మా రచయితలు

రచయిత పేరు:    ఆర్ శ్రీజ (విద్యార్థిని)

కవితలు

ఉదయించే సూర్యుని వలె

నీకై ఎవరూ లేరని నిరాశ చెందకు

నీలో ధైర్యము నీ తోడై ఉండగా

పోరా సూటిగా నీ ధ్యేయం చూపే మార్గంలో

ఏ సాయం కోసం చూడక

పిడుగులు పడని మెరుపుల రానీ  

ఏనాడో వెనుకడుగు వేయక ఏ అడుగు తడబడి నీయక

పరిశీలించు ప్రపంచాన్ని

పరిశోధించు  జ్ఞానాన్ని

దూసుకు పోరా నేరుగా నీ గమ్యం చేరేదాకా

ఉదయించే సూర్యుని వలె విశ్రమించక....
 

ప్రస్తుత సమాజం

ఉదయం ఏడైనా పోదు మనలో లేజీ

కళ్ళముందు ప్రత్యక్షం కాలేజీ

పైగా చేతిలో పుస్తకాల లగేజీ

దాని బరువు మినిమమ్ ఓ కేజీ

పైకి కటినంగా మా గురుజీ

లోపల మనసు మాత్రం స్పాంజి

చేస్తున్నాము కానీ పిజీ

అంతులేని సిలబస్ తో గజిబిజి

ఉద్యోగం లేదంటే అవ్వదు మ్యారేజీ

దాంతో పడలేం రాజీ

అందుకే ఎక్కువైన పోటీల రేంజీ

ఎలాగైనా తిప్పాలి ఉద్యోగాల పేజీ

లేదంటే దూకాలి ప్రకాశం బ్యారేజీ

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు