోతున్నాయి
ప్రాణం రాలిపోతుంది
మానం దూరమైతుంది
ఎవరు నోరు విప్పరేంటి..?
కడుపుకు తిండే కరువైతుంది..
ఆశలు లేని బ్రతుకులలోన..
ఉషోదయాన్నే నింపడానికి
ఎవరు ముందుకు రారేంటి..??
కరువుల ఊబిలో రైతులు
అప్పుల కోసం చేతులు చాచుతూ
ఉన్న ఇల్లుని భేరం పెడుతూ
వానలు పడక
పంటలు పండక
మనస్తాపంతో రైతులు పాపం
పురుగు మందులనే తాగుతుంటే
ఈ దేశం ఏమై పోతుంది..???