మా రచయితలు

రచయిత పేరు:    శ్రావణసంధ్య

కవితలు


మహారాణి
 

కనురెప్పల చాటున కన్నీళ్లు దాచుకుని

కంటి వెలుగు తో రేపటి కలలు చూపించే స్వాప్నికురాలు

కల్లోల సంద్రాన్ని గుండె లో పెట్టుకుని

వెచ్చని కౌగిలిని రక్షణ గా అందించే 

రక్షకురాలు

బాధలో సుడిగుండంలో తను మునిగి పోతున్న చిరునవ్వుల తీరానికి చేర్చే నావికురాలు

తన ఆశయాల ఆశలు కాలిపోతున్న

విజయాల వర్షాన్ని మనపై చిలకరించే

త్యాగధనురాలు

కంటి చుట్టూ నల్లటి వలయాలున్న

మన కలలనిదుర కు కాపలా కాసే 

సైనికురాలు

శరీరాన్ని చీల్చుకొని రక్తం ధారలు

కడుతున్న సృష్టి కి ప్రాణం పొసే

ప్రేమఘనురాలు

తెలియని అయోమయం లో ఉన్నప్పుడు తెలివిగా దారిచూపే

దార్శనికురాలు

తప్పు చేస్తే కోపం తో దండిచి

ప్రేమగా జీవితాన్ని పండించే

ఉపాధ్యాయురాలు

మార్పు కు అంగీకరించని మారం చేసే మనుషులకు

మమకారం తో మంచి చెప్పే 

మార్గదర్శకురాలు

విషాదాన్ని తీసుకుని సంతోషాన్ని 

సగం మనసునిధైర్యాన్ని, ఇచ్చే స్నేహితురాలు

ప్రేమ తో సాన్నిహిత్యాన్ని,

స్పర్శ తో స్వాంతనను అందించే 

అందాల జవరాలు

కాదన్నా అవునన్న 

హింసించిన ప్రేమించిన 

ప్రకృతిలో సగాన్ని 

ప్రాణంలో సగాన్ని 

పంచుకునే జీవిత బాగస్థురాలు

సృష్టికి శక్తీ

స్థితి కి లక్ష్మి

లయ కు భూమి

ఐన మగువ మహారాణి

ఎప్పటికి మన బ్రతికుకి రేరాణి.

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు