మా రచయితలు

రచయిత పేరు:    కెంగార మోహన్‌

సాహిత్య వ్యాసలు

దళిత సాహిత్య చేగువేరా  ''నాగప్ప గారి సుందర్రాజు''

ఎండిన పొలాలు రైతుల ఆత్మహత్యలతో నిరంతరం కరవురక్కసికి బలైపోతున్న రాళ్ళసీమగా పేరొందిన  రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా నేమకల్లు గ్రామంలో నాగప్ప గారి సుందర్రాజు జన్మించారు. తన తల్లి గారి ఊరైన ఆలూరు తాలూకా లోని మొలగవెల్లి కొట్టాల లో పెద్దనర్సమ్మ, రంగన్నలకు 31.05.1968న రైతుకూలీ కుటుంబంలో  రెండవ సంతానంగా జన్మించారు. అక్క రాణెమ్మ, తమ్ముడు ఆనంద్‌, చెల్లెలు గాయత్రి. ప్రాథమిక విద్య 1నుండి 5తరగతుల వరకు  మొలగవల్ల కొట్టాలలోనూ, 6 నుండి 10 తరగతుల వరకు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల గుంతకల్లులోనూ, ఇంటర్మీడియేట్‌ (హెచ్‌.ఇ.సి) పత్తికొండ జూనియర్‌ కళాశాలలోనూ,  బి.ఏ. తెలుగు సాహిత్యం అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలోనూ, యం ఏ, యం.ఫిల్‌, పిహెచ్‌డి కేంద్ర విశ్వవిద్యాలయం  హైదరాబాద్‌ లో చదివారు. దళిత కథలపై పరిశోధనలో భాగంగా యం.ఫిల్‌,  పిహెచ్‌డిలు  పులికంటి కృష్ణారెడ్డి దళిత కథలపై చేశారు. దళితసాహిత్యంలో విశేషంగా కృషిచేసిన దళిత సాహిత్య చేగువేరా  నాగప్పగారిసుందర్రాజు. 1995లో గుండెచప్పుడు, 1996లో చండాలచాటింపు,1997 ఫిబ్రవరిలో మాదిగోడు,1997 డిసెంబర్‌లో  మాదిగ చైతన్యం, 1999లో మాఊరిమైసమ్మ, బొంబాయోడు గోండుజోగమ్మయ్యేడ వంటి రచనలు చేశారు. మూఢనమ్మకాలు సాంఘీక దురాచారాలపట్ల కథలు విశ్లేషించినప్పుడు నాగప్పగారి సుందర్‌రాజు రచనల్లో వచ్చిన బస్విని కథలు తెలుగు కథా సాహిత్యంలో సంచలనాలుగా పేర్కొనవచ్చు. సుందర్‌రాజు 'సువార'్త అనే కలం పేరుతో 'అక్క చచ్చిపోయింది' అనే శీర్షికతో రాసిన మొదటి కథ 1995లో దళిత రాజ్యం అనే పత్రికలో అచ్చయింది. 1997లో 10 కథలతో వచ్చిన 'మాదిగోడు' తోపాటు 'మాఊరి మైసమ్మ', 'బొంబాయోడు గండు జోగమ్మయ్యేడ్య' ఈ రెండు కథలు 1999లో వచ్చాయి. తన కథల్లో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న బసివిరాలు వ్యవస్థ రద్దు కావాలని మాల, మాదిగ స్త్రీలు పటుతున్న ఆవేధనను కథలుగా రాశాడు. 'నడిమింటి బోడెక్క బసివిరాలు' అయ్యేద అనే కథ కన్నీళ్ళు తెప్పిస్తుంది. బసివిరాలు అంటే దేవదాసి. అట్టడుగు స్థాయి కన్యను దేవుడి సేవకు యావజ్జీవం వదిలిపెట్టడం.జ్ఞానపీఠ పురస్కార గ్రహీత  విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలలోను దేవదాసి పాత్ర ఉన్నది. గురుజాడ అప్పారావు రాసిన కన్యకలోను ఈ వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ తెలుగు కథా సాహిత్యంలో మైలురాళ్ళు. నడిమింటి బోడెక్క బసివిరాలు కథలోని పాత్రలు, కథ చెబుతున్న బడికివెళ్ళే కుర్రాడు, పాఠాలు చెప్పే కరణం, మాస్టారు కూడా అయిన శంకరప్ప పాత్రల్ని సుందర్‌రాజు అద్భుతంగా సృష్టించాడు. రాయలసీమలోని పేదల జీవితాల్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోకపోతే ఇటువంటి కథలు పుట్టవు.  సామాజిక రుగ్మతల్ని సుందర్‌ర్రాజు కథల్లో చూపించారు. బసివిరాలి వ్యవస్థ, జోగిని, దేవదాసి వ్యవస్థలు ఎన్ని చట్టాలొచ్చిన అంతరించిపోక ఉండటం కథకులకు గొప్ప కథా వస్తువులయ్యాయి. పేద దళితుల జీవితాలను చక్కటి కథాశిల్పంతో పాత్రలను సృష్టించారు.

బిగించిన పిడికిలి ''చండాల చాటింపు''

                నాగప్ప గారి సుందర్రాజు దళితసాహిత్యంలో బాగా కృషిచేశాడని అనడం కంటే ముందు మాదిగ సాహిత్య పితామహుడు అనక తప్పదు. సుందర్రాజు నిన్న మొన్నటి కవే కదా పితామహుడెలా అవుతాడని దళితులే అంటుంటారు. దానికి సహేతుక కారణాలు లేకపోలేదు. దళిత అస్తిత్వంతో కవితలు కథలు రాసి ఉండవచ్చు కాని, మాదిగ  జీవన స్థితిగతులను కవిత్వీకరించి కవిత్వ సంపుటీలు సుందర్రాజు కంటే ముందు తెచ్చిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 1983లో పాదిరికుప్పం, 1985లో కారంచేడు, 1992లో చుండూరు మారణకాండల నేపథ్యంలో దళతుల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికి ఉద్యమం ఎగసి పడింది. దళిత సాహిత్య విస్తృతికి చైతన్యానికి ఈ సంఘటనే కారణం కాదు. మారుతున్న సమాజాన్ని చూస్తున్న అక్షరం వైపు అడుగులు వేశారు. అగ్రవర్ణాలకే పరిమితమైన సాహిత్యాన్ని సంఘసంస్కర్తలు చేసిన ఉద్యమ స్ఫూర్తితో పీడిత ప్రజలు కలాలను ఝుళిపించారు.  దళితజీవితాన్ని దళితులే రాసిన మొదటికథ గొట్టిముక్కల మంగాయమ్మ రాసిన 'అయ్యోపాపం'(1935). వీరిని మొదటితరం దళిత కవులని భావిస్తే రెండోతరంలో కొలకలూరి ఇనాక్‌ 'అస్పృశ్యగంగ', ఎండ్లూరి సుధాకర్‌ 'మల్లెమొగ్గలు', నాగప్ప గారి సుందర్‌రాజు రాసిన 'మాదిగోడు' 'మా ఊరి మైసమ్మ' , పి. కనకయ్య సంకలనకర్తగా వచ్చిన 'ఎదురుచూపు' 'మేమిట్లుండం' జాజుల గౌరి రాసిన 'మట్టిబువ్వ'. ప్రత్యేకంగా సుందర్రాజు  1996లో చండాలచాటింపు కవిత్వం తీసుకొచ్చాడు. ఈ సంపుటిని కర్నూలు జిల్లా సాహితీస్రవంతి మలిముద్రణను ఇటీవల ప్రచురించి ఆవిష్కరించింది. ఈ కవిత్వంలో సుందర్‌రాజు మాదిగ సాహిత్య పితామహుడు అన్నదానికి అనేక ఆధారాలు కనిపిస్తాయి.  ఆ ఆధారాలను పరిశీలిద్ధాం..చండాల  చాటింపు తెలుగు సాహిత్య చరిత్రలోనే సంచనలం.  మాదిగ అస్తిత్వమే అయినప్పటికీ అసమానతల సమాజంపై విరచుకుపడిన కవితా కెరటం. అనాటికీ ఈ నాటికీ ఏం తగ్గలేదు. కాలం మారింది. వివక్ష రూపం మారిందంతే. ఈ కవిత్వం ప్రత్యేకంగా మాదిగ  అస్తిత్వం అని అనాలన్నా, అనేక వస్తువుల్ని స్పశించాడు. ఈ కవిత్వాక్షరాల నిప్పుకణికలను పరిశీలిస్తే.. మొదటి కవితలోనే..

 

''కాళ్ళొచ్చినప్పట్నుంచి

నీళ్ళు తెచ్చేది నేనే

పేరుకు మాదిగోళ్ళ బోరింగే! కాని

ఊర్లో వాళ్ళంతా ఉపయోగించుకోవడమే'' (మాదిగోళ్ళ బోరింగు)ఈ మొదటి కవితలో సుందర్రాజు మాదిగ యువతిగా పరకాయప్రవేశం చేశాడు. మాదిగ స్త్రీ గా పరిచయం అయ్యాడు.  కౌమారదశలో ఆ యువతి భావోద్రేకాలను, మనో, శారీరక వాంఛలను ప్రతిబింబింప జేశాడు. బోరింగును అందరూ వాడుకుంటున్నట్టే తనను కూడా వాడుకుంటారని ఏ అగ్రవర్ణమూ మనవాడేందుకిష్టపడరని తనేమో ప్రేమలో పవిత్రత కాంక్షిస్తూ వాళ్ళేమో కామిస్తారని మాదిగోళ్ళ బోరింగుకు, మాదిగోళ్ళ యువతికి తేడా లేదని నిరూపించే ప్రయత్నం చేస్తాడు. ఈ కవిత చదివినవాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు కన్నీటి పర్యంతమవుతారు. సుందర్రాజు స్త్రీ గొంతుకగా మారతాడు. తు కవితల్లో, కథల్లో స్త్రీ వేధనే వస్తువు. ముఖ్యంగా మాదిగ స్త్రీ ఆర్తనాదం. సుందర్రాజు 1997 ఫిబ్రవరిలో మాదిగోడు,1997 డిసెంబర్‌లో  మాదిగ చైతన్యం, 1999లో మాఊరిమైసమ్మ, బొంబాయోడు గోండుజోగమ్మయ్యేడ వంటి రచనలు చేశారు. మూఢనమ్మకాలు సాంఘీక దురాచారాలపట్ల కథలు, బస్విని కథలు తెలుగు కథా సాహిత్యంలో సంచలనాలుగా పేర్కొనవచ్చు.  నాగప్పగారి సుందర్‌రాజు సుందర్‌రాజు 'సువార'్త అనే కలం పేరుతో 'అక్క చచ్చిపోయింది' అనే శీర్షికతో రాసిన మొదటి కథ 1995లో దళిత రాజ్యం అనే పత్రికలో అచ్చయింది. 1997లో 10 కథలతో వచ్చిన 'మాదిగోడు' తోపాటు 'మాఊరి మైసమ్మ', 'బొంబాయోడు గండు జోగమ్మయ్యేడ్య' ఈ రెండు కథలు 1999లో వచ్చాయి. తన కథల్లో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న బసివిరాలు వ్యవస్థ రద్దు కావాలని మాల, మాదిగ స్త్రీలు పటుతున్న ఆవేధనను కథలుగా రాశాడు. 'నడిమింటి బోడెక్క బసివిరాలు' అయ్యేద అనే కథ కన్నీళ్ళు తెప్పిస్తుంది. బసివిరాలు అంటే దేవదాసి. అట్టడుగు స్థాయి కన్యను దేవుడి సేవకు యావజ్జీవం వదిలిపెట్టడం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత  విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు నవలలోను దేవదాసి పాత్ర ఉన్నది. గురుజాడ అప్పారావు రాసిన కన్యకలోను ఈ వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ తెలుగు కథా సాహిత్యంలో మైలురాళ్ళు. నడిమింటి బోడెక్క బసివిరాలు కథలోని పాత్రలు, కథ చెబుతున్న బడికివెళ్ళే కుర్రాడు, పాఠాలు చెప్పే కరణం, మాస్టారు కూడా అయిన శంకరప్ప పాత్రల్ని సుందర్‌రాజు అద్భుతంగా సృష్టించాడు. రాయలసీమలోని పేదల జీవితాల్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోకపోతే ఇటువంటి కథలు పుట్టవు. కథలో బసివిరాలుగా విడువబడే పిల్ల వయసు పదేళ్ళు. పదేళ్ళ పిల్లను బసివిరాలుగా విడువలేదని రెడ్లతోపాటు అతని కులస్థులే ఆ పిల్ల తండ్రిని ఒప్పిస్తారు. తిరస్కరించిన తండ్రిని మనవూళ్ళో మూడేళ్ళ పసిపిల్లను బసివిరాలుగా విడువలేదా? అని ప్రశ్నిస్తారు. కథ కొనసాగే కొద్దీ అమ్మవారి పండుగ, పోతురాజు పండుగలు కనిపిస్తాయి.  ఉత్సవానికి అయ్యే ఖర్చును తానే భరిస్తాను అంటాడు ఆ ఊరి రెడ్డి. గ్రామ పెద్ద న్యాయం నిర్ణయించడం, ఆర్థిక ఆంక్షలూ కనిపిస్తాయి. కథలో గ్రామ రెడ్డి పాత్రలో కర్ణాటకలో రెండువేలకే పది మంది బసివిరాండ్రనిడువవచ్చు, నీ బిడ్డేమన్నా భూలోకరంభనుకున్నావా? అని నీచంగా పంచాయితీలో తిడతాడు. ఎవరెన్ని చెప్పినా నడిమింటి బోడెక్క బసివిరాలయ్యింది. దేవర పోతును బలిస్తున్నట్లుగానే బసివిరాలిని చేసే పండుగలో బలివ్వాలి. ఇలాంటి సామాజిక రుగ్మతల్ని సుందర్‌ర్రాజు కథల్లో చూపించారు. బసివిరాలి వ్యవస్థ, జోగిని, దేవదాసి వ్యవస్థలు ఎన్ని చట్టాలొచ్చిన అంతరించిపోక ఉండటం కథకులకు గొప్ప కథా వస్తువులయ్యాయి. పేద దళితుల జీవితాలను చక్కటి కథాశిల్పంతో పాత్రలను సృష్టించారు.నాగప్పగారి సుందరరాజు రాసిన 'మాదిగోడు' కథా సంపుటి తెలుగు కథా సాహిత్యంలోనే ఒక  విప్లవ కెరటం. రాయలసీమలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే దళితుల జీవిత వాస్తవికతను దళిత దృష్టికోణం నుంచి స్వీయ కథాత్మకంగా రచించాడు. ఇందులోని పది కథలు భారతదేశ గ్రామాల్లో దళితుల జీవిత సౌందర్యాన్నీ, దళితుల ఆలోచనలను సాంస్క ృతిక సౌభాగ్యాన్ని ప్రదర్శించాయి. 'బోడెద్దు' కథ చనిపోయిన పశువుని కోసి వండుకొని తినే సంప్రదాయాన్ని ఒక గొప్ప అనుభూతిగా ప్రదర్శించింది. ఎన్ని అణిచివేతలకు గురవుతున్నా దళితుల్లో కూడా ఉండే కోరికలు, అగ్రవర్ణ స్త్రీల పట్లన్నా ఉండే ఆకర్షణలు సుందరరాజు 'ఈరారెడ్డి మనుమరాలు మీద మొనుసుండాది' లాంటి కథల్లో వాస్తవికంగా ప్రదర్శించాడు. దళిత స్త్రీని లోబరుచుకునే క్రమంలో అగ్రవర్ణాల వాళ్ళు బసివిరాండ్రుగా మార్చేక్రమాన్ని 'నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద్య' కథలో ప్రతిబింబించాడు. 'మాదిగోడు'లో అగ్రవర్ణాల దౌష్ట్యాన్ని మాత్రమే కాకుండా దళితులలోని కళాత్మకతను కూడా ప్రదర్శించి సుందరరాజు తెలుగు కథలోకి ఒక కొత్త వస్తువును, కొత్త శిల్పాన్ని తీసుకొచ్చి పరిచయం చేశాడు. అగ్రవర్ణాలు దళితుల మీద చేసిన పాశవిక దాడుల మూలంగా దళితుల్లో చైతన్యం పెరిగి తిరుగుబాటు ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో దళితసాహిత్యం ఉద్యమరూపం సంతరించుకున్నది.  ఈ నేపథ్యంలో రెండోతరంలో దళిత కవుల్లో అగ్రస్థానం సంపాదించుకున్న కవుల్లో అగ్రగణ్యులు  నాగప్ప గారి  సుందర్రాజు. సుందర్రాజు చండాల చాటింపులోని మరో కవితలో చెరచబడిన మాదిగ స్త్రీ ఆర్తి చెబుతూ..

 

నేను!..

వికసిస్తుంటే

పురోహితులకు పురిటి నొప్పులా!

నేను! పరిమళిస్తుంటే పురుష ప్రపంచానికి-బైకులబాధ!

మీరు సవాలక్ష చెప్పండి

నేను చెరచబడ్డదాన్నే!

 

నా మానం పోయాక..

మీ గూర్చి మాట్లాడలేను.(సిన్నక్క సహనం సన్నగిల్లిన వేళ)   కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామంలో 27.07.1995న ఒక హరిజన మహిళను ఇద్ధరు పోలీస్‌ కానిస్టేబుళ్లు ఐదుగురు కలసి సామూహిక మానభంగం చేసిన సంఘటన తెలిసి తీవ్ర మనస్థాపానికి గురైన నేపథ్యం నుంచి రాసిన కవితలో కూడా సుందర్రాజు చెరచబడ్డ స్త్రీగా మారిపోయాడు. స్త్రీ వాదమంటే ఏమిటో ఆనాడే అర్థం చెప్పాడు. స్త్రీలు రాస్తేనే స్త్రీవాదమా? నిజమే కావచ్చు. అంత గాఢత, తడి, ఆర్తి ఉండకపోవచ్చు, కాని సుందర్రాజు కవిత్వం చదివితే ఆ అభిప్రాయం తప్పనిపిస్తది.

                రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో మాదిగల్ని పెద్ధింటోళ్ళ అంటారు. అది తరతరాలుగా పిలుస్తున్న పేరు. ఈ ప్రాంతం కర్నాటక సరిహద్దు తుంగభద్ర నదితీరంలో వుంటుంది. కన్నడ-తెలుగు భాషల కలయికతో ఏర్పడిన ప్రత్యేక మాండలికం. తెలుగుసాహిత్యంలో ఆదోని మాండలికంలో కథలు రాసి సంచలనం సృష్టించిన కవి రచయిత నాగప్పగారి సుందర్రాజు. దళితసాహిత్యంలో విశేషంగా కృషిచేసిన సాహిత్య పిపాసి కూడా. యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలతో ఆదోని ప్రాంత తెలుగు మాండలికం కన్నడతో మిళితమై వుంటాయి. సుందర్రాజు ఆ ప్రాంతం వాడై నందుకు ఆ యాసను భాషను వొడిసి పట్టుకున్నాడు. యువతి పుష్పవతి అయితే వేడుకగా జరిపే సాంప్రదాయముంది. అదే మాదిగ పిల్ల పుష్పవతి అయితే ఎదుర్కొనే అవమానాలు, వివక్ష కవిత్వంలో ప్రత్యక్షకథనంలో తాను పాత్రధారియై మారిపోతాడు. ఈ ప్రాంతంలో మాలలు కూడా మాదిగలకు అగ్రవర్ణాలే. ఆ అంతరాలను ఎలా చెప్తాడంటే..

పెద్ద రెడ్డెమ్మ బిడ్డ పెద్దమనిషి అయినప్పుడు

అమ్మ వదద్ధన్నా వినకుండా పోయి

గాటిపొట్టున నిలబడి

గంటల తరిబడి పాడాను

మాదిగ మల్లక్క బిడ్డ

మంచిగా పాడిందని

ఊరంతమంది మెచ్చుకుంటుంటే ఉబ్బిపోయాను

సాకలి సంజప్ప మనవరాలు

పెద్ద మనిషి అయినపుడు పాడమన్నారు

పడసాల కట్టి ఎక్కినీకపోయినా

పదాన్ని అందుకున్నందుకు

పట్టపగ్గాలు లేవు నా సంతోషానికి

ఊరిలో ఏకులస్థుల పిల్ల పుష్పించినా

నా పాటకు పరువు ఉండేది

పందిట్లోకి రానీకపోయినా

పరమాన్నము వాళ్ళపాత్రలో పెట్టకపోయినా

దిక్కులు పిక్కటిల్లేలా పాడేదాన్ని

తెల్లార్లు పాడితే

నన్నూ నా తల్లినేగాక

మా మాదిగ జాతినే మెచ్చుకునేవాళ్ళు

మాల ఈరన్న చెల్లెల్ని కర్చూబెట్టినప్పుడు

మర్యాదగానే పిలుచుకుపోయారు

కట్టకింద కూర్చోనే పాడమన్నపుపుడు

మా పెద్దమ్మ రంకుబెట్టుకునింది

ఉలిగెమ్మవ్వ ఉపన్యాసం విన్నాక

మేము తక్కువ కులస్థులమని తెలిసింది

యాడ కూసంటే ఏముందని

ఆపుకోకుండా ఆరో పాట పాడాను

గొంతెండుకుపోయి మంచినీళ్ళు అడిగితే

మాల సిన్నక్క సిలువరు సెంబుతో

దోసిట్లోకి పోసింది.. ఈ కవితలో మొత్తం మాల మాదిగల అంతరాలున్నయని స్పష్టం చేస్తాడు. ఊళ్ళో ఏ కులానికి చెందిన అమ్మాయి పెద్దమనిషి అయినా అంటే పుష్పించినా మాదిగపాపే పాటపాడ్తది. కాని పాటపాడే ఆ పాపే పెద్దమనిషి అయితే   ఏ కులానికి చెందినవాళ్ళు పాటపాడేందుకు రారు. ఆ పాప బాధ పడ్తుంది. బాధను దిగమింగుకుని..

 

నేను పెద్దమనిషై కూసుంటే యా యమ్మా రాలేదు

చూసేకి మా వాళ్ళు దండిగుండారు

ఆరున్నర సుతిలో ఎత్తుకున్నారు

నాపాట నేనే పాడుకుంటా

మాదిగ పాటను మధురంగా పాడుకుంటా..(పెద్దింటిపిల్ల)

                దళితసాహిత్యంపై పరిశోధన చేయదలచిన దళిత విద్యార్థులు అందరికి 1995-96 సం.నికి ఎంఫిల్‌ అడ్మిషన్‌ లేకుండా చేసిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిరంకుశ ఆర్య సంస్కృతిని నిరసిస్తూ..                           నా చేతిలో ఉన్నది ''రంపె''

నా చేతిలో ఉన్నది ఆరె

ఒరేయ్‌! పదును గురించి ప్రశ్నించావా!?

నా పిక్క సత్తువ చూపిస్తా

పచ్చి నెత్తురు తేగేస్తా!(డప్పు కొట్టిన చేత్తో డొక్క చీలుస్తా). మాదిగలు చెప్పులు కుట్టే, తోలు ఒలిచే పనిముట్లను కవిత్వంలో ప్రవేశపెట్టిందితడే. ఈ చండాల చాటింపు మరో కవిత సల్లంగ దీవించి నన్ను సాగనంపమ్మా! అన్న కవితలో కూడా మాదిగ పనిముట్లను వాడుతూనే యస్సీల రాజ్యాధికారం కోరుకుండాడు.

గాలిని నిర్భందిస్తే-సుడిగాలిని సృష్టిస్తా!

రాజ్యాధికారం రంకేస్తుంది

నా చేతిలో '''రంపె'' పదునుక్కుతుంది.

ఈ కవితకు నేపథ్యం 17.03.1995లో అదిలాబాదు జిల్లా పిప్రి గ్రామంలో హరిజనులపై అగ్రకుల దురంహంకారులు చేసిన దాడిని ఖండించే క్రమంలో రాశారు. గుండె చప్పుడు కవితలో కూడా ..పవరేమి అనుకుంటే నాకేమి! 'ఆరె' పట్టుకుపోతున్న/ చీమల దండు కదిలింది అంటాడు. ఇది మాదిగ చైతన్యానికి ప్రతీక. చండాల చాటింపు కవితలోనూ ఆవులలోని అవయవాలను కవిత్వీకరించాడు.

ఆవుకొవ్వు, ఎనుంగొడ్డు ఎముక/

ఎదురొమ్ము-తోలు నంజిరి/

కాలిగెట్లు

మూలుగ ఎముకలు

పచ్చిపేగు దబ్బ

నెరడి ఈరిగ గుండెకాయలు .......ఇవన్నీ మాదిగ కవిత్వంలో కవితా పదాలై అలరించాయి. ఇంత ఘాటుగా రాసిన సుందర్రాజు మాదిగ జాతి యుగపురుషుడే. దళితుల స్థితిగతుల మీద ఎంతమంది కవిత్వం రాసినా ప్రత్యేకంగా మాదిగ జీవితాల మీద కవిత్వం రాసింది సుందర్రాజే. తను తన ప్రాంతంలో తన జాతి ఎదుర్కొంటున్న వివక్ష అవమానాలను కళ్ళకు కట్టినట్లు వాస్తవచిత్రాలుగా, మాదిగ రేఖా చిత్రాలుగా చిత్రించాడు. యస్సీల ఎబిసిడి వర్గీకరణ సమస్యను కూడా చాలా సున్నితంగా చెబుతూనే జీవనాధారమైన నీళ్ళను సేకరించడటానికి రాయలసీమలో వాడే మంకెనబుట్టను తయారు చేసిన మాదిగవాడి పని తనాన్ని ఉద్ధేశించి మాదిగ కూత కవితలో చెబుతూనే..

 

ఇప్పుడు నీకూ నాకూ మధ్య

దూరాన్ని కొలేతేసుకోవాలి

వేదికెక్కి నీకు వెనుకపడ్డ నాకు

మధ్యవర్తిత్వం మనకు వద్దు

అడ్డుగోలు కట్టింది ఎవరో? నిజనిర్ధారణ కావాలి!

ఏకీకరణకు ముందు ఎవరి వాటా చెందాలి.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో వర్గీకరణ సమస్య తీవ్రంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాని యస్సీ యస్టీల ఐక్యతను కూడా కాక్షించాడు. రిజర్వేషన్‌ పొందే యస్సీ యస్టీ బిసిలను వెధవలు , దద్ధమ్మలు, పరాన్న భక్కులు , ఈగలు, దోమలు అని కారుకూతలు కూసిన డక్కన్‌ క్రానికల్‌ పత్రికా సంపాదకులు నాయర్‌..నాయర్‌.. విషవార్త చూసి ఆక్రోషించి.. నేను ఓపికతో వినేవాడిని కాదు

పత్రిక పందికొక్కు దళిత గాదిని తొలిచేస్తుంది

నాయర్‌ నక్కకూత నా పిక్క సత్తువను ప్రశ్నిస్తుంది

పిడికత్తిపట్టి గొడ్డు చర్మం ఒలిచి

చెప్పులు కుట్టి-తప్పెట కొట్టిన నా చేతికి ఇప్పుడు ఎలా బుధ్ధి చెప్పాలో

ఎవడో చెప్పక్కర్లేదు

 

అణుసు కట్టిపట్టి ఆత్మగౌరవం కాపాడుకుంటా! ఊరుకుక్కల్ని తరమికొట్టి గేరిని కాపాడుకుంటా..(రాటుదేలుతున్న రంపె).సుందర్రాజు పుట్టి పెరిగిందంతా  పల్లెటూరే అయినా ప్రపంచ సాహిత్యాన్నంతా అధ్యయనం చేసిన వాడు.కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా నేమకల్లు గ్రామంలో పెద్దనర్సమ్మ, రంగన్నలకు 30.05.1968న రైతుకూలీ కుటుంబంలో  రెండవ సంతానంగా జన్మించారు.  ప్రాథమిక విద్య 1నుండి 5తరగతుల వరకు  మొలగవల్లి కొట్టాలలోనూ, 6 నుండి 10 తరగతుల వరకు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల గుంతకల్లులోనూ, ఇంటర్మీడియేట్‌ (హెచ్‌.ఇ.సి) పత్తికొండ జూనియర్‌ కళాశాలలోనూ,   బి.ఏ. తెలుగు సాహిత్యం అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలోనూ, యం ఏ, యం.ఫిల్‌, పిహెచ్‌డి కేంద్ర విశ్వవిద్యాలయం  హైదరాబాద్‌లో చదివారు. దళిత కథలపై పరిశోధనలో భాగంగా యం.ఫిల్‌,  పిహెచ్‌డిలు  పులికంటి కృష్ణారెడ్డి దళిత కథలపై చేశాడు. ప్రాపంచిక దృక్ఫథంతో సాహిత్యాన్ని అధ్యయనం చేసి మాదిగకోణంలో కవిత్వాన్ని ఆవిష్కరించిన వాడు.

                రాయలసీమంటే ఫ్యాక్షనిస్టుల సీమంటారు. మరి రాయలసీమలో మాదిగలు ఎంత పౌరుషంగా ఉంటారో, ఎంత ఆక్రోషం ఎంత బలంగా ఉంటుందో సుందర్రాజు కవిత్వం చదవాల్సిందే. రాయలసీమలో రంగుపడుద్ది కవితలో..

వెయ్యేళ్ళు వెనకున్న రత్నాల సీమను

మూడడుగులు ముందుకు నడిపించడానికి

నూరేళ్ళ తోలు తెట్టను వదులుకుంటాను

కంటిలో నలుసే కాదు

కాళ్ళో ముల్లును కూడా గుర్తు పట్టాను

కూలిపోతున్న ఎర్రకోటనే కాదు

కుంటుపడిన తెల్లపులిని చూస్తున్నాను

అరచేతిలోని గీతలేకాదు

వెన్నముకలోని పూసకూడా నాకు కనిపిస్తుంది

చెప్పులు కుట్టే చేత్తో చరిత్రరాస్తా..! అవమానింపబడ్డ అరికాళ్ళకు అధికారమిస్తా..  కవిత్వంలో ఇంత ఆక్రోషంతో కూడిన అభివ్యక్తి సాదారణంగా రాదు. కవి తన అస్తిత్వ మూలాల్లో బాగా అణిచివేయబడి, అవమానింపబడినపబడి, సంఘర్షించబడ్డపుపుడే సాధ్యం. నిజంగా చెప్పులు కుట్టేవారికి రాజ్యాధికారం కోరుకోవడమంటే అంబేడ్కర్‌ ఆశయాలు సాధించినట్టే.

 

                మనదేశానికి నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక దళితులపై భయంకర ఆంక్షలు మొదలయ్యాయి. దాడులు హత్యలు, అత్యాచారాలు, మతోన్మాదుల ఆగడాలు పెట్రేగిపోయాయి. మేధావులను పొట్టన బెట్టుకున్నారు. దేశంలో ఆవు పవిత్రత మీద, గో మాంసం మీద ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. మూర్ఖంగా ఆక్సిజన్‌ను తీసుకొని, ఆక్సిజన్‌ను వదిలే ఏకైక జంతువని వితండవాదనతో పవిత్రతను ఆపాదించే ప్రయత్నం మతోన్మాదులు చేశారు. సుందర్రాజు చండాల చాటింపు గోరోజనం కవితలో

దరిద్రం తీరాలంటే

ఆవుకడుపు కోయాల్సిందే!

నోరు ఎరుపెక్కేదాక/

దవడ అల్లాడించిన వాడు

దేశ సౌభాగ్యం కోసం

పశువధ చేయకూడదు అంటాడు బాబాయ్‌..అంటాడు

బతుకు నేర్పినవాడు

ఏమైనా చెబుతాడు

మనం బతకాలంటే

బాబాయ్‌ ఆవు కడుపుకోయాల్సిందే!..ఎవరి ఇష్టం వారిది..ఎవరి ఆహారం వారిది. తిండి మీద ఆంక్షలు విధించడానికి వాళ్ళెవరు. పాలకులైనంత మాత్రాన ఆంక్షలు విధిస్తారా? ఇదేమి దౌర్భాగ్యం. సుందర్రాజు 1996లోనే గోమాంసాన్ని భక్షించవచ్చని చెప్పాడు.

 

ఊరు ఎవరిది అన్నాను

చెప్పులు చేతికి తీసుకోవాల్సిన వాడిని

బూట్లెక్కి మాట్లాడుతున్నాను అని ఔను నేను దేశద్రోహినే అనే కవితలో ఘాటుగా చెబుతాడు.

 

                ఇలా తెలుగుసాహిత్యంలో మాదిగ జాతి అస్తిత్వ వేధనల్ని, వివక్షతని, అవమానాల్ని, ఆక్రోషంగా కవిత్వకరించిన దళిత సాహిత్య చేగువేరా నాగప్పగారి సుంద్రర్‌రాజు. వైవిధ్యమైన కవితాశిల్పంలో  సుందర్రాజు కవితలతో మాదిగలజీవనాన్ని రాశారు. తన కవితలు, కథలు మాదిగసాహిత్యానికి కేంద్రబిందువులు. కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో మాదిగ సాహిత్యవేదికను సుందర్రాజు స్థాపించారు. దళిత సాహిత్యంలో విశేషంగా కృషిచేస్తూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా  పని చేసస్తూనే 17.07.2000న  దళిత సూర్యుడు నాగప్పగారి సుందర్రాజు అస్తమించాడు. మాదిగ సాహిత్య పితామహుడు అనడంలో ఏ మాత్రమూ సంశయం లేదు..

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు