మా రచయితలు

రచయిత పేరు:    అన్వర్

కవితలు

గోదావరి వరదలో కలిసిన కన్నీళ్లు !

ఈసారి 

మాదే తప్పు గోదావరి 

నీ జల ధృతి 

నీ ప్రవాహ ఉదృతి 

హెచ్చరికలు దాటినా 

ప్రమాద సూచికలు 

తెలిసి కూడ 

ప్రమోద యాత్ర తలపెట్టాం. 

మా సంగీత విభావరి శబ్దాల మద్య నీ వరద దడ వినలేదు గోదావరి !!

మా కేరింతల కేకల అల్లరిలో 

నీ ఆగ్రహ అలజడి వినలేకపోయాం !

పడవలో  బరువు మించి 

 ప్రయాణికులున్నారట 

 నడిపేవాడికి శిక్షణ లేదట 

 అసలు లాంఛీకి ప్రయాణ అనుమతే లేదట !!

ఇదంత డబ్బులకోసమేనా ?

ఏవి నియమ నిబంధనలు?

వరదలో కొట్టుకోపోయిన 

శవాలు 

ఎన్ని జీవితాలు?ఎన్ని భావి కలలు ??

ఎన్ని ఆశలు ఎన్ని ఆధారాలు 

ఎన్ని చిరునవ్వులు 

అన్ని అన్నీ వరదమయం 

అయోమయం 

విహారయాత్ర 

కొందరికి అంతిమ యాత్ర 

ప్రవహించు గోదావరి 

మృతుల సంబంధీకుల 

కన్నీళ్లు కలుపుకొని 

బాధ కల్గుతుంది ఆ దుర్ఘటన తలుచుకొని 

ఈ సంచికలో...                     

Jun 2021

ఇతర పత్రికలు