ఆనందంతోనే దుఃఖం
వెంటేసుకొస్తే ....
ఇది నాది అనుకునే లోపే చేజారి పోతుంటే
అందరూ నా వాళ్ళే అన్న భావన
రోజురోజుకీ చేదెక్కి పోతుంటే,
తీయని మాటలతో
అందరూ మోసం చేస్తుంటే,
నిజానికి కట్టుబడక పోతుంటే అనుమానంతో నిండిపోయిన ఈ లోకంలో
నమ్మకం అనేది చచ్చిపోతుంటే,
మంచిగా ఉండటమే
తప్పై పోతుంటే,
సాయం అని అడిగిన నోరు తిరిగి సాయం చేయడానికి రాకుంటే,
ఎవరు?
ఎవరు సంతోషంగా ఉన్నారు?ఒకరి ఆనందం ఇంకొకరికి
తీపి కాకపోతే,
పైకి నటిస్తూ
మనసంతా చేదెక్కి పోతూంటే , మనస్ఫూర్తిగా దీవించడం కూడా రాకపోతే
బ్రతుకుతున్నవన్నీ
జీవితాలు కాదేమో?
మాట్లాడే వాళ్ళందరూ మనుషులు కారేమో?
ఎవరు ఎటు వెళ్ళినా,
ఏది ఎలా జరిగినా..
వ్యక్తిత్వమే ఆయుధం, ధైర్యం!