మా రచయితలు

రచయిత పేరు:    అక్కల చంద్రమౌళి

కథలు

కేడా  కొడ్త్సా

భవెనా (మే) మాసం......ఏడుగంటలకు ఎర్రగా సూరీఢు భగ భగ మండుతున్నాడు. అదివాసి గ్రామాల ప్రజలు చీమల తీర్గానే ఒకరెనుక ఒకరు  తెల్లారంగనే గుడ్డెలుగులతో కొట్లాడి ఏరినవి.

అవి విప్పపూలు అమ్మడానికి  కాక, భయ్యో, పేరో "ధనోరా గ్రామా  పంచాయతీ" దగ్గర గుమికూడారు. బేరసారాలు జోరందకున్నాయి.

అదే  గ్రామానికి చెందిన సాధార‌ణ‌ రైతు కేంద్రీయ.బాలాజీ విప్పపూలు కొనడానికి  గ్రామాపంచాయితి దగ్గర తచ్చాడుతున్నాడు.యాభైళ్ళ ముసలవ్వ దగ్గర ఇప్పపూలు కొని  బుట్టల పొందించాడు.అటుగా వచ్చిన సర్పంచ్ ఆత్రం సక్కుబాలాజి చూసి "రాం రాంఅన్నాడు..బాలాజి యొక్క ఎవుసం   కష్టం విలువ తెలిసినోడు.  వ్యవసాయం క్షేత్రంలోని మొక్కల తీరు ఆరాతీస్తున్నాడు.

ఇంతలోనే ఫోన్ మోగింది. ఉద్యానవన శాఖ  వ్యవసాయాధికార బాలాజికి ఫోన్చేశాడు. నిన్న  ప్రగతిభవన్లో పండ్లతోటల  సాగు గురించి  చర్చ జరిగింది.  మీరు సేంద్రీయ పంటల పండ్లతోటలో మీ  క్రృషి గురించి మేము చర్చించాం. మీరు వెంటనే ముఖ్యమంత్రిని కలవాలి. ఒక్కసారి ముఖం వెలిగిందితిప్పలుపడ్డది మతికచ్చింది. అలా  పంటకు పడ్డ తండ్లాట గురించి నిమ్మలంగా కుర్సీల చాయ్ తాగుతూ యాది చేసుకున్నాడు.

                                                                                                ......

ఐదేళ్ళ క్రితం ఆగష్టు మాసంలో కుం రం భీం ఆసిఫాబాద్ జిల్లా, కెరమేరి మండలం ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి బాలాజి, సలిజరం  రావడంతో పరీక్షల కోసం ఆసిఫాబాద్ శాంతిలాల్ దవాఖానాకి బయలుదేరాడు.  డాక్టర్ మంచిగ సూత్తడని పక్కూర్ల నుంచి జనం ఇరగవడనట్టు వస్తారు. అదే ఆసుపత్రిలో యాభైఏళ్ళ గిరిజన తెగకు చెందిన  ముసలవ్వ చూడటానికి  సావున వర్ణం ,పాతకాలపు వెండి ముక్కుపుడక,చేతులకు దండెలు,గోలుసాడి రూపంలో ఉంది. దూరం నుంచి పాణం బాగలేక రోగముతో ముఖమంతా ఇగ్గుకచ్చినట్టు పీలపోయినట్టు దవాఖానా బెడ్ మీద పడుకుంది.

డాక్టర్ శాంతారాం ముసలవ్వను పరిచ్చలు చేసి నీవు బలం పుట్టె తిండి తింటలేవన్నాడు.

......అని మెల్లగంది.”

"పెయ్ల రగుతం లేదు" .

బొత్తిగా బెవసలు అయివనవు. రకుతం పుట్ఝాలంటె మంచిగా పండ్లు,ఫలాలు తింటె బగ్గరకుతం పుడతదని ముసలవ్వకు చెబుతున్నాడు.....ఇగ ఇప్పటి నుంచైతే బొక్కవలిగేటట్టు ఏదిపడితే అది తింటాని డాక్టర్ సాబ్తో గొంతును కలిపింది.

సరే అంది ముసలవ్వఈ తతంగమంతా దూరం నుంచి  బాలాజి చూస్తున్నాడు.

ముసలవ్వ సంచిలున్న పైసలు యాభైరుపాయలు తీసి ఇవ్వగా పదరాళ్ళా పిలగాడు బజారుకెళ్ళి  ఒకటె  పండు అచ్చింది.ముసలవ్వ ముఖంలా సంబురం లేదు.

ముసలవ్వ చేతిలో ఒక్కటె పండు డాక్టర్ కనబడింది ఉంది.

డాక్టర్ ఆశ్చర్యపోతూ నేను పండ్లని కిలో తెచ్చుకోమ్మానుగాఅని  అడుగగా 

ముసలవ్వ దానికి సమాధానంగా నాదగ్గర కొనడానికి గవ్వని పైసల్లేవని చిన్నబోయి ధీనంగా చెప్పింది

బాలాజి కండ్లలో చూసిన ద్రృశ్యం  పోతలేదు. మనస్సు చివుక్కుమన్నది.

బలమైన తిండికోసము  గిరిజనులు ఇంత తిప్పలు పడుతున్నారా? అని కొన్ని దినాల్దాకా ఆ విషయం  నిదుర పట్టనివ్వలేదు. తనకున్న కొద్దిపాటి భూములైననా సాగుచేసి పండ్లతోటలు పెట్టాలని ఆలోచించాడు.

బలరాంచిన్నప్పటి సోపతికి  ఆర్మీల నౌకరత్తె జమ్మూకాశ్మీర్ల  చేస్తున్నాడు.అప్పడప్పుడు పోన్ చేస్తుండే. ఊళ్ళ జరిగేటి  ముచ్చట్లు మరియు తిప్పలన్ని ఇడమరిసి చెప్పేవారు..గట్లనే బాలాజి ఆసుపత్రిలా జరిగిన సంగతి  చెప్పిండు. మన భూములల్ల పండ్లసాగు చేసి ఈడోళ్ళకు పౌష్టికమైన,బలమైన తిండి అందించాలని మనసులుంది సెప్పిండుఆ ఆలోచనలే బొందిగల తట్టింది.కూసొనిత్తలేదు అది నిల్సోనిత్తలేదు.

బలరాంకు బాలాజికి అన్న మాట ఒకటి తోచింది

 

ధనోరా  నుంచి  అదిలాబాద్ రైల్వేస్టేషన్ లో  ప్లాట్ ఫాం మీద తన ఆర్మీమిత్రుడు కోసం ఆత్రృతగా  ఎదురుచూస్తున్నాడు. రైలు దిగిరాంగనే  బలరాం పదిమొక్కలను చేతికందించాడు. సంబురమైంది.

మొక్కలు పట్టుకుని  ఇంటికి బయలుదేరాడు.తోవలా తెల్లని దోవతిలునెత్తికి నడీడు మనుషులంతా రుమాలు చుట్టుకుని గుంపులుగా చీమల తీర్గా  చిక్కగ కదులుతున్నారు.నల్లని నేలలో నాగలి దున్ని వ్యవసాయం చేసే స్థితిలో కూడా ఉన్నారు " మేము భూమితోటి , పంటల తోటి కలిసి ఉంటాము. ఆకాడిి దేవరపెద్దపండుగను మొక్కుకుంటాము" అని రెండే  ముచ్చట్లు చెప్పిండ్రు.రోడ్డుకిరువైపులా ఎద్దులు, ఆవులు , మేకలు చెంగలిస్తున్నాయి. తడకలతో, మట్టి గుడిసెలు కంటికి అందంగా ఉన్నాయి.

 

అరటితోటలో  కొంతమంది ఆదివాసి గిరిజనులు కూలిపనులు చేస్తున్నారు. చక్కరకేళి, నాందేడ్ లాగనే ఈడ కూడ పందేండ్ల నుండి అదివాసి భూముల్లో అరటితోటలు అనేకము విస్తరించాయి.

యాభైల కింది నుంచి  భూముల వ్యవసాయం  నెర్రెలు పాసి రైతుకు దుంఖమే మిగిల్చింది.

పల్లెలెంది,పట్నాలెందిప్పుడు. తినే ప్రతి వస్తువలా  పెస్టిసైడ్ మందుల తోటీ కల్తీ బుసకొట్టిందిఅవి తిని రోగాలు,రొచ్చులతో ఆసుపత్రిలో పాలైతున్నారు.

కొండల అంచున,గుట్ఝలమీద  మొక్కజోన్నపత్తి,కందులుమినుములుసజ్జలు పంటలే శరణ్యం.

ధనోరా గ్రామం కాడ ఆగినము. చుట్టూ లోయల్లు,మంచిగాడ్పు, వాగులు పొంగుతున్నాయి. వర్షాకాలం కాబట్టి అడవి కోమ్మలు  చిక్కగా ఉన్నాయి. కొద్ది దూరములో రైతులు గుమికూడున్నారు.రైతులకు  వ్యవసాయాధికారి ప్రభుత్వం యొక్క పథకాలు గురించి వివరిస్తున్నాడు ఒక్కరి ముఖంలా అంత పెద్దగా అధికారి చెప్పే విషయం మీద నజరు లేదుగిరిజన రైతుల తండ్లాట గిరిజనులకే ఎరుకెక్కువ. 

 

అందులోంచి భగవంతరావు గిరిజన  రైతు "దయచూపండి,రక్షించండి" సారు వేడుకుంటూ ఒక్కసారి అని కాళ్ళమీద డాల్లన పడ్డాడు.

రెండేళ్ల నుంచి పంట చేతికిరాలేదు.మందులు ఎక్కువగా వాడటం వల్ల  పెట్టుబడి పెరిగి బతికే తీరు లేక పురుగుల మందు గతైందని అధికారి ముందు బోరున ఏడ్చాడు.అదికారి జిర్రుమనలేదు.

 

"ధనోరా "చుట్టూ ప్రక్కల అదిమ గిరిజనుల ఆదివాసీల గ్రామంలో సరైన పోషకాహారాలు లేక రక్తహినతతో భాధపడుతుంటారు. .అడవిల దొరికేటి సేకరించుకుని  జిగురు, తప్సీ, ఇప్పపూలు, కంకబొంగులు జీవనాధారం .

భూమి దైవం ఇచ్చిందిగాను,రాజులకు చెందిందని భావించి ప్రజలు సేద్యం చేస్తారు.

సమిష్టి జీవనం, అవసరాల వినిమయం ఉంటుంది తప్ప వ్యక్తిగత ఆస్తి ఉండదు.మార్కెట్టు మరియు కరెన్సీతో పనిలేదు 

 

ధనోరా గ్రామం  చుట్టూ ప్రాంతంలో పంటలు వేస్తారని పెద్దమీసాలయను అడిగా పత్తి, కందులు, మినుములు, కొర్రలు, సజ్జలు అని బదులిచ్చాడుపాత పద్దతుల్లో ఇపుడు పంటలకు మొగ్గు సూత్తండ్రని  చెప్పాడు.

 

అక్కడ తోట, వాగు ఉందికొత్తరకం పంటలు పండిస్తున్నాడుఅక్కడికెళ్ళమని సూచించాడు.

పంటల గురించి తెలుసుకోవాలంటె   ఊరి రైతుని కలవమన్నాడు.

ఆలిశ్యం చేయకుండా వెళ్ళానుచిన్నదుకాణం రైతులకు పొట్లం కట్టి  ఇస్తున్నాడు.

నమస్కారం చేయగా "రాం రాం"బదులిచ్చాడు.మీ గురించి చాలా మంది గొప్పగా చెబుతున్నారు.

మీ వ్యవసాయం క్షేత్రం చూడాలని అనగానే రయ్యిన బయలుదేరాం.

 

బాలాజీ ఇంటినుంచి కిలోమీటరు దూరం మాత్రమే వ్యవసాయక్షేత్రం ఉంటుంది.వ్యవసాయం క్షేత్రం  చేరేసరికి మట్టికి తనకు బంధం గురించి మాటల్లో తెలిసింది.

 

బాలాజి,ముప్పై ఏనిమిది సంవత్సరాల యువకుడు.తండ్రి ఏక్నాథ్, తల్లి లక్ష్మి భాయి .ధనోరా మూడిండ్లు గ్రామం పొందిచ్చిన కుటుంబం.బాలాజికి ముగ్గురు అన్నదమ్ములు మరియు వ్యవసాయంతో అనుబంధం ఉన్న కుటుంబం.ఎర్రగా కురచగా చిరుదరహాసంగా ఉండేవాడు. చదువులో కూడా ప్రతిభావంతుడు.పదవ తరగతి వరకుమోడిలోఆ తర్వాత ఇంటర్మీడియట్ ఆసిఫాబాద్ గవర్నమెంట్ కాలేజిలో చదువుతున్నపుడే బతుకుదెరువు కోసం   డ్రైవరుగా మారిండు. కష్టపడి సొంత కాళ్లపై నిలబడేందుకు క్రృషి చేయగా  డిసిఎమ్ వ్యాన్  కొన్నాడు తర్వాత వ్యానుకొన్న కొద్దిరోజులకు బొల్తా పడటంతో పెద్ద ప్రమాదము నుంచి బయటపడి మోటర్ రంగానికి స్వస్తి పలికాడు.

తండ్రి మరణంతో కుటుంబం కకావికలమైంది.

 

రోజులు గడుస్తున్నాయి. అటు పేదరికం ఏలాంటి సౌలత్ లేకా ఏమి చేయాలో తోచలేదుకొన్ని రోజులు దుంఖమైంది.

చిన్నకాటన్ దుకాణం పెట్టాడుదుకాణం   వచ్చిన గిరిజన రైతులకు వారికి పైసలవసారాలుంటె కొంత ఇచ్చి   అధికంగా వడ్డీ వసూలు చేయడం మంటె  మనసు  చివుక్కుమంది.

అట్లా రైతులను పీడించి పైసలు కుప్పచేయడం పద్దతి వ్యాపారం నచ్చక వదిలిపెట్టాడు.

 

ఒంటిమీద  ఒక అంగీ తప్ప లాగులేని అందమైన పిల్లవాడిగా తండ్రి వెంట వ్యవసాయం చేసిన రోజు గుర్తుంది.

అనుబంధం, అనుభవం మళ్లీ వ్యవసాయం తండ్రి ఆశయం  కొనసాగింపుగా చేయాలని అది కొత్తపద్దతిలో  చేయాలని భావించాడు‌.

 

దేశీయంగా ఆవు సాకే విధానంపంటలు పండించే విధానం సమస్యలకు పరిహారం వేరేలా ఉన్నాయని వాటిని ఆలవర్చుకున్నాడు.

పేడ,గో మూత్రంతో రసాయనాలు వాడని వ్యవసాయం జీవితం ప్రారంభించాడు.

తోట వైపు కదిలాం. తోవలో  అదివాసి మనుషుల ముఖాలు,భాష తీరు చూస్తుంటె గమ్మతనిపించింది.

తునికాకుతోటి చుట్టూ అదివాసి అడవంచు గ్రామాలు బతుకుదెరువని చెప్పాడు.

 

ఎప్పటికి పారే జీవవాగు చుట్టూ దొనల మధ్య ఎంత మనసు ఉల్లాసపరిచేలా ఉంది.గిరిజన పిల్లలు ఈతలు కొడుతున్నారుకొందరు స్త్రీలు ఉతికిన బట్టలు వాగొడ్డుకు అరేస్తున్నారు.

వ్యవసాయ క్షేత్రం ముఖద్వారం స్వర్గీయ ఏక్నాథ్ రావ్-కేంద్రే స్మారక్ ధామ్పెద్ద అక్షరాలతో రాసి ఉంది.

 

పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో గల  వ్యవసాయ క్షేత్రంలో కలియతిరిగాము.   మొక్కలను  మూడెళ్ళ కిందట ఆగస్టు నెలలో జమ్మూ కాశ్మీర్,బస్వపూర్ నుంచి తెప్పించి నాటాను.

ధనోరా తోటలో దానిమ్మ ఉంది,పనాస ఉంది, అనేక రకాల పూలతోటలు ఉన్నాయి .రెండు మూడు రకాల పచ్చిమిర్చి కాయలు కూడ ఉన్నాయిచిన్న కుంటలో చేపల పెంచుతున్నారు.ఐదావులు,మూడు ఎద్దులున్నాయి. క్షేత్రంలో నాల్గు కుటుంబాలు జీవనం సాగీస్తున్నాయి..పేడను ఒక దగ్గర కుప్పలు వేసి పనిచేసేవారు పెద్ద కుండిల్లో నింపుతున్నారు.

నేను పంటచేస్తూ తోట నుండి కరివేపాకు తుంచి చారులో వేస్తాను.ప్రేష్ కొత్తిమీర నా దగ్గరే ఉంది.అదీ కూరలో వేసుకుని తింటె ఆరోగ్యమే పాడుకాదువంకాయ, టమాట, మునగ, తోటకూర దొరికిందిచూస్తు చూస్తుండగానే మొక్కలు పెరిగి పెద్దయ్యాయి. చుట్టుlబంధువుల కోసం ఎదురుచూడటం గొప్ప పండుగ.క్షేత్రంలో పక్షులు గూడుకట్టుకుని సంగీత కచేరీలుచేస్తున్నాయి. మట్టితో మాట్లాడుతున్నాడు.

తోటలో ఉంటె మనస్సు గాంధీబజార్.

మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరుల మామిడీపండ్లతోటలు  విరివిరిగా ఉన్నాయి. తోటలున్నా   మట్టిలో   అడవిలోలొధ్దిల్లో అనుకూల పఃటకోసం చాలా పరిశోధనలు చేశానుభూమితీరు గురించి వ్యవసాయం శాస్త్రవేత్తలతో అనేక సార్లు వారితో నా ఆలోచన పంచుకున్నాను.కొన్ని సలహాలిచ్చారు.

ప్రతిజిల్లాలో పంటల గురించి తెలుసుకున్నాను‌.అవన్నీ రసాయనాల పంటలు నచ్చలేదు.

ఇపుడైతేఅర్గానిక్ జపంమొదలైందిదీన్ని సర్టిఫై చేసేదరు?  దాన్ని నమ్మడం ఎలా? అన్న ప్రశ్నలు మనసుల పురుగు తీర్గా మెసిలిన ముందుకదిలాడు.

తండ్రి నుంచి నేర్చుకున్న వ్యవసాయం, నా ఆలోచన భూమి పోరల్లోకి వెళ్ళి పరిశోధన చేసి ప్రకృతి చలన సూత్రాలు తోటి సమాజ చలన సూత్రాలను బేరిజు వేసాను.

 

ప్రతి మట్టి పెళ్ళతో మాట్లాడాను‌.నా జీవిత లక్ష్యాన్ని విన్నవించుకున్నాను.సాంప్రదాయక సాగుతో  విస్తృతమైన పండ్లతోటల పెంపకం కలగన్నాను.

మట్టి ధైర్యం ఇచ్చింది. తర్వాత కొన్ని నెలలపాటు  రైతులతో నా ఆలోచనలు పంచుకున్నాను.కొందరు కలిసినడిచేందుకు ఆసక్తి చూపగామరికొందరు విభేదించారు.

అందరి యువరైతులతో సేంద్రియ పంటలకు సంబంధించిన ఉపన్యాసం మొదలైంది.బాలాజి ప్రసగించడం మొదలు పెట్టాడు.మనకిక్కడ  గ్రామాల్లోని పశుసంపతికి  ఢొకాలేదువ్యవసాయం మీద ఆధారపడిన ఉన్నారు.రసాయన ఎరువులు ఇదివరకు వాడి బతుకుల్ని అగామగం అయినాయి.ప్రక్రృతి వనరులతో ఎవుసం చేద్దాందానికి మనమంతా అడుగు మొదలుపెడదాం. .అట్లా చేస్తనే బతుకుడు లేదంటే  మనకి వేరే దారేది లేదు.

 

కొర్రలు,జొండ్లు,సజ్జలు,మినుములు 

సాగుగేయాలి. ఎంత కష్టమైన  పాత పద్దతులకే  మొగ్గు చూపాలి.నాలుకకు రుచిపోయ్యి ఎండ్లయ్యింది. మొద్థుబారింది

 

వ్యవసాయ జీవితంలో ప్రవేశించాక పశుపోషణ ఉన్న కాలంలో కూడా నిరంతరం చలనంలో ఉంటూ అదివాసులు గుంపులుగా తిరుగుతూ తెగలుగా జీవించారు.పశుసంపదతో  సాంప్రదాయ బద్దంగా వ్యవసాయం చేశారు

ఏండ్లకిందటె  పత్తి, మిర్చి, పొగాకు వంటి వ్యాపార పంటలు రైతుల భూముల్ల నాటుకుపోయాయి వ్యాపార పంటలు వీటి మార్కేట్ దళారులకు లాభాలు ఉండటం వల్ల గిరిజన రైతుల బతుకులు కుప్పకూలాయి.

 

మొక్కలు పూత్తయా? కాత్తయాని దెప్పొడ్చిన గానీ కించిత్ 

పెదవుల మీద చిరునవ్వు కోల్పోలేదు బాలాజి.

 

జమ్మూ కాశ్మీర్ పండ్లతోటలకు అక్కడి మొక్కలకు ధనోరా భూములు సారవంతమైనదిగాను, వాతావరణం అనుకూలంగాను భావించాడు. పదిమొక్కలను  భూమి చదును చేసి  గుంతల్లో  నాటాడు. గుంతలు తొడేటప్పుడు  సబ్బలు కాలికి తగిలి నెత్తురు బొల్ల బొల్ల కారగా పసుపుతో కాలికి బట్టకట్టాడు.పని మాత్రం ఆపలేదు.

దినాలు గడుస్తున్నాయి.బొందిగల గుటగుట ఉంది.

అడవికి దగ్గర కావడం వల్ల అడవిపందులు,కోతులు,గుడ్డెనుగుల నుంచి పంటను రక్షించటమనేది పెద్దసాహసమేచీకటైతే మంచం మీద పెద్ద  సప్పుళ్లతో అడవిపందులు రాకుండా కాపాడటానికి తెల్లారేదాకా తోటలోనే జాగారం.

మబ్బుల్లో లేచి ఆరుగంటలకు ఇంటికి పోయి  గొంతులో ఇంతంతా అంబలి పోసుకుని తల్లిచ్చిన పార పట్టుకుని వ్యవసాయం క్షేత్రంలోనే   మొక్కలతో గడపఢం, సేంద్రియాలు చేయడం   దినచర్య ‌.  మొక్కలతో అనుబంధం కండ్లలో మెరుపినిస్తుంది.

మొక్కలతో విడదీయరానీ బంధం ఏర్పడ్డాక తోటల బుద్దికావడం లేదు.

రోజు చిక్కని  చీకట్ల దూరంలా గర్రు గర్రుమని అడవి పందుల శబ్దం వినిపించిందిదడేల్లున లేచి వ్యవసాయం క్షేత్రంలోకి   దూసుకొస్తున్న అడవిపందుల పనిపట్టాలని కదిలాడు. చేతిలా పెద్ద లైటు ,గుతుప పట్టుకుని  .అడవి పందుల్లో  చిన్నపిల్లలు కనిపించాయిభయం వేసింది.మీది మీదకి ఊరికొస్తున్నాయి.

వాటిని తిప్పికొట్ఝకపోతే మొక్కలు నాశనం చేస్తాయని అర్ధమైంది..చేతిలో గుతుప తోటి ఒక్కసారిగా వాటిమీద దాడిచేయగా  పారిపోగా, తల్లి పంది మాత్రం మీద  పడిబాలాజిని కండలెక్క పికింది.

తప్పించుకుని బయటపడ్డాడు.దనోరా గ్రామంతా కదిలింది.

బాలాజి అమ్మ కడుపుల వెట్టి సాధుకుంటె ఇట్లా ఆయింది

బోరున తల్లడిల్లిందిఒక మాసం నొప్పులతో  ఇంటికి పరిమితమయ్యాడు.తండ్లాటంతా మొక్కల మీదనే బాలాజికి.

 

నెలరోజుల తర్వాత వ్యవసాయం క్షేత్రంలో అడుగుపెట్టాడుమొక్కలు దీనంగా ఉన్నాయి.దుంఖంతో కౌగిలించుకున్నాడు.

మొక్కలు సంతోషపడ్డాయి.

చుట్టుపక్కల గ్రామాల  రైతులకు వ్యవసాయంలో   తర్ఫీదు ఇస్తున్నాడు.

 

"నీ ఇష్టం వచ్చినట్టు మీటింగ్ పెట్టుకుని తిరుగుకానీ పనిచేసుకునే రైతులకు నీవు చేసే పద్దతులు నేర్పి చెడగొట్టకు,  నీకు పుణ్యము ఉంటుంది  పెర్టిలైజర్ యజమాని బాలాజి అన్నాడు. కోపం కట్టలు తెంచుకుంది.

పట్టణాలుపల్లెల అంతటా విధ్వంసపూరిత ఆహారొత్పత్తులుదాన్ని కట్టడిదిశగా పుట్టి పెరిగిన ప్రాంతం నుంచే అడుగువేయాలని కంకణం కట్టుకుంటె అవరోధాలే.

 

మనిషి కంటె గొప్పది భూమి . భూమిని లోతుగా చూస్తే కొత్త పంటలైన, కొత్త జీవనమైన సాగించవచ్చని భావించాడు.

వ్యవసాయం ఒక  జీవించే క్రమం.పంటను కమర్షియల్ గా చూడటం మొదలైన తర్వాత ఒత్తిళ్లు పెరిగాయి.

రైతు అంతర్గతమైన, బహిర్గతమైన ఒత్తిళ్లు ఎక్కువఅప్పుల ఒత్తిడిపిల్లలు చదివించాలనేది ఒత్తిడివారు కొడుకు సిటిలో చదివిస్తున్నారు నా కొడుకుని చదివించాలని ఒత్తిడి.

కరువు రాజకీయాలకి రైతులని సరఫరా చేసే సఫ్లయర్ అయిందిరాజకీయ నాయకుల మీటింగ్మైకుల చెప్పే ఉపన్యాసాలకు చప్పట్లు కొట్టె వారయ్యారు.

 

రోజు రోజుకు ట్రాక్టర్ల యంత్రాల  సంఖ్య  పెరుగుతుంది.మనుషులతో అవసరం లేకుండా వ్యవసాయం చేస్తున్నారు.వాణిజ్య పంటలతో పాటు మనుషుల ఆరోగ్యాలు ఖరబౌతున్నాయి.

 

ప్రస్తుతం మనకు ఒక వైరుధ్యం ఉందిసేంద్రియ పంటలో తగినంతగా దిగుబడి  ఉండదు అభివృద్ధైనా సరే జరుగుతున్నపుడు ఇలాంటి  తప్పవని తెలుసివచ్చింది.

 

"సేంద్రియ పద్దతి "నేర్చుకోవడానికి దేశంలోని సమర్ధత గల శాస్త్రవేత్తలు పంపమని వ్యవసాయం అధికారికి విన్నపించగా ఒప్పుకున్నారు.

 

మొక్కలు నాటడం  సులభమైంది. కానీ ఆసలు కథ ఇప్పుడే మొదలైంది.లోపల పరిస్థితులు,బయట పరిస్థితులు తట్టుకునే ప్రతి  మొక్క పెరుగుదల మీద ఖచ్చితమైన ద్రృష్టిని  అర్ధం చేసుకోవటంఆచరించటమనేది రైతు అప్డేట్ కావాలి.

సమస్యలోంచి మరికొన్ని సమస్యలు పుట్టుకొచ్చేవి.

 

రోగ నిర్దారణ పరీక్షలుఆకుల వచ్చిన రోగము ఖచ్చితత్వంతో కనిపెట్టాలి మాత్రం అశ్రద్దఅలసత్వం  పనికి రాదుప్రతిక్షణం రైతుకి యుద్ధరంగమే. 

మనుషులకు పాణం బాగా లేకపోతే ఎట్లాగో  తల్లడిల్లుతారో?   మొక్కలు జీవునం అట్లే విలవిలాడుతుంది.ఓ రెమ్మ రాలిన  ప్రతి కదలిక మార్పుని ఇట్టే కనిపెట్టగల గ్యానం బాలాజీకుంది.

 

వ్యవసాయం క్షేత్రంలోని మొక్కల మీద వాతావరణం పరిస్థితుల మీద పట్టు వచ్చింది.

 పాతాకులు పోయి కొత్త ఇగురేసిన  పదిహేను రోజుల్లో పూత దశకు చేరి, మరో పదిహేను రోజుల్లో పిందలేసినుంచి   కాయగా రూపాంతరం చెందుతుంది.

ఎగుడుదిగుడుగా ఉష్ణోగ్రతల కారణంగా మొక్కలకు పురుగుల తెల్లదోమ పట్టిందిమంచిగా ఏపుగా  దశలో పరిణామం అర్ధం కాలేదు.దానికి అరగంటలోనే ఎరువును  వేయాలని లేకుంటె ఇరవై నాలుగంటల్లో మొక్కలు పరిస్థితి అధ్వానం అవుతుందని పసిగట్టి సేంద్రియం పిచికారి చేశాడుమరుసటిరోజు కల్లా  ఆకులన్నీ నిగనిగలాడాయి.

అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్పాడు.

 

కుం రం భీం ఆసిఫాబాద్ జిల్లాకెరమరి గుట్టలో కొత్తరకం పండ్లతోట  మీద యువరైతు చేసిన ప్రయోగం ఫలించిందనీ విషయం వ్యవసాయం రైతుల ద్వారా   (సెంటర్ సెల్యులర్ మాలక్యులర్ బయాలజి, సిసిఎంబివీరభద్రమ్ సమాచారంమందింది.

 కొద్ది రోజులకే శాస్త్రవేత్తలకు ఆసక్తి పెరిగింది తెలంగాణలో చాలమంది విభిన్న పండ్లతోటల ప్రయత్నం చేశారు. కానీ బాలాజి ఒక్కడే అసాధ్యం సుసాధ్యాన్ని చేశాడని ఆనందం పడ్డారు.

శాస్ర్తవేత్తలు బాలాజి పంట గురించి తెలుసుకోవడానికి ధనోరా చేరారు.

క్షేత్రంలో పనిచేసే నౌకరిలతో, సేంద్రీయ ఎరువులు తయారు చేసేటోళ్లతో సుధీర్ఘంగా సంభాషణలు చేశారు.

 

మొదటి దశలో పది తెప్పించి నాటాను. మొక్కలకు ఐదువేల ఖర్సుయిందని విన్నవించాడుఅధికారితో బాలాజి.

 

నీవు సొంతంగా కష్టపడి ఇంత పెద్ద  తోటను స్రృష్టించావని అధికారి భుజం  తట్టి  నీకు మొక్కలు, సహాకారం ఇస్తామని 

మాటిచ్చాడు.

 

ఈ భూముల్లో కొన్నేండ్ల కిందటె తేయాకు తోటమీద పెంచాలనేది ఆదిమ గిరిజనులకుండేది  గ్యానం ఇప్పుడు పనికొచ్చింది. ఆదివాసి ప్రేరణ కూడా నా పండ్లతోటకు ఆలోచనకు బీజమైంది.

 

కూలిపోతున్న వ్యవసాయం భూములకు సారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నిలబెట్టాలని భూమిని కొత్త సేంద్రీయ విధానం చేయగా   విజయం కలిగింది.

ఊరిలోని  వారు గివ్వీ భూమిల మొలుత్తయామొలిసిన పేరుకత్తయా అన్నోళ్ళు రైతులు ఇప్పుడు

ఆశ్చర్యమైయ్యారు.

 

బాలాజితో కలసి  నడిచి వచ్చారు.

 

కొద్దిదూరంలో గల  సాకడ గ్రామంలో  సేంద్రీయ వ్యవసాయ పద్దతులు  కందులుమినుములు, కొర్రలు,సజ్జలు పాత పద్ధతులలో తీస్తున్నారు.

 

రాత్రులు సమాలోచన జరిగేది.

 

కొన్ని సార్లు అననూకూల వాతావరణం కావటంతో  కంటిమీద కునుకు లేకుండా చేసింది.

 

క్రమకమం తప్పకుండా పంట తీసే పద్దతిలో  ఎగుడుదిగుడుగా తట్టుకుని పింద దశలో ఉన్న మొక్కలను కాయలుగా రూపాంతరం చెందించండం కోసం ఆ తండ్లాట మాములు కాదు

 

బాలాజి "గ్రామీణ ఆర్థిక వేత్త"గా చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయం మీటింగుల్లో ప్రతిది మనం మార్చవచ్చు. వ్యవసాయ పద్దతులు మనం మార్చుకుని దిగుబడి పెంచుకుని మార్కెట్ శాసించాలని అదే మన రైతుల ఆశయం ఉపన్యాసమిచ్చాడురైతులకు ఉత్తేజం కలిగింది.

బాలాజీ తెలివి తేటల మనిషని ఎవరు అనుకోరు.భూమి దున్నడం మంచిదనుకునే మనిషిమొక్కలకు ఇరవై రోజులకు ఒక్కసారిజీవామృతం, డెబ్భై రోజులకుపంచగవాకలిపి జల్లి పచ్చగా నవనవలాడే తీరుగా పంటను చూసాడు.

 

రోజులు నెలలు గడిచాయి.

పువ్వు కాయగా మారే విధానం ఉందే దీన్నే మనకు అర్ధం చేయించేది ప్రకృతిజీవిత వేగాన్ని తగ్గించేది ప్రకృతిఅది ఎంత కావాలో అంతే ఇస్తుంది.

హ్రృదయం ఆనందంతో నిండిపోయింది. మొక్క ఎదిగేదశలో ఎన్ని అవస్థలు పడుతాయో అన్నీ తిప్పలు తప్పలేదు.

 

బాలాజీ,భూములోని "విత్తనం చనిపోతూ ఆపిల్ పంటను వాగ్దానం చేసింది"

వ్యవసాయ క్షేత్రంలో నూటయాభై గ్రాముల నుంచి నూటడైబ్బె గ్రాముల వరకు బరువుతోచిన్న సంత్ర పరిమాణంలో ఉండే  జమ్ముకాశ్మీరును  తలదన్నే ఆపిల్ తోట స్రృష్టించాడు.

 

ఇది పూర్తిగా విజయవంతమైంది.మరో వందలేకారాల వీస్తీర్ణంలో అపిల్ తోట స్థానికంగా  వెనుకబడిన గిరిజనులతో   పెద్ద లక్ష్యం ఉందని చెప్పాడు.

 

నన్ను నేను హ్రృదయ పూర్వకంగా అర్పించుకుంటున్నాను.

 

ధనోరా కెరమేరి గుట్టలు,కొండలు సేంద్రియ వ్యవసాయం పద్దతి ప్రయోగశాలగా మారింది .పదిమొక్కలతో మొదలై  నాలుగు వందల మొక్కలు ఆపిల్ తోటగా వీస్తిర్ణం ఎదిగింది..రోజు రోజు నాలుగు వందల మొక్కల ఆలనా పాలనా చూడటం మరింత కష్టమైంది.జీవామ్రృతం తయారు చేయడం మొక్కలకు అందించటం ,ప్రక్రృతి మార్పులకనుగుణంగా సేంద్రీయ తయారు చేయడం ఒక గొప్ప కార్యదీక్షగా జరుగుతుంది.

 

ఆదిమ గిరిజన జాతులు  శాస్త్ర ,సాంకేతిక పద్ధతులలో  మార్పుకు గురై ఆహారం తయారు చేసే పద్దతిలో చెల్లాచెదురైనారు.

ఆహారంలో మార్పులతో సంపూర్ణ ఆరోగ్యం వంతమైన తిండి సంపాదన సంకల్ప పూర్వకంగా,   చైతన్య పూర్వకంగా గిరిజన గ్రామాల్లో అవసరమైంది.ఇది శక్తివంతమైన పంటను తీసుకురావడానికి రైతులు చాలా సార్లు ఆహారాన్వేషణలో మొదటి స్థితికి రావడానికి తండ్లాడుతున్నారు.

మనిషి ప్రకృతిని అర్థం చేసుకుని  క్రమపద్దతిలో జీవనం కోసం తండ్లాడి "ఆపిల్ పంట"ఫలితం అందించాడు.

యువరైతు బాలాజి ఇంటిముందు పత్రికా విలేఖరులు, ఫోటోగ్రాఫర్లు కిక్కిరిసిపోయారు.

యువరైతు అంతరంగం తెలుసుకునే ప్రయత్నం చేశారు.

మనం బంగాళా దుంప తవ్వి పైకి తీసేందుకు కూడా యంత్రాలు వాడుతున్నాంరైతు  అభివృద్ధి పేరు మీద పెస్టిసైడ్ వాడి బాకిలయి అదే పోలంలా  రైతు కూలిగా మారి  లోపల ధ్వంసమైన జీవితం అనుభవిస్తున్నాడు.గిరిజన గ్రామాలు,మైదాన ప్రాంత రైతులు  వలసపోతున్నారుఅన్నింటికన్నా బలీయమైన తరతరాల భూమి సంబంధం తెగిపోయి బతుకుదెరువు కోసం చెల్లాచెదురుతున్నారని కడుపుల దుంఖంతో తను వచ్చిన దారిల దుంఖాన్ని దిగమింగి చెబుతున్నాడు.

 

ఐదారు సంవత్సారాల అలిసిపోని శ్రమ  వ్యవసాయ క్షేత్రంలో నెత్తుటి చెమట ప్రతిఫలం దక్కింది.

దేశవిదేశాల్లో మరియు  కాశ్మీర్ లో మాత్రమే కాదు  ఇక్కడ కెరమేరి గుట్టలో ధనోరా ఆపిల్ మారుముల గిరిజన గ్రామాల్లో పండించవచ్చని నిరూపించాడు

 “ప్రపంచ సేంద్రీయ ఆఫిల్ పంటతోఅనేక ఏళ్ళుగా రక్తహీనతకు గురవుతున్న అదివాసి గ్రామాలకు తన అపిల్ పండు ఆరోగ్యకరమైన జీవితం అందించాలని ,అనారోగ్య నుంచి విముక్తి పొందాలని తన కోరిక త్వరలోనే తీరబోతుంది.బాలాజి భారతదేశపు మరో పారికర్.

 

ముఖ్యమంత్రి  “ఆసిఫాబాద్ ధనోరా ఆఫిల్తోట పండు చేరుతుందిఅననుకూల స్థితి నుండి అనుకూలంగా మార్చుకుని ఆపిల్ తోట విజయం ప్రపంచానికే ఆదర్శ ప్రాయుడుకరోనా విపత్కర కాలంలో దేశాన్ని ఆదుకున్నది సాగురంగమే.రాజ్యానికి గుండెకాయారా స్రామ్రాజ్యానికి గుండె రైతురా.

కేంద్రీయ బాలాజి "తెలంగాణ  ధనోరా ఆఫిల్    హిరామన్ హెచ్ ఆర్ -99 పొత్తిళ్ళలో పురుడు పోసుకున్నమధురిమల ఆపిల్ ఫలాలుగా మలచి తెలంగాణ రైతు ప్రపంచమే  ఆదర్శంగా తీసుకుందిలక్షలమంది సేంద్రీయ రైతుల గొంతుకగా మారాడుభూమిని తలకిందులు చేసి పండ్లతోటల పెంచాడు.  ఎదిగిన ఎత్తుకి గిరిజన  రైతులను కూడా తన ఆశయంలో  భాగస్వామ్యం చేయడమే లక్ష్యం.వందల మంది  తిర్యాణి గ్రామ రైతులు బాలాజి వెంట నడుస్తున్నారు . ఒకవైపు ప్రపంచమంతా కరోనా  వైరస్తో కుప్పకూలిపోతుంటె, భూమిని నమ్ముకున్న బాలాజి  రైతు కొత్త ఆలోచనతో నిలబడ్డాడు.   రైతుబిడ్డ ప్రపంచం స్థితి మార్చడానికి భూమిలో శ్రామికుడైనాడు.

వేల ఏకరాల అపిల్ తోట అడవి చుట్టూ చిగురించాలని(కెడా కొడ్త్సా) ఆది నా ఊపిరిగా మరియు  నా లక్ష్యమని  వ్యవసాయం క్షేత్రం వైపు కదిలాడు.

 

 

 

సాహిత్య వ్యాసలు

ప్రకృతికి దగ్గరగా... ఒక ప్రయాణం!

దూరంలో పెదవాగు గట్టుపైన కొన్ని పక్షులు. పెద్ద ఆకారంలో గల శరీరం, రెక్కల పరిమాణం,పొడవాటి ముక్కు మరియు ఆకాశంలో ఎక్కువ ఎత్తులో  నుంచి నేలమీద పక్షులు మరియు జంతువులు  కనిపెట్టగల గుంపులుగా ఉన్నాయి.కళేభారాన్ని ముక్కుతోటి పొడుచుకుంటూ తింటున్నాయి.నీరు తాగడానికి పెద్దవాగులో వస్తున్నాయి. మధ్యలో ఆకాశానికి రివ్వున  ఎగురుతున్నాయి  ఆ పక్షులు. అవి  "రాబందులు"అని గుర్తుపట్టాను.

 

వాటిని నేను చిన్నప్పుడు చూశాను. పొలంలోకి గుంపులుగా వచ్చేవి.మళ్ళీ ఇప్పుడు అంతరించి పోతున్న అరుదైన పక్షి జాతి అనవాలు  ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ , నందిగామ పాలరాపు గుట్టలు దగ్గర కనిపించింది.

 

తెలంగాణ రాష్ట్రంలోని "ఆసిఫాబాద్- కుం రం భీం జిల్లా"  అటవీశాఖ ఆధ్వర్యంలో "బర్డ్ వాక్ ఫెస్టివల్"ను డిసెంబర్ 14,15 తేదీలు 2019  కాగజ్నగర్ ,పెంచికల్ పెట్,బెజ్జూర్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.

కాగజ్ నగర్ కోసిని, సిర్పూర్ (టి )మాలిని గుట్టలు,బెజ్జూరు పాలరాపు గుట్టలు,మెర్లిగూడ అటవీప్రాంతం మరియు ఆసిఫాబాద్ అడ "కుం రం భీం ప్రాజెక్టు" బర్డ్ వాక్ ఫెస్టివల్" సందర్శనం ఏర్పాటు చేశారు.  

 

  హైదరాబాద్ మొదలు ఔత్సాహికులైన నూటయాభై మంది  పాల్గొన్నారు. పక్షుల ప్రేమికులకు, ప్రకృతి ప్రేమికులకు  ఈ అడవిలో గల పక్షుల జాతులను గుర్తించి ఫోటోగ్రఫీ, డాక్యుమెంటరీ రూపోందించడానికి, బయట ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది.

 

నేను ప్రకటన చూడగానే అటవీ శాఖవారికి  ఫోన్ చేశాను. వివరాలు నమోదు చేసుకున్నాను.  పత్రికా ప్రకటన చాలా మందికి  ఫేస్బుక్, వాట్సాప్ పంపడం జరిగింది .కొంతమంది రావడానికి ఆసక్తి కనబరిచారు.

 

నాకు"బర్డ్ వాక్ ఫెస్టివల్" ప్రోగ్రాం మీద ఆసక్తిగా  వెళ్ళడానికి బలమైన కారణాలు అమ్మ నాన్న చెప్పిన సంగతులన్నీ యాదికొచ్చాయి.

 

చిన్నప్పుడు నాన్న చదివించిన పద్యం ,దాని భావం గుర్తుండిపోయాయి.

 

"అంజన గందీ, సౌరభం వ్యాపింపచేసేది చేసేది పుష్కలంగా ఆహారం ప్రసాదించేది. కృషి చేయకనే ఫలమిచ్చే శక్తి కలిగినది. మృగాలకు తల్లి అయినఅరణ్య దేవికి మొక్కుతున్నాను."

 

నా చిన్నతనంలో ఊర్విశకలు గూనపెంకల ఇంట్ల సందుల్ల గూళ్ళు కట్టుకొని ఉండేవి.కంచలా అన్నం ఏసుకుని కూసుంటె చుట్టూ కిచు కిచుమని ముద్దు ముద్దుగా తిరిగేవి. ఊర్విశకలు  చూర్ల కింద నివాసం ఏర్పరుచుకుని గుడ్లను పెట్టిపొదిగి  పిల్లలు చేసేవని నాన్న చెబుతుంటె నాకదంతా కోల్పోయిన  బాధ ఒకటి గుండెను తొలిచింది.

 

కొన్ని రకాల పిచ్చుకలు ఇప్పుడు కాంక్రీటు ఇంటిలో వస్తుంటాయి.గూళ్ళు పెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తాయి.కానీ వాతావరణం వేడిగా ఉండటంతో జాగ దొరుకకా అనూకూలం ప్రదేశం కోసం వెళ్ళిపోతాయి.

 

ఒకసారి ఇంటిలో పిచ్చుక నేను చూడగానే ఎగిరింది.ఫ్యాన్ రెక్కలు తగిలి మెడ  తెగి దూరం పడింది.అప్పుడు నా కన్నీళ్ళ ఆగలేదు.

అది నన్ను వెంటాడుతునే ఉంది.

 

నా చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడూ ముప్పై  కోళ్లు ఉండేవి. పుంజులు, పెట్టలు అన్నీ కలిపి ఓ ముప్పై పైనే ఉండేవి. మా అమ్మ వాటికి నూకలు వేసి ప్రేమగా పెంచేది.ఎర్రకోడి పుంజు, తెల్లకోడి పెట్ట అని వాటి రంగుల్ని బట్టి వాటి గురించి నేను అమ్మ మాట్లాడుకునేవాళ్ళం. 

 

కోడిపెట్ట రోజుకో గుడ్డు పెట్టేది. పొద్దున్న లేచి కోళ్ల గంపని ఎత్తగానే కోళ్ళన్నీ 'కోకొకొ' అని ఒక్కసారిగా ఎగిరిపోయేవి. గంప కింద కోడిపెట్ట గుడ్డు పెట్టిందా లేదా అని ప్రతిరోజూ ఆసక్తిగా చూసేవాడిని. ఆ గుడ్లన్నీ మా అమ్మకి ఇచ్ఛేవాడిని. కోళ్లకు,పుంజుల కాళ్ళకు రంగులు పూసేది.మా అమ్మ వాటిపై 1, 2, 3 అని అంకెలు వేసేది. కొన్ని గుడ్లని నాకు పొరటు చేసి పెట్టేది. కొన్ని గుడ్లని కోడి పొదగడానికి దాచిపెట్టేది. కోడి పొదిగేటప్పుడు దాన్ని ఎంతో  జాగ్రత్తగా చూసుకునేది. గంపకింద వరిగడ్డి వాసన వేసేది.బడి మధ్యాహ్నం సమయంలో భోజనం వచ్చి వాటిని చూస్తూ పొదిగిన గుడ్లను లెక్కలేసుకుని మరీ వెళ్ళెవాణ్ణి . కొన్ని సార్లు అయితే  స్కూలు ఎగ్గోట్టెటోణ్ణి.

 

కోడిపెట్ట పొదిగాక చిన్న చిన్న కోడి పిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చేవి. వాటిని తొలిసారిగా చూడటం, ముద్దుగా చేతిలో ఆడటం, వాటికి కోడి గింజలు తినడం నేర్పించడం, వాటిని రెక్కల కింద దాచిపెట్టడం, వాటిని కాపాడటానికి కుక్కలతో, పిల్లులతో యుద్ధం చేయడం ఇదంతా ఎంతో ఆసక్తిగా ఉండేది. నా కళ్ళ ముందే కొన్ని కోడి పిల్లల్ని పిల్లులూ కుక్కలూ తినేసేవి. కొన్ని జబ్బు చేసి చనిపోయేవి. వాటిని చూసి ఏడ్చేవాడిని. చివరకు కొన్ని మిగిలేవి. పెరిగి పెద్దవయి గర్వంగా మా ఇంట్లో మనుషుల్లా తిరిగేవి.

 

రామచిలుకను పంజరంలో బంధించి,జ్యోతిష్యుడు  వాడ వాడ తిరిగి జ్యోతిష్యం చెబుతుంటె, ఆసక్తిగా రామచిలుక చిట్టిపొట్టి మాటలను వినడానికి వెళ్ళి ఆనందం పొందేవాడిని.

రామచిలుకలు కూడా ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడా కనబడటం లేదు. 

 

ఆ విధంగా పక్షులతో నా అనుబంధం పెరిగింది.నా లాంటి వాడికి ఇది మంచి అనుభవం.

 

వారం రోజుల ముందుగానే అటవీ శాఖ జారీచేసిన షరతులతో పాల్గోనడానికి తయారు అయినాను.

ట్రావెలింగ్ బాగ్, ట్రెక్కింగ్ షూ,కాయిల్,చద్దర్లు,పలుచని రెండు జతల డ్రెస్ మరియు టీ షర్ట్ అంతా సిద్దంగా ఉన్నాను.

 

మేము మంచిర్యాల నుంచి రూపక్ రొనాల్డ్ , సంతోష్ పడాల మరియు హైదరాబాద్ నుంచి విజయ్, హేమంత్ ఒక గ్రూపులో ఉండాలని నమోదు చేసుకున్నాం.

 

మంచిర్యాల నుంచి పొద్దున్నే ఐదు గంటలకు డిసెంబర్ పద్నాలగవ తేదీ కాగజ్ నగర్  అటవీ శాఖ-పెంచికల్ పేటకు ప్రయాణమయ్యాం. హైదరాబాద్ మిత్రులు కాగజ్ నగర్ కు రైల్ మార్గం ద్వారా చేరుకున్నారు. దారిలో వారిని ఆత్మీయంగా పలకరించుకున్నాం. 

 

కాగజ్ నగర్ నుండి పెంచికల్ పేట్ ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంది.రోడ్డు మార్గం సరిగా లేని కారణంగా కారు ప్రయాణం నెమ్మదిగానే వెళ్ళడం వల్ల  అరగంట ఆలస్యంగా చేరుకున్నాం.

 

షెడ్యూల్ ప్రకారం ఆరుగంటలకు బ్రృందంతో కలిసి రేగుచెట్టు మడుగు వెళ్లి పక్షులు సందర్శనచేయాలి. మేం చేరుకున్న విషయం   పర్యవేక్షాణాధికారికి  తెలియజేయడానికి  ఫోన్ అడవిలో  కలవలేదు.గోస పడ్డాం.

 

ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి?ఆలోచన రాకముందే "ఎలూరు చెరువు"  వైపుకి కారుని దారిని మళ్లించాడు-సంతోష్ పడాల.

 

పెంచికల్ పేట మండలంలోని "ఏలూరు చెరువు "చాలా సువిశాలమైనది మరియు అవతలి వైపు కొండలకు వరకు  అనుకుని ఉంది.ఐదుతరాల చెరువులాగా ఉంది. దిగువన ఉన్న భూములకు ధాన్యం రాశి పంచేది.రైతన్నలా జీవితాలకు భరోసా ఇచ్చేదిగా ఉంది.వివిధ రకాలైన పక్షులకు విడిదిగా ఉంది.చెరువులో నీటి పక్షులు గుంపులు జట్టిలు, రణగొణ ధ్వని.ఒక తెల్లని కొంగు ఒడ్డున ఒక ఎత్తైన చెట్టు మీద కొమ్మపైన కూర్చుని ఆటలాడుతుంది.మాలో కొంతమంది చెరువును,చెరువులో వాలిన అందమైన రకరకాల పక్షులను క్లిక్ చేసారు.

 

చెరువు దగ్గర ఇద్దరు మహిళలు  అటవీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

వారు మాకు  పక్షులు గుంపులుగా ఉండే ప్రదేశాన్ని  చూపారు.మేమంతా కెమేరాలతో అటువైపు కదిలాం.

 

మా దగ్గరికి జీపులో అధికారి వచ్చారు. పెంచికల్ పేట పర్యవేక్షణ అధికారి  వేణుగోపాల్ సాట్లకి  మా మిత్రులను పరిచయం చేశాను .

 

అడవి లాగా విశాల ద్రృష్టి ఉన్నవాడు.

అడవిని ఇంచుమాత్రం వదలకుండా ,ఆకలింపు చేసుకున్నవాడు.అనుక్షణం అడవి గురించే ఆలోచిస్తాడు.

 

ఏలూరు చెరువు దగ్గర మరికొద్దిసేపట్లో 

ఫిసిసిఎఫ్ శోభ గారూ,ఐ.ఎఫ్. స్ రంజిత్ నాయక్ మరియు ఇతర అటవీ అధికారులు బర్డ్ వాక్ కార్యక్రమంలో భాగంగా మీటింగ్ ఇక్కడే ఉందని చెప్పాడు.

 

దగ్గరలోని "లోవ "గ్రామం వెళ్ళమని సూచించారు. హైదరాబాద్ నుంచి ఇంకొంతమంది కలిశారు .అందరం కలిసి లోవ్వ దారి వైపు అడుగులు వేశాం.

ఎక్కడ చూసిన మట్టిరోడ్లు  ,గొండు మరియు కోయ గ్రామాలను దాటుకుంటూ అగర్ గూడ వైపు వెళ్ళి దారి పక్కన  వాహనాలను ఆపాం.

రెండు కిలోమీటర్ల దూరంలో "లోవ్వ" ఉందని స్థానికులు చెప్పారు.

 

అడవి ఆరంభమైంది.కీకారణ్యం . రోడ్డు మలుపులో పెద్దబోర్డు దానిమీద పరుగెత్తుతున్న జింక పిల్ల బోమ్మ "అభయారణ్యం వన్యమృగ సందర్శనం చూసి ఆనందించండి"అని పెద్ద బోర్డు రాసి ఉంది.

కాలినడకన చీమల్లాగ ఒకరెనుక ఒకరు వరుసగా పత్తిచేన్లు , పంటపొలాలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళినాము.

 

వయ్యారంగా పాములెక్క సుడులు తిరుగుతూన్న వాగు కళ్ళకు కనిపించింది.

వాగు పేరు "పెద్దవాగు" . చుట్టూ  అందమైన అడవిలో పారే వాగు.

అవతలి తీరాన దిగంతం దాకా వ్యాప్తమైన అరణ్యాలు, ఆసిఫాబాద్ జిల్లాలోని అరణ్యాలు ఆకుపచ్చని కాన్వాస్ అయ్యాయి.నగరాలతో ఏమాత్రం సంబంధం లేని కనుచూపు మేరలో వ్యాపించిన అడివి.

 

పెద్దవాగు దాటుతున్న వేళ చిన్నప్పుడు వాగులో సోపతిగాళ్లతో ఈతకొట్టింది  అనుభూతి యాదికొచ్చింది.

పెద్దవాగు పెద్దమ్మలా అక్కున చేర్చుకుంది. ఇసుక దిబ్బలో కాళ్ళను తడుముతూ పాలనురగల నీటిని దోసిళ్ళతో చేతుల్లో తీసుకుని ఒకరిమీద ఒకరు పరాశికంగా నీళ్లు చల్లుకుంటూ ఉంటె కరకర కాగే ఎండలో ఎంతో గమ్మతే.చెలిమలో నీళ్ళని దోసిట్లో తాగాను.ఒడ్డున కొంచెం సేపు కూర్చున్నాం.పెదవాగు ఇసుక తిన్నెలు పైన ఆవు అడుగుపెట్టింది.నీళ్ళకోసం రెండు కాళ్ళు వాగులో దించి త్రృప్తిగా నీరు తాగుతోంది.

 

పెదవాగును చూస్తుంటె  కడుపు నిండా కవిత్వం  మనసు నిండా కమ్మని పాట  జలధారలా...

 

"వాగు వాగు సిగలోనా అందమైన అడవి

పాట పాడు పాయలోనా కొండ కోన అడవి

ఇసుక తిన్నెల గూళ్లు పక్కనే అదివాసుల ఇళ్ళు

పక్షుల కూతల సాళ్ళు ప్రపంచాన వెలసిన నాగరికత అనవాళ్ళు"

మనసు పలక మీద అక్షరాలు రాసుకున్నాను.

 

పెద్దవాగు దాటాం.అడవి తీరు చల్లని నీడ నిచ్చే చెట్లు లాగా  అక్కున  అలైబలాయ్ ఇచ్చి అలుముకున్నారు. 

 

"లోవ్వ "మరియు లోహ అటవీగ్రామాన్ని ఆదిమ కోయజాతి గ్రామాన్ని ఐదుతరాల చరిత్ర ఉన్న మట్టి మనుషులను కలిశాం. డెబ్బై మందికి మించి ఉండరు.

 

పూరిపాకలు, ముంగిట్లో బురద ,మురికి, పశువులు.రెబ్బెన అటవీ పరిధిలోకి  వస్తుంది.ఎనిమిది వందల హెక్టార్లలో అటవీ వీస్తీర్ణం ఉంది.

 

తెలంగాణ రాష్ట్రంలోని అతి దట్టమైన అడవిగా గుర్తింపు పొందిన ప్రాంతం.

వేసవికాలంలో అతిశీతల  ప్రదేశం మరియు చలికాలంలో గజగజ వణికే మంచు కప్పుకుంటుంది.మూడు వందల అరవై దినాలు నీరు పుష్కలంగా ఉండటంతో దుప్పులు, కొండ గొర్రెలు, కోతులు మరియు  ఆసిఫాబాద్( ఎ1),కడంబా(కె6) పులులు  సంచరిస్తాయి.

 

గుట్టల మీద నుంచి పారే నీటిలో ఐరన్ ధాతువు చాయలచూపించారు.ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.లోవ ప్రజలు అటవీ ఉత్పత్తులు, వ్యవసాయం మీద ఆధారపడిన కోయజాతులు.అడవి తీరు మాత్రం ఎక్కడో మొదలయ్యి ఎక్కడో అంతమయ్యే  అరణ్యంగా  సిద్ధపరిచిన యుద్దరంగంలా సాక్షాత్కరిస్తుంది.ఈ ప్రాంతంలో ఊటనీరు  ఎక్కువగా ఉండడం వల్ల జీవన వైవిధ్యం ఉంటుందని చదివాను.ఊట నీరుతోనే పంటలు పండిస్తారు.

 

పక్షుల కిలకిల రావాలు, అరణ్యం భాష మనసుకి హత్తుకునేలా ఉంది.అరుదైన పక్షులను జాడ వెతుకే క్రమంలో "బ్లాక్ డొంగ్రో"కనిపించింది.ఇది అరుదైన పక్షి జాతిగా గుర్తింపు పొందింది.ఎంతటి గాఢ ప్రశాంతతో,ఎంత అద్భుతమైన ఏకాంతం.ఎనిమిది గంటలకు తక్కువేం కాదు మొదటిరోజు అడవిలో గడిపాం.పక్షుల చప్పుడు, గలగల ఎండుటాకులతో మాట్లాడే అవకాశం దొరికింది.

 

ఇంకా పక్షులు చూడటానికి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడవిలో ఈశాన్య దిశలో నడుస్తూ "కళ్ళను చెవులుగా ,చెవులను కళ్ళుగా మార్చుకుని ముందు సాగుతున్నాం.

 

పాలపిట్టలు శుభాలకు, విజయాలకు చిహ్నం. దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తే అనుకున్నవి జరుగుతాయనీ  మొక్కుతారు. మన ఆచారాలూ, సంస్కృతి మరియు సంప్రదాయాలో పాలపిట్టకు ప్రత్యేక స్థానం ఉంది.

దీన్ని దసరా రోజున చూడడానికి

పురాణంలో చాల సిరియస్  పిట్ట కథే ఉంది.

 

పాండవులు అరణ్య, అజ్ఞాతవాసం వీడి ముగించుకుని  తిరిగి వస్తుండగా  పాలపిట్ట కనిపించిందట అందుకే  విజయాలు కల్గియాని జానపదుల నమ్మకం. అప్పటినుంచి దసరా పండుగ రోజు మగవారు అడవులకెళ్ళి పాలపిట్టను చూసివచ్చె ఆచారం మొదలైంది. 

 

ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,బీహార్ మరియు ఒడిస్సా  రాష్ట్రాల్లో మొక్కుతారు. పాలపిట్టను దసరా పండగ సమయంలో కొంతమంది  పంజరంలో చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంతమంది పాలపిట్టలను కొని వాటిని  ఊరిలోగాని పొలాల మధ్యలో   వదిలేస్తారు.పల్లెటూరిలో అక్కడక్కడా మెరుస్తున్నాయి.

కానీ సిటిలో కనబడటం లేదు.

 

మా నాన్నతో సింగరేణి మైన్ మీదికి  వెళ్ళినపుడు  ఒక పంజరంలో "స్కేర్లీ బ్రీస్టెడ్ మైనా" పక్షిని ఉంచి మైన్ లోపల ఒక పొడవైన పొల్ ఉంచేవారు.పక్షి కాన్సియస్నెస్ కోల్పోతే  ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని భావించేవారు.అది అప్పుడు గాస్ టెస్టింగ్ బర్డని అర్థమైంది.

 

మాతో పాటు గుడిసె వొదిలి, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ చేతిలో ఈటెను మార్చుకుంటూ మాకంటె ముందుగా నడుస్తున్నాడు ఆరడుగుల ఉన్న ఆరవై ఏళ్ల పైబడిన ముసలివాడు పుల్లయ్య.

 

అడవంతా  కలియతిరుగుతున్నాడు.

చేమ,వాగు,వంక ,రెమ్మలు,కోమ్మలు ,ఆకులు మరియు జంతు జీవాలుసందేశం ఇస్తాయి. అడవిలో చెట్లు అతనికి గల ఆనందోత్సాహాలతో ఇతరులకు కూడ ప్రేరేపించే విధంగా ఉంది .వనంలో వారి చలనం చూడముచ్చటగా ఉంది. కనులు మూసి తెరిచెంతలో చాలా దూరం వెళ్ళగలరు.

చూస్తుండగానే ఎంతో సమీపానికి రాగలరు.

 

అందరికీ ఒక "పుల్లతీగ" తినమని ఇచ్చాడు.నేను దాన్ని నోట్లో వేసుకుని కర్ర కర్ర నమిలాను చాలా తియ్యగా ఉంది.ఇది ఔషధ గుణాలు మొక్కని చెప్పాడు.అడవిలో నెమళ్ళు, పావురాలకు కొదువలేదు.

 

తుమ్మకోమ్మలకు జిలుగు బంగారు రంగులో  గడ్డిపోచలను తెచ్చి

పడకటిళ్ళు రచించి మానవులు సాద్యం కానీ పాన్పు తయారు చేసుకోనగా గాలి  ఊయల ఊపుతుంటె హాయిగా  నిద్రపోతున్న "గిజిగాళ్ళు"దారిలో పోతావుంటె అందమైన దృశ్యంలా అనేకం తారసపడ్డాయి.

 

అటవీశాఖ  అధికారులు ముందు  మేమంతా వెనక  నడుచుకుంటూ వారు చెప్పేది ప్రతి ఒక్కటీ  వింటూ... తెలియనిది అడిగినా వాళ్లు ఓపిగ్గా సమాధానం చెబుతున్నారు.  

 

లోహ బుడగ అడవిలో అరుదైన వృక్షాలను రేలా (క్యాష్ ఫిస్టుల) "నల్లమద్ది" దేవాలయాలకు ధ్వజస్తంభం ఉపయోగించే చెట్టు గురించి చెప్పారు.వివిధ జిల్లాల నుంచి ఇదివరకు దేవుడి ధ్వజస్తంభం కోసం చాలా అప్లికేషన్లు వచ్చాయి.వాటిని పరీశీలించి ఎక్కడైనా చెట్లు  పడిపోతే వాటిని అందజేస్తాం..అంటూ ఆ వివరాలు చెప్పుకొచ్చారు.

 

  యువ రాజకీయ స్పోక్ పర్సన్ క్రిషాంక్ పక్షుల సందర్శనంలో  భాగస్వామ్యం అయినాడు.

 

ఆంధ్రజ్యోతి పేపర్ మండల ఇంచార్జ్ నారా తిరుపతి అడవిలో మాతో పాటు తిరుగుతూ కొత్త సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. 

 

నలభై ఎనిమిది సంవత్సరాల సన్నగా చలాకిగా ఉన్న శంకరయ్య అడవిలో ఒక్కోక్క చెట్టు గురించి వివరంగా చెబుతున్నాడు పులుపు తీపి కలిసిన పరికిపండ్ల పండేరోజులవి.  చెట్టు మీద నుంచి ఒడుపుగా దులిపి కొన్ని పండ్లు    ఒక్కొక్కరికి తినమని ఇచ్చాడు. పరికిపండ్ల మీద జర్రున " కర్రె ఎద్దు ముట్ట పోతే ఎర్రెద్దు పొడవబట్టె" అడవికి  సంబంధించిన సాత్రం వదిలిండు. మమ్మల్ని కడుపుబ్బా నవ్వించాడు.

కేవలం అరణ్యప్రాంతమే  కాదు. ఎన్ని తరహా మనుషులను చూశానో  జ్ఞాపకం వచ్చింది‌. 

 

"బర్డ్ వాక్" ఫెస్టివల్ లో భాగంగా అడవి ప్రాంతాల్లో సుమారు రెండు వందల నలభై ఎనిమిది రకాల పక్షి జాతులు ఉన్నాయని "కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ బుక్లెట్ "చూపించారు.

 

 

చెట్ల  కిందనే పొయ్యి పెట్టి,గంజులు  బియ్యం ,పప్పులు ,ఉప్పులు చికెన్ "పెంచికల్పేట" మండల  కేంద్రం నుంచి తీసుకొచ్చారు. అటవీశాఖ అధికారులు దగ్గరుండి రుచికరమైన భోజనం వండించారు . 

 అడవిలో కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టిన వారికి మనసుల అభినందనలు  చెప్పుకున్నాను.  రోజు తినే భోజనం కన్నా ఆరోగ్యానికి బలవంతమైన పోషక విలువలు ఆహారం దొరికిందని సంబర పడ్డాం.ఏ ఫారెస్ట్ ఆఫీసులో అయినా చేయి తిరిగిన వంటచేసే మనుషులుంటారని నాకర్థమైంది. ఒకప్పుడు విన్నాను.ఇప్పుడు స్వయంగా చూశాను.

 

అడవి అందరిని ఒకే గొడుగుకింద కలిపింది.జీవన సరళి, బతుకుదెరువు కోసం వారు చేసే కఠోర శ్రమ ,వారి జీవన శ్రమ కష్టంగా ఉంది.

 

మైదానవాసుల  జీవన విధానానికి, అరణ్య వాసుల జీవన విధానానికి స్పష్టమైన తేడా ఉంది . ఒళ్లంతా హూనమయే  కష్టానికి తోడు అడివి పందులు వంటివి పంట నాశనం చేయడం ఒక పక్క ,సర్పాలతో పెద్ద పుల్ల వంటివి క్రూర మృగాలతో సహజీవనం మరోపక్క గిరిజనులను ప్రమాదం అంచున నిలబెట్టింది.

 

అంతటి దుర్భర దారిద్ర్యంలో కూడా జీవితాన్ని  గురించి  వారు ఒక వేదాంత తత్వం అలవరుచుకుంటారు. దీనివల్ల,ఎక్కడా ఎన్నడూ ఆశాకిరణం చొరబడనివీలుకాని అర్ధిక దుస్థితిలో ఉన్న దానితోనే  సరిపెట్టుకుని  సద్వినియోగం శక్తి కూడ వారికి అలవడి ,కష్టాలు దారిద్ర్యమూ  ఆరని  ఆకలిమంటలు కూడా  వారినంత బాధించవు . ఒక గొప్ప పోరాటపటిమను కొత్త శక్తిని ఎప్పటికప్పుడు అడవి ఇస్తూనే ఉంటుంది. జీవించే శక్తి పోరాడే శక్తి నిరంతరం ఇస్తూ ఉండటం అడవికే సాధ్యమేమో!?

 

లోవ గ్రామ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను "మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని తినే పెద్దపులి ఒకటి తిరుగుతుందో తెలుసా? మనుషులు తినే పెద్దపులి అంటే చాలా ప్రమాదం. దానికి రోషం ఎక్కువ గుడిసె ముందు  మంట వేసుకొండి.వేసుకుని గుడిసే లోపల  పడుకోండి. అడవి బాగా దగ్గరలో ఉంది.నిన్న గాక మొన్ననే మేకను పులి చంపి తిన్నది ఇంటి దగ్గరలోనే."

 

"ఇవన్నీ మాకు అలవాటైపోయింది" అని ఒకామె బదులిచ్చింది.

 

లోవ అడవి పక్షులకు నివాస స్థానం అని ముందే చెప్పారు. అక్కడ ఎన్ని రకాల  పక్షులో.. లెక్కేలేదు. పిచ్చుకలు పాలపిట్టలు, కపోతాలు, పెద్ద ముక్కు కొంగలు,ఎర్రముక్కు హంసలు, గద్దలు,డేగలు, కొంగలు, నీటి బాతులు  మొదలైనవి తోపులోన  పెద్ద చెట్లు చిటారు కొమ్మల్లోనా , నీటి ఒడ్డున నీళ్లను సంచరించే అనేక రకాలున్నాయి.

చిరాకెత్తించెలా  గోల చేస్తున్నాయి .

ఉల్లాసభరితమైన వాటి కూజితాలకూ  చెవులు చిల్లులు పడుతున్నాయి. అవి మనిషి ఉనికిని గమనించవు .నేను చూస్తూనే ఉన్నాను నా చుట్టూ నాలుగు పక్కల రెండు, రెండున్నర అడుగుల కొమ్మ మీద ఊగులాడుతూ కిచకిచమంటున్నాయి. నా వైపు చూస్తూ పక్షులు పిట్టలు నిర్భయంగా సమీపంలో సంచరించడం ఎంతో ఆనందంగా ఉంది. లేచి కూర్చుని చూసాను భయం లేదు. 

 

నేటి కాలంలో ప్రకృతి ఆరాధకులు అరుదు కారు. ప్రకృతిమాత పవిత్ర ప్రాంగణం మీదికి నానాటికి విజ్రృంభించి వస్తున్న ఆధునిక నాగరికత మూలంగా చెట్లు, పుట్టలు ,అడవులు, ఆరుబయలు కొండలు, గుట్టలు,పక్షులు  నిగూఢ అంతరాలలో జలజలా ప్రవహించే సెలయేళ్లు ,నదులు దీనితో సన్నిహిత సహచర్యం నేడు మనకు కరువైంది.

 

పెద్ద పెద్ద నగరాల్లోని  ఊపిరాడని వాతావరణం నుంచి విడివిడి  బయటపడాలనే ఆరాటం వల్ల,మనకు  ప్రకృతి అంత ఆకర్షణీయం మౌతుంది. భూములు కొన్ని వరదలో మునిగి పోవడం వల్ల అక్కడి జనం వేరు నివాస ప్రాంతాలు ఏర్పరుచుకున్నారు. ఆ గ్రామం కూడా స్థానిక ద్వారా ఈ విషయం తెలుసుకున్న మార్గం మధ్యలో గిరిజనులకు కిలో పత్తి ఏరితే  ఆరు రూపాయలు కూలీ దొరకటం "అరచేతిలో స్వర్గం దొరికేంతగా సంబరపడె  పేదల బాధలు చూసి మనసు  కుత కుత లాడింది."ఈనాటికి వ్యాపారుల చేతుల్లో గిరిజనులు ఉత్పత్తులు తక్కువ ధరకు అమ్ముకుని దోపిడీకి గురవుతున్నారు. పెదవాగు అరణ్యం దాటిన తర్వాత  ఏడు మైలు  పెంచికల్పేట్ క్షేత్రం వచ్చాము. సాయంత్రం సుమారు ఏడు ఏడు గంటలకు   చేరుకున్నాము.

 

పొద్దున్న ఆరుగంటలకు నందిగామ పాలరాపు గుట్టలకు  చూడడానికి  ప్రయాణం అయ్యాము. 

 

దారిపొడుగునా అంతటా కొండలు గుట్టలు మైదానాలు మధ్యమధ్య అడవులు మార్గాన్ని రెండు పక్కల నుంచి వేస్తూ కొంతదూరం ఇస్తూ ఈ విధంగా ఉంది. పగటివేళ ఒక తీరుగా ఉంది .వెన్నెల వచ్చిన తర్వాత ఏదో తెలియని అద్భుత సౌందర్యం. సౌందర్యభరితమైన అజ్ఞాత దేవలోకంలో వెడుతున్నామా! అనిపించింది.

 

పోతూ పోతూ మార్గమధ్యలో "రేగు చెట్టు మడుగు " .

జీప్  అపి కొంతసేపు అక్కడ అ వాతావరణం చూసి ఆనందించాం. పెద్దవాగులో రాత్రి  "నెగడు మంట" పెట్టారు. చుట్టూ ఆటలు ఆడుతూ,

పాటలు పాడుతూ గడిపారు.  పెద్దపులిని దగ్గరగా  చూసామని చెప్పారు.  చరవాణిలో తీసిన పులి అడుగులనుచూపించారు. అమ్మో ....అని నా పక్కనున్న యువతి భయపడింది. 

 

జీపు కదిలింది.అద్దంలో -మట్టిరోడ్డు, రాళ్ళు, చెట్లు వలయాలువలయాలుగ వెనుకబడిపోతున్నాయి.ఎవరి మీదనైనా   పులి దాడి చేస్తే  ఆ వ్యక్తిని దేవుడిగా పూజిస్తారు .మరియు గుడి కడతారు. అదిగదిగో అదే ముసలమ్మ గుట్ట చూడండి.అక్కడ  ఏలాంటి నావిగేషన్ పరికరాలు  పని చేయదు. కొండల్లో దారీ!దారిలో ఎక్కడా మనుషులుండరు. పులులు తిరిగే చోటని అధికారి చెప్పాడు.

 

నందిగామ గ్రామం చేరుకున్నం. ప్రాణహిత పెద్దవాగు ఒకే దగ్గర కలిసి చోట  దట్టమైన అరణ్యంలో పాలరాపు గుట్ట ఉంది. ఆ గుట్ట కన్నెత్తి చూడగా  కొంతదూరం వెళ్ళేసరికి ఆ దారి దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది . రెండు పక్కల బాగా ఎత్తైన ఇసుక ఒడ్డు పెద్దగా  నీటిలోతు దిగితే గానీ నీటి అంచు తగలదు .వెడల్పైన ఇసుక ఎండకి ఎండకి కళకళలాడుతుంది .అవతలి తీరాన మహారణ్యం ఈనాడు ఉంది .వాగులోనే మొక్కజొన్న పంటలను పండిస్తున్నారు .

 

లోవ పాలరాపు గుట్టనీ కలిపేది .పెదవాగు,ప్రాణహిత నదులూ గోదావరికి తోబుట్టువులుగా ఉన్నాయి.

సుమారుగా వాగు మధ్యలో కిలో మీటరు నడిస్తే పాలరాపు గుట్ట చేరుతాం.పెదవాగు ప్రాణహితలో కలుస్తుంది.రెండు నదులు గోదావరి గంగమ్మ తల్లి ముద్దాడుతాయి.

ప్రాణహిత అటువైపు గ్రామాలు ఉన్నాయి.

 

గోదావరి లోయ

ప్రాణహిత  పాయ

ప్రక్రృతి దోయ

పక్షులకు కూయ

అదివాసుల కిరిటం నాగరికత చాయ

 

 

ప్రాణహిత అలల మీద పాలరాపుగుట్ట 

జీవధార కనుల చూడ మెరిసే పూలబుట్ట

నెమలికిరిటమైన నెలవంక హారం పూసే మెట్ట

 

ఇప్పటికి నాటు పడవల మీద ప్రయాణమే శరణ్యం.

నాలుగు రోజుల క్రితం డ్యూటీలో నది దాటుతుంటె ఇద్దరు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు మృత్యవాత పడడం చాల బాధనిపించింది.

 

 

ప్రతి శీతాకాలంలో దేశ విదేశాల నుండి  వివిధ ప్రాంతాలలో అరుదైన పక్షులు వస్తున్నాయి ఇటీవల అముల్ పాల్కన్ పక్షి ఆడ, మగ రెండు కలిసి వచ్చాయి. చైనా రష్యా దేశాల నుంచి దక్షిణ ఆఫ్రికా మీదుగా వలస వెళ్లేటప్పుడు ఇండియన్ దాటే సమయంలో బెజ్జూర్ లోని మత్తడి వాగు స్ప్రింగ్ ఆనకట్ట ప్రాంతాల్లో ఈ పక్షులు అటవీ అధికారుల కంట పడ్డాయి. ఈ పక్షి రెండు నెలల్లో లక్ష కిలోమీటర్లు తిరుగుతాయి.

 

చిన్నప్పుడు రాబందులు గుంపులు గుంపులుగా పంట పొలాలకు వచ్చేటివి. నేను గట్లమీద వెళ్తున్నపుడు ఆవుల మృతకళేబరాల మీద వాలి మాంసం తినేవి. మళ్ళీ కొన్ని ఏండ్లు అవుతుంది. వాటి జాడ కనిపించడం లేదు. అంతరించే దశలో ఉన్నాయి .

 

బెజ్జూర్ మండలం లోని నందిగామ గ్రామం "పాలరాపు  గుట్టల్లో"    రాబందులకు నివసించడానికి అనుకూలంగాఈ ప్రాంతం ఉంది.స్థానికంగా రాబందులను "రాగపంతా " అని కోయలు అంటారు. 

 

ఇటీవల అటవీశాఖ అధికారుల బృందం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా డివిజన్ బెజ్జూర్ మండలం ,నందిగామ గ్రామం లో( లాంగ్ బెల్డ్ వల్చర్/ ఇండియన్ వల్చర్ (gyps indicus) గుర్తించారు. 

 

ఆవరణ వ్యవస్థలో రాబందుల పాత్ర ఎంతో కీలకమైంది. ఇవి  ప్రాకృతిక విచ్ఛిన్నకారులు గా పేరొందాయి. ఈ భూ ప్రపంచంలో మృతదేహాలను ఖననం చేయడానికి ఒక మనుషులు మాత్రమే చేస్తారు. ఏ ఇతర జీవి కూడా  ఖననాన్ని ఒక ప్రక్రియగా చేపట్టలేదు. మానవేతర మృతదేహాలను ప్రకృతి లోనే ఇలా వదిలివేయబడతాయి.ఇలా వదిలివేయబడిన మృతకళేబరాలను కుళ్లిపోక ముందే వాటిని  రాబందులు ఆహారంగా స్వీకరించి ప్రకృతి నుంచి తొలగించే పారిశుద్ధ పనిచేస్తాయి. ఒకవేళ ఆ పనిని సక్రమంగా జరగనట్లయితే కళేబరాలు కుళ్లిపోయి బ్యాక్టీరియా వైరస్ నెలవుగా మారి కలరా , ఆంత్రాక్స్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

 

ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సలీం మాటల్లో చెప్పాలంటే "రాబందులు దేవుడు సృష్టించిన ప్రాకృతిక విచ్చిన్నకారులు(incinators) భవిష్యత్తులో అధునాతన యంత్రం వీటి స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇంతటి శక్తి కలిగిన రాబందుల మనుగడ ప్రమాదంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అంతరించి పోవడానికి ప్రధాన కారణం పశువుల జబ్బులు నయం చేయడానికి వాడే నొప్పి నివారిణి డైక్లోఫెనాక్ ఔషధం పశువులకు విరివిగా వాడడం వల్ల జరుగుతుంది . పశువులు చనిపోతే వాటికి ఈ మందు అవశేషాలు మిగిలి ఉంటే సందర్భంగా ఆహారం మృత్యువాత పడుతున్నాయి.ఈ ఔషధ మందును  2006లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీని స్థానంలో " మోలాక్సికమ్" సూచించారు.

 

కేంద్ర ప్రభుత్వం  రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర ,హిమాచల్ ప్రదేశ్  మరియు అస్సాంలో మాత్రమే రాబందులు ఉన్నాయని గణాంకాలు చెబుతోంది .

పశ్చిమ బెంగాల్ లో రాజా అస్సాంలో రాణి వద్ద సంరక్షణ ఉత్పత్తి కేంద్రాలు అంతరించిపోతున్న రాబందులు తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం శుభపరిణామమే.

 

బెజ్జూర్ అడవుల్లో రాబందులు ముప్ఫై వరకు  పాలరాపు గుట్టలో గుహ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. కదలికలు ఆహారపు అలవాట్లు ప్రత్యుత్పత్తి మొదలైన అంశాలకు సంబంధించి అటవీశాఖ అధ్యయనం జరుగుతుందని అధికారి చెప్పారు . కొండపల్లిలో వృక్షశిలాజాల అవశేషాలు సుమారు ఆరువేల కోట్ల సంవత్సరాల కిందటి "కొనిఫర్"జాతికి చెందినవి ఉన్నాయి.మంచిర్యాల వేమన్న ప ల్లిలో కూడా ఉన్నాయి. వీటిని ఇదివరకు చూశాను . 

"ఫాసిల్ వుడ్"పార్క్ మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రతిపాదన ఉంది.

 

రాబందులను  మూడవసారి చూసే అవకాశం నాకు కలిగింది .యాభై మంది  వివిధ రంగాలకు చెందిన  వారితో ఈ యాత్ర మరిచిపోలేనిది. 

బెజ్జూర్ అడవుల్లో రాబందులు ముప్ఫై వరకు  పాలరాపు గుట్టలో గుహ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి.2013 సంవత్సరాలో 

అప్పటి అటవీ శాఖ రేంజ్ అధికారి రామ్మోహన్ గారూ రాబందులు  ఉన్నాయని గుర్తించారు.

 

 

ప్రొఫెసర్ అంజలి పాండే,జెన్టియు భరత్ సింహం,బయోలజిస్టు , అగ్రికల్చర్ ప్రొఫెసర్, ఫారెస్ట్ కాలేజీ స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో కలిశాం.

రెండు రోజుల పాటు జరిగిన" బర్డ్ వాక్ ఫెస్టివల్"పక్షుల జాతులు ,జీవన విధానం మరియు వాతావరణం అనుకూలత వివరించారు.

 

ఈ అడవిలో రెండు వందల నలభై ఎనిమిది రకాలు పక్షి జాతులు రికార్డు చేశాం. అందులో అరవై ఒకటి  జాతులు కామన్(సి) అసాధారణమైనవి(యుసి) అరవై ఐదు, సీజనల్  అరుదైనవి ఇరవై ఐదు  రకాలువెరీ రేర్  ఇరవై ఐదు జాతులు, అరవై ఏడు రకాల నీటి పక్షులు, పది  పక్షి జాతులు టెర్రిస్టిరియల్,నూట ముప్పయి అరొబియర్ పక్షుజాతులు మరియు పదిరకాల ఎరియల్ బర్డ్స్ ,రాప్ట్రస్ ఉన్నాయని గణాంకాలు చెప్పారు.

 

పర్యావరణ వ్యవస్థలో పక్షుల పాత్ర ఎంతో కీలకమైంది .

ముఖ్యంగా పరాగసంపర్కం విత్తనం ఫలదీకరణం, జీవవైవిద్యంలో  కీలక పాత్ర పోషిస్తాయి .చిన్న క్షీరదాలను   పక్షులను సరీసృపాలను కీటకాలను  తిని  వాటి సంతతిని తగ్గించి రైతుకు ఎంతో మేలు చేస్తాయని అటవీ అధికారుల అధ్యయంలో తేలింది.

 

నేనీ ప్రాంతాలకి రాకపోయినట్లయితే ఆసిఫాబాద్ జిల్లాలో ఇటువంటి పర్వత శ్రేణులు ,పక్షుల జాతులు ఉన్నాయని, అమెజాన్ అడవికి ఈ ప్రాంతం  సౌందర్యతలో ఎంత మాత్రం తీసిపోనిదని  ఎవరైనా చెబితే నమ్మలేక పోయే వాడిని. ప్రమాదాల భయాన్ని బట్టి చూసినా ఇవి తీసిపోవు.ఇక్కడ పులులు, ఎలుగుబంటి భయం వల్ల జనం ఈ అడవుల్లో తిరగరు.

 

ఈ అడవుల్లో పచ్చని ప్రకృతే కాదు.

ఎర్రని మందారాలు నెత్తుటి మడుగులో 

ప్రజలు కోసం పోరాడి అమరులైనారు.

కార్మికులు, కర్షకులు మరియు ఆదివాసుల పోరాటం అంతా అడవులే ముందుండి నడిపించాయి.

 

ఆసిఫాబాద్ జిల్లా దట్టమైన అరణ్యం,కొండలు, వాగులు వంకలు,జలపాతాలకు   నిలయమైంది.సప్తగుండాల,కెరమేరి, జోడేఘాట్,కుం రం భీం ప్రాజెక్టు, నందిగామ పాలరాపు గుట్టలు, వివిధ రకాల పక్షుల జాతులు,టైగర్  ఆవాసం ,ప్రాణహిత నది" ఆసిఫాబాద్ కుం రం భీం"టూరిజం సర్క్యూట్ విస్తరణ వీలు కల్గిన ప్రాంతం.

 

పర్యాటకం విహార యాత్ర ప్రదేశాలు అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోనే ఆసిఫాబాద్ జిల్లా ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతుంది. 

 

ఈ "బర్డ్ వాక్ ఫెస్టివల్" అనంద,విజ్ణానధాయకమైంది మరియు దుఃఖమైనది.  నేను అడవులో యాత్ర చేసినపుడు  అక్కడ అక్కడ పక్షులు మృత్యువాత పడడం చూశాను.చాల బాధనిపించింది .అంతేకాదు ప్లాస్టిక్ భూతం అడవుల్లోకి వీపరితంగా విస్తరించడం వల్ల  పర్యావరణానికి పెనుముప్పు కలుగుతుంది.   పర్యావరణ పరిరక్షణకు  స్వచ్చంద సంస్థలతో కలిసి నేను సైతం అవగాహన కార్యక్రమాలు చేసుంటే   పక్షులను కాపాడటంలో సఫలీకృతం అయ్యేవాళ్ళం.అలాంటి ప్రయత్నం చేయకపోవడం స్వయంగా అపరాధమే.

 ప్రక్రృతి  వినాశనానికి ప్రత్యక్షంగానో , పరోక్షంగానో నేను కూడ  భాద్యుణ్ణి. అందువల్ల  అరణ్యదేవతలు  నన్నెప్పుడూ క్షమించరని నాకు తెలుసు.

 

"ఓ అరణ్యమా!

ఓ ఆదిమ దేవతలారా! పక్షులారా  క్షమించండి,

నన్ను క్షమించండి.

ఇదే వీడ్కోలు మీకు "

 

.............

 

(వ్యాసకర్త  సినిమా గీత రచయిత)

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు