మా రచయితలు

రచయిత పేరు:    సమీర

కవితలు

మర్యాదస్తులు

ప్రశ్నలేమీ లేనివాళ్ళు

ప్రశ్నతోనే 

ప్రపంచ నాగరికతాభివృద్ధంటే

 ఔనా! యని 

 ఆశ్చర్యచకితులై 

 ఆశ్చర్యిస్తరు

 

                     

  సోక్రటీస్                

  వాళ్ళకెప్పుడూ

   అపరిచితుడు

 

   ప్రశ్న సహేతుకమైతే

   గంభీరతెంతైనా గానీ

   ఔననీ కాదనీ

   అనని వాళ్ళు

   ఎందుకు?!

 

   ఔనంటే ఒగ పాపం

   జవాబన్వేషణకై

   కలిసి కదలమంటరేమో

   కాదంటే మరో కష్టం

   ఎందుక్కాదో    

   చెప్పమంటరు

 

   ఎందుకొచ్చిన గొడవ!

   అమాయకమో చిర్నవ్వో

    సమాధానిస్తరు

 

    హేతుశూన్య

    లొల్లిలేని సొల్లంటే

    ఎంతో రుచి వాళ్ళకు

    ఏ సొల్లైతేనేం

    అది సొల్లైతే చాలు

 

    కళ్ళూ ముక్కూ చెవులు

    మూసుక నెమరువేస్తూ

    చప్పరింంచే

    మూడు కోతులనూ

    ఆవాహన చేసికొన్న

    ఏకత్వ తాత్వికులు

 

    ఆల్ ఈజ్ వెల్ గా ఉండగ

    అనవసరారాటా లెందుకు

     కళ్ళుమూసుకొని

     మట్ట్యంటని

     చెమట కారని

     కర్మజేయుటే

     మా కర్తవ్యమంటరు

 

     మట్టీ చెమటమయమైన

     అన్ స్కిల్ డ్ కర్మే

     వాళ్ళ  స్కిల్డ్ కర్మ కాధారమని

     తెలిసీ తెలవనట్లుండే

     స్కిల్ డ్  క్రాఫ్టీ కర్మ గాళ్ళు

     ఔ ! మరి

     వాళ్ళు మర్యాదస్తులు

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు