మా రచయితలు

రచయిత పేరు:    పి రాజ్యలక్ష్మి

కథలు

ఎర్ర తిలకం

ఎప్పటిలా నిద్ర లేస్తూనే అద్దం ముందు నిలబడ్డాను.అద్దంలో నా ప్రతిబింబం చూసుకొని లోపల ఏదో మెలిపెట్టిన భాద.
    రేపు సలిం వచ్చేస్తాడు.జరిగిన విషయాలన్నీ పూస గుచ్చినట్లు విడమర్చి చెప్పాలి .నా బాధ వెళ్లగక్కుకొని మామూలు మనిషిని కావాలి. వచ్చి రాగానే సమస్యల దండకం చెప్పి అతన్ని బాధ పెడితే ఎం బాగుంటుంది.నాలుగు రోజులు పోయిన తరువాత చెబితే బాగుంటుందేమో. ఈ లోపలే ఆమె నా మీద లేనిపోనివి సలిం  కి  చెప్పి మనస్సు పాడుచేస్తే ?
    ఇలా నేలతిమ్మిరి మాదిరి దఫా దఫాలుగా  ఆలోచనలు వస్తూపోతున్నాయి .
    నా ఆలోచనలను చెదర గొడుతూ ఆమె పెద్దగా అరుస్తుంది. ఇందాకటినుండి నేను అరుస్తుంటే ఉలకవు పలకవు,బెల్లం కొట్టిన రాయిలా ఉంటావు. అదేం జబ్బోగాని మంచం దిగటం ఆలస్యం ఆ అద్దం ముందు నిలబడతావు అంటూ కళ్ళేర్రచేస్తూ నాకు దగ్గరగా వచ్చి 
    నా బ్యాగులో కనబడిన స్టీక్కర్ ప్యాకెట్టు నా ముఖాన   విసిరి, షరమ్ నై  ఎన్ని సార్లు చెప్పాలి బొట్టు చూస్తే నాకు కంపరమెత్తుతుందని. పాలకోసం చిల్లర డబ్బులు తీద్దామని చూస్తే ఇదిగో ఈ మాయదారి బొట్టు బిళ్లల పాకెట్టు కనబడినది.ఎంత చెప్పిన వినవా..బ్యాగులో ఈ పాకట్టు పెట్టుకున్నావంటే బయటకు పోయినప్పుడు పెట్టుకుంటున్నావా. రాని నా కొడుకుని. వాడు వస్తే నీ  విషయం తేల్చి కోవాలి. ఇలాంటి పద్దతిలో ఉంటే నా కొడుకు నీతో ఎట్లా కాపరం చేస్తాడో చూస్తాను 
    నిద్రలేస్తూనే ఏంటీ ఈ చివాట్లు. రోజు రాత్రిపూట పడుకునే ముందు పాలడబ్బులు టేబుల్ మీద పెడతాను.రాత్రి మతిపోయిందో ఏమో మర్చిపోయాను.డబ్బులకోసం బ్యాగ్ తీసింది దొంగలా దొరికి పోయాను. అదేంటో ఆవిడకు అదేం బుద్ది. నన్ను అడిగితే ఇస్తాను కదా. ఇలా నా బ్యాగ్ తీయటం నచ్చలేదు .నా సొంత వస్తువులను నా ఇంట్లో ఎవరు ముట్టుకోరు.  ఇలా నా బ్యాగ్ లో చేయిపెట్టటం మర్యాద కాదని చెప్పాలనుకున్నాను కానీ మాట పెగిలి బైటికి రాలేదు 
    ఏం చేస్తాను బొట్టు లేకుండా ఆఫీసుకు వెళ్ళినా, దారిలో తెలిసిన వాళ్ళు కనబడినా 
    ఏంటీ ముఖాన బొట్టు లేదు. ఆ అబ్బాయిని చేసుకొని మతం మార్చుకొని శాయుబుల్లో చేరావా అంటారు 
    బొట్టు లేకుండా నీ ముఖం చూడబుద్ది కావటం లేదు. పెద్ద పెద్ద కళ్ళ మద్యలో ఆ బొట్టు చల్లని చందమామలా ఎంత కుదురుగా కనబడుతుందోనని మెచ్చుకునేవారు.
    బొట్టు లేని ముఖం నాకు వికారంగానే ఉంది.ప్రశ్నలకు, పలకరింపులకు సమాధానం చెప్పలేక ఇంట్లో నుండి బయటకు రాగానే బ్యాగ్ లోంచి స్టికర్ తీసుకొని పెట్టుకొని ,మళ్ళీ ఇంటి మెట్లు ఎక్కేట ప్పుడు తీసేసి వెళ్ళేదాన్న.  ఎప్పుడు ఎర్రతిలకం పెట్టుకునేదాన్ని ఆవిడ దెబ్బకు మానేసి స్టీక్కర్స్ అలవాటు చేసుకున్నాను.
    ఆవిడ వాగ్దాటి వరదలా పొంగుతుంది.ఇదిగో ఇటు చూడు రేపు పిల్లోడు వస్తాడు. ష్యాదీ చేసుకున్నాక నీ ఇష్టం వచ్చినట్లు వుంటే వూరుకునేది లేదు 
    బొట్టు తీయలిసిందే బురఖా వేసుకోవలింసిందే, నవాజు చేయాలిసిందే, ఖురాన్ చదవలసిందే, మా భాష మాట్లాడాలసిందే. చదువుకున్న దానివీ అన్నీ  తొందరగా అబ్బుతాయి.
    నువ్వు అదృస్టవంతురాలివి.అల్లా నీన్ను మెచ్చుతాడు.నేరుగా జన్నత్ కు పోతావు.  మా మతం లోకి వచ్చావంటే వేయి జన్మల పుణ్యం దక్కుతుంది తెలుసా. మంచిగా అర్థం చేసుకో.
    రేపు పిల్లోడు రాగానే ఇద్దరినీ వూరికి తీసుకొని పోయి మసీదు పెద్దలచేత నిఖా చేయిస్తా.మా మతంలోకి వచ్చినట్లే. అప్పుడు నీ పేరు కూడా మారుస్తారు .నీకు ఇష్ట మయిన   మా  శాయుబుల పేరు నువ్వే చూసుకో. ఎలా నడుచుకోవాలంటే అలా నడుచుకోవాలి.
    నీ లాగే మా వూరిలో మా వాల్ల అమ్మాయిని చేసుకున్న అబ్బాయే మతం మార్చుకొని మసీదుకు పోయి నవాజు చేస్తాడు.ఆడదానివి నీవెంత. నిన్ను మా వాళ్ళు  నెత్తిన పెట్టుకుంటారు ఇలా మాటల ప్రవాహం సాగుతూ వుంది
    ఆమె చెబుతున్న చిట్టా విని మతిపోయింది.  ఈ మతం ఏమిటి .మతం మారితే నాకు అదృష్టం ఏమిటి.అదేంటి ఈవిడ ధోరణి .నేనేందుకు వాళ్ళకోసం మతం మారతాను..ఎందుకు మారాలి. నేనే మన్న వీళ్ళ కుటుంబానికి బ్రాండ్ అంబాసిడర్నా?
    మా ఇద్దరికి మతం ఉన్నదా. ఎప్పూడు సలీం ఇలా మారాలి అని కూడా చెప్పలేదు కదా. సలీం ను చేసుకున్నందుకు నన్ను నేను కోల్పోవాలా.
ఇవన్నీ ఆలోచించి నాన్న అన్న చివరి మాట చచ్చిపోయావనుకుంటాను.  బతికుండగా 
ని మీఖం చూపెంచకు అన్నారు. బొట్టు లేని మీఖం ఆయనకు ఇష్టం ఉండదు.
                ....................
    నేను నలుగురు అబ్బాయిల తరువాత పుట్టానని నాన్నకు నేనంటే పిచ్చి ఇష్టం. కాలు క్రింద పెడితే కంది పోతానని భయం.  నా పైన ఈగ వాలనివ్వరు.  అబ్బాయిలకన్నా ఎక్కువ స్వేచ్చ ఇచ్చారు.స్వేచ్చ అంటే విచ్చలవిడి తనం కాదు. మంచి ఛేడు తెలుసుకునేలా విచక్షణంగా ఆలోచించేలా ఉండటం.ఆయన ఇచ్చిన స్వేచ్ఛలో ఆంక్షలు, పరిదులు ఉండేవి.ఏ పని చేసిన చట్రలోంచి బయటకు రావటం అంతా సులభం కాదు.
    నాన్న కొన్ని విషయాల్లో ఖరాఖండిగా ఉంటారు. ఆయన క్రమశిక్షణను దానితోపాటు ఇచ్చే స్వేచ్చను అందరూ ఇష్టపడతారు.ఆయన చెప్పిన మాటకు ఎదురు చెప్పవలసిన అవసరం కనపడదు.
    మా కుటంబంలోని ఆడపిల్లలకు ఒక విషయంలో ఆయనంటే భయపడతారు. ఆయన వస్తున్నాడంటే అందరము అద్దం ముందుకు పోయి బొట్టు ఉందో లేదో చూసుకుంటారు.  ఖర్మం చాలక బొట్టు లేకుండా ఆయన ఎదుట పడితే ఇక ఆ రోజు వారి  పని అయినట్లే.
    నేనంటే ఆయనకు ప్రాణం అని చెప్పాను కదా. అయిన సరే బొట్టు లేకుండా ఆయనకు కనబడితే ఛీ పాడు ముండా ,పోయి బొట్టు పెట్టుకుని రా, లేదంటే నీ ముఖం చూపించకూ .ఎక్కడ నేర్చుకున్నావు పాడు బుద్దులు .ఏం చేస్తున్నావు ఇంట్లో. పిల్ల ఎలా ఉందో చూడొద్దా.బొట్టు పెట్టనన్న పెట్టాలి లేదా పెట్టుకోవటం నేర్పించాలి, అని అమ్మను కేకలేసేవారు.
    నాన్న అంటే చాలా చాలా ఇష్టం.  ఆయన చేత తిట్టించుకోవటం ఇష్టం ఉండేది కాదు.అందుకే అమ్మలాగా పొద్దున్నే ముఖం కడుక్కోని అద్దం ముందు నలబడేదాన్ని బొట్టు పెట్టుకోవటం కోసం.
    నాన్న  ఉద్యోగం పల్లెటూరులో.  నెలకొకసారి జిల్లా ఆఫీసులో మీటింగుకు వెళ్ళి వస్తుంటారు.వెళ్ళేటప్పుడు ఏం కావాలి అని అడిగేవారు..
    నాన్నా కొత్తగా బొట్టుబిళ్లలు వస్తున్నాయట.  రంగురంగుల బిళ్ళలు తేస్తే లంగా, వోణి లకు మాచింగు పెట్టుకుంటాను అని అడిగా
    కొంచెం కోపం చేసుకుంటూ అలాంటివి బాగుండవు, ఎర్ర తిలకం పెట్టుకుంటే లక్ష్మిదేవి లా ఉంటావు అలా రంగురంగుల బిళ్లలు పెట్టుకోకూడదు అని సుతిమెత్తగా మనస్సు మార్చేసేవారు
    అదేంటో ఆయన చెప్పిన మాటలు నచ్చుతాయి.  ఆయనకు నచ్చినట్లు ఉండటం నాకు ఇష్టమే.అందుకోసం నా  బంగారు తల్లి చెప్పిన మాట వింటుందని మెచ్చుకొనేవారు.
                ...............................
    నాన్న ప్రమోషన్ల మీద జిల్లా ఆఫీసుకు వచ్చారు .నేను డిగ్రీ కు వచ్చాను.నేను చేరిన కాలేజి చాలా పెద్దది.మంచి పేరున్నది ..కాలేజీలో పోటా పోటీ యూనియన్లు ఉండేవి. నాన్న చదివించిన సాహిత్యం హేతుబద్దంగా ఆలోచించే భావజాలం ఏర్పడింది.నా ఆలోచనలకు యూనియన్లు నన్ను ప్రోస్తహించేవి.అప్పుడే సలీం పరిచయం.యూనియన్న్లో సలీం క్రియాశీలకంగా పనిచేసేవాడు.
    ఆలోచనలు కలవటంతో స్నేహం ఏర్పడింది. స్నేహంలో అభిమానం పెరిగింది. అభిమానంకు ఆకర్షణ తోడయింది. కలిసి ఉంటే బాగుంటుందని పించి ప్రేమ చిగురులు వేసింది.
    నాకు చదువు అయిపోగానే ఉద్యోగం వచ్చింది. సలీం ఉద్యోగ ప్రయత్నాలలో వున్నాడు.
    పెద్దవాళ్లకు వేరే పనులేమీ లేనట్లు తలచుట్టు కళ్ళు పెట్టుకొని ఒక కన్నేసి ఉంచటం సహజంగా వస్తుందేమో గాని నాన్న నన్ను పసిగట్టారు
    నాన్న అడ్డు  చెప్పరన్న  మనో ధైర్యం ఉండేది. హేతుబద్దంగా ఆలోచించటం నేర్పింది ఆయనే కదా. 
    ఆయన ఉగ్రరూపం చూడటం ఇదే మొదటిసారి ఎంతయినా ఆడపిల్ల తండ్రికద. ఎన్ని భయాలో ససేమిరా ఒప్పుకోలేదు .ముస్లింని చేసుకుంటే బహుభార్యత్వం ఉంటుంది.  ప్రేమలో లోపాలు కనిపించావు.ప్రేమ వేరు పెళ్ళి వేరు. పెళ్ళి తరువాత ఇష్టాలు అయిష్ట్టలు  కావచ్చు.
    సలీం, నాన్న ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటివారు.  ఎవరో ఒకరిని వాదులుకోక తప్పదు.
    నాన్న కోపం ఎన్నాళ్ళు ఉంటుంది.  కాలం గడిచేకొద్ది మారవచ్చు. లేదా నేనే ఆయనను మార్చవచ్చు.  సలీం చేయి జారిపోతే ఈ జన్మలో దక్కడు.  తప్పదు నాన్నను భాధపెట్టటం శాశ్వతం కాదు తాత్కాలికమే అనుకోని సలీం చేయి పట్టుకొని బయటకు అడుగులు వేశాను.
కూతురు కూతురు అని మురిసిపోయావుగా.  ఎంత పని చేసిందో చూడు. ఈ  రోజుల్లో ఆడపిల్లలకు చదువులు వద్దు అంటే విన్నరా.  తెలివికలదని విర్రవీగావు.మన కులం కాదు మతం కాదు ఎవ్వడు దొరకనట్లు ఆ తురకోడే దొరికాడా. అవమానలు,ఛీత్కారాలు,వ్యంగాలు, ఈసడింపిలూ,  బహిష్కరణలు, ఆయనను బండ రాయిని చేశాయి.  మాటంటే పడేవారుకాదు.  ఇంత జరుగుతుందని ఆలోచించలేకపోయాను.  సమాజం ఇంత కర్కశంగా ఒక మనిషిని నిట్టనిలువునా ప్రాణం తీయకుండ చంపేస్తుందని తెలిసింది.
    నాన్న ముఖం చూడలేనని గుండె దీటువు చేసుకున్నాను. ఆయనకు దూరంగా కనిపిచకుండా వెళ్ళటమే పరిష్కారమినిపించింది.
                    .....................
    
     
    వేద మంత్రాలు లేవు. మసీదు ప్రార్ధనలు లేవు. రిజిస్టరు మ్యారేజీ చేసుకున్నాము. మా చుట్టూ వున్న వారే పెళ్లిపెద్దలు.  సలీం తన వాళ్ళకు చెప్పలేదు. ఎందుకంటే నాన్నలాగా వాళ్ళు కూడా మా పెళ్ళికి వప్పుకోరని తెలుసు.
    సలీం కు ఊద్యోగం వచ్చింది. ఆరు నెలలు డిల్లీ కి ట్రయినింగుకు వేశారు.మేము ఇలా పెళ్ళి చేసుకున్న విషయం తెలిసి సలీం అమ్మ అఘమేఘాలమీద వచ్చింది.  అదే రోజు సలీం డిల్లీకి బయలేదేరుతున్నాడు.  వాళ్ళ యిద్దరికి యుద్దం జ్జరిగింది. వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు.
    సలీం ట్రయిన్ ఎక్కడు, ఆవిడ ఇక్కడే తిష్టవేసింది.మీ వాళ్ళు ఎలాగూ నిన్ను వదిలేశారు.  మీ వాళ్లలాగా తెలివితక్కువవాళ్ళాం కాదు..చూస్తూ చూస్తూ కన్నా బిడ్డలను వదులుకుంటామా.  ఒక్కదానివి ఒంటరిగా ఎలా ఉంటావు.. అసలే రోజులు బాగా లేవు.  పిల్లోడు వచ్చిందాకా తోడుగా ఉంటాను అంటే మంచిదే అనుకున్నాను.
                ....................

    పొద్దున్నే అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటుంటే సర్రున వచ్చి తిలకం సీసాను విసిరికొట్టింది.
    నేను కట్టేలా బిగుసుకు పోయాను.  ఆ క్షణంలో ఆమెను చూసి భయపడిపోయాను.ఆమెకు బొట్టు అంటే గిట్టదు అని తెలిసింది.  ఏడుపు వస్తున్నా అపుకున్నాను.
    సాయంత్రం ఆఫీసునుండి వచ్చేటప్పటికి నా  రూమంతా మారిపోయింది.  ఖురాన్, జనియాజ్, తబ్జీ కొన్ని అల్లా సూక్తులు ఫోటోలు. ఇంటి వాతావరణమే మారిపోయింది.
    తెల్లవారుఝామునే లేపి నమాజు చేయమని గొడవ చేసేది. ఎలాగోలా తప్పించుకునేదాన్ని. ఆమెను ఎదిరించలేను. అలాగని తలవంచుకొని సర్దుకుపోలేను. నేను నేనుగా ఉండటం అలవాటు.  ఆమె చెప్పినట్లు నేనేందుకు మారాలి అని పౌరుషం వచ్చేది. అసలికే నేను మొండి ఘటం అని ఇంట్లో అందరూ అనేవారు.
    నాన్న గుర్తుకు వస్తున్నారు.  చూసి చాలా రోజులయింది.  అద్దం ముందు నిలబడితే నాన్నను చూసినట్లు ఉండేది.బొట్టు లో ఆయన రూపమే కనబడేది. ఈవిడ నా బొట్టు మీద దాడి వలన నాన్న గుర్తుకు వచ్చినప్పుడల్లా దుఖం అగేది కాదు.బొట్టు పెట్టుకోకపోయిన పొద్దున్నే అద్దం ముందు నిలబడే అలవాటును మాన్పించలేకపోయింది.
                        ……………………
    సలీం ఈ రోజే వచ్చేది. మనసంతా గందరగోళంగా ఉంది. సలీం వాళ్ళ అమ్మ మాట వింటే నా పరిస్తితి ఏమిటి.సలీంను చేసుకుంటే నేను మతం మారాలా.  మన దేశ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం.  ఎవరి ఇష్టమొచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చు. ఈ సమస్యనుండి ఎలా బయటపడాలి.  ఈ మతం గోల లేని కొత్త సమాజం ఉంటే ఎంత బాగుంటుంది. అయిన మన ముఖాలమీద ముఖ్యంగా మహిళల ముఖాన ఈ మతం గుర్తులు ఏంటో.  సలీంను చేసుకోక ముందు ఏ గోల లేకుండా హాయిగా కాలం గడిచిపోయింది. ఒక మనిషితో జీవితం పంచుకోవాలంటే ఇంత సంఘర్షణా. సలీం రాగానే ఏది ఏమయినా చెప్పేయాలి. నీ  మతం నీది నా మతం నాది.  మన దేశంలో భిన్న మతాలు బ్రతుకుతుంటే ఇద్దరం కలిసి బ్రతకలేమా అని అడగాలి. నా ఆలోచనల ప్రవాహం సాగుతూండగానే సలీం రానేవచ్చాడు. 
    సలీంను చూస్తూనే  వాళ్ల అమ్మ  కొడుకుని ఆక్రమించేసింది. నేను సలీం దగ్గరకు వెళ్లలేకపోయాను. నన్ను చూస్తూనే ఏంటి అదోలా వున్నావు అన్నాడు.
అదేం లేదు.
ప్రయాణ బడలికతో వున్నావు. రెస్టు తీసుకో. ఆఫీసులో ఆర్జంటు రిపోర్టులు  చేసి పంపాలి. ఆ పని చూసుకొని మధ్యాహ్నం లంచ్ కు వస్తాను అని చెప్పివచ్చా.
వచ్చిన పని సాయంత్రం వరకు కాలేదు.  పనిచేస్తున్నంతసేపు ఆవిడ చూట్టూనే ఆలోచనలు. గబ గబ పని ముగించేసుకొని ఇంటికి చేరను. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. లోపలికి తొంగిచూశాను సలీం గాఢ నిద్రలో ఉన్నాడు.
    ఆమె ఆచూకీ కనిపించలేదు ఆమె చేసిన మార్పులన్నీ మాయమయ్యాయి. ఆవిడ వస్తువులు లేవు. ఆశ్చర్యంగా గదంతా కలయ చూసాను.
    నా అలికిడికి సలీంకు మేలుకువ వచ్చింది.
    మీ అమ్మ అని నసుగుతుంటే మాధహ్నమే బస్సు ఎక్కించాను. ఆమెను ఇక్కడ వుంచటం తప్పు చేశాను. అలాగే నిన్ను ఎంత భాద పెట్టానో తెలిసింది. సారీ అని చెబుతుంటే సలిం కళ్ళలో నాకు మువ్వెన్నల జండా కనబడుతుంది.

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు