కోల్పోయేదే ఎక్కువ యింత చిన్న బతుకులో
కన్నుచూడ వలసినదృశ్యాలను
చెవి వినవలసిన శబ్దాలను
ముక్కు అగ్రనించ వలసిన పరిమళాలను
నాలుక అస్వాదించవలసిన రుచులనుచర్మం తాకవలసిన స్పర్శలను
కోల్పోయేవి ఎక్కువే ఈ జీవితాన
మబ్బు చాటు చంద్రున్నో
సగం తెరిచిన చిరుత పులి కన్నునో
ఉలికి పడిన రాత్రిదిగ్గున లేచి
శూన్యంతో మాట్లాడిన మాటనో
పేరు తెలియని ఒక అదవీ పువ్వునో
ముండ్ల తుప్పల్లో పడి ఉన్న మృత శిశువునో
చేజేతులా కోల్పోయేవే ఎక్కువ ఇంత ఇరుకైన బతుకులో
నాకు నచ్హిన ఎరుపు రంగు నీకు నచ్చాలని లేదు
నీకు నీలాకాశం బాగుంటే నాకు మట్టి రంగు మససైంది
అన్ని దారులు రోమ్ నగరానికే వెళ్లాలని లేదు
కొన్ని ముగింపు లేని దారులున్నాయి
తుపాకులు ఒక చోట కన్నీళ్ళను తుడుస్తున్నాయి
తూటాలు మరో చోట రక్తాన్ని పారిస్తున్నాయి
ఎందుకో నాకిపుడు మనిషి ముఖం సగం మృగం వాలే కనిపిస్తున్నది
నువ్వు వాలు మన్న చెట్టు మీద ఏ పిట్టా వాలదు
నువు చోసెదేదీ నీ కోసం ఆగాదు
అన్నింటికీ ఆప్షన్స్ ఉన్నాయి
పోగొట్టుకున్నదేదైనా పొందేదేదో ఉంటదిలే !
కాగితం వెన్నెల్లో పూసిన కొన్ని నల్ల మల్లె పూలు
అక్షరాలై చల్ల గాలితో సయ్యాటలాదుతై
ఎక్కడో నక్కల ఊళలు వినబడి
నా మనో ధనస్సు నుండి
శబ్ద భేది చిమ్మ చీకట్లోకి దూసుకెలుతుంది
నా శరీరాన్నిక్కడ వదిలేసి
నేనేదో ఆఖాతపు లోయలో ఊయల లూగుతూ
ఎవరైన సరే పూరించని ఖాళీలను వదిలేసి వెళ్ళాల్సిందే
ఒకనిలో ఒక్కడే ఉంటాడని నమ్ముతం
వచ్చే చిక్కే అది
నాలోకి అప్పుడప్పుడు ఎందరో శత్రువులు ప్రవేశించి
విరమించని పోరాటాలు చేస్తుంటారు
నేను అనేక యుద్దాలు చేస్తూనే ఉంటాను.