మా రచయితలు

రచయిత పేరు:    గంజాం భ్రమరాంబ

కవితలు

నీకు అర్థం అవుతోందా....

పండుగ సందడిని

పల్లెలో వదిలేసి

మనం మాత్రం

పట్టణానికి వచ్చేసాం

బంధుజనాలందరినీ

పల్లెలో వదిలేసి

మనం మాత్రం

పట్టణానికి వచ్చేసాం

పచ్చని పొలాలనీ పాడి పశువులనీ

పల్లెలో వదిలేసి

మనం మాత్రం

పట్టణానికి వచ్చేసాం

మనమెన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నా

మనమెంత సంపదలను వెనకేసుకుంటున్నా

చిన్నా....

మనం ఎదో కోల్పోతున్నామని

మనదేదో పల్లెలోనే వదిలేసి వస్తున్నామని

మళ్ళీ...

ఆ నేలతల్లి వాసన మన గుండెనిండా

అలుముకునే వరకూ..

ఎదో ఎడతెగని అలసట

మనల్ని కమ్ముకుంటుందనీ

మన సమయాన్నంతా మింగేసే

పరుగుల రాక్షసి కౌగిలినుంచి తప్పించుకొని

కొన్ని క్షణాలైనా పల్లెతల్లి ఒడిలో

హాయిగా సేదతీరేవరకూ...

మనకు తెలియకుండానే....

మనల్ని మనం ఎంతగా కోల్పోతున్నామో...

"నీకు అర్థం అవుతోందా...."

ఈ సంచికలో...                     

Jun 2021

ఇతర పత్రికలు