సప్తసంతానాలలో ఒకటైన
తెలుగుభాషా మాతల్లి
నేడేలనో
దిగులు మేఘం కమ్మిన
దీనివలన యై
నగరపు నడిబొడ్డున
కాటుక కంటకన్నీరు
చనుకట్టుపైబడి
భోరున కురిసే వర్షంతీరై
విలపిస్తూ ఉంది
రాజుల కాలంనాటి
తన ప్రాభవాన్నీ
నేటిప్ర భుత్వం దిగజార్చిన
తన వైభవాన్నీ
బేరీజు వేసుకుంటూ
తనను పాతరవేసి
ఆంగ్ల భాషను అందల మెక్కిస్తూ నామరూపాల్లేని
అనాధ ను చేశారు
నాడు కైతభదైత్య మర్ధనుని గాదిలి కోడలు
కాటుక కంటి కన్నీరు చనుకట్టు పైబడివిలపిస్తుంటే
"నిను నాకటికై కర్ణాటక
కీచకుల కమ్మ ను :
నను నమ్ము భారతీ
అని ఆమెనోదార్చిన
పోతన కవి
నాకారణంగాగజారోహణ
గద్దె నెక్కి
గౌడ డిండి మభట్టుకంచు
ఢక్కాను పగులగొట్టి
కనకాభి షేకాలు పొంది
గుండె పెండేరము తొడిగించుకున్నకవి శ్రీనాధుడూ కవికోకిల లూ
కవితా విశారధులూ
నవయుగ కవి చక్రవర్తులన్న బిరుదులతో ఖ్యాతి పొందిన
కవులందరు
కన్నతల్లిపై ఇసుమంతైనా
గౌరవం లేక
అవమానం భారాన్ని దించి పూర్వ వైభవాన్నిపెంచ రారేల
నాడు నిండు సభలో
వస్త్రాపహరణం జరుగుతుండ ద్రౌపది మానం కాపాడ
చేతగాక ఛేవజచ్చిన
పాండవులై
నేటి అధికారులు నాభాషావిలువల విలువలూడుస్తూ
పరాభవపు పాడిపై పరుండి బెడుతూంటే
తలవాల్చి తప్పించుక తిగుతున్నారే న్యాయమా
అమ్మ భాషను గత వైభవపు
పూలరథంపైఊరేగించ కదలి రారా
రండీకదలిరండు అమ్మభాషను అందలమెక్కించ కదలిరండు !!!