ఇంటర్వ్యూలు

(December,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం "చనుబాల ధార"- సత్యోదయ్

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు సత్యోదయ్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         మీరు సాహిత్యంలోకి ఎలా వచ్చారు?

ఇంట్లో సాహిత్య పుస్తకాలు ఎక్కువగా ఉండేవి.చిన్నప్పటి నుంచి చదవటం బాగా అలవాటు. రాయటం మాత్రం నేను మాస్టర్స్(పీ.జీ) లోకి వచ్చాక అలవాటు అయ్యింది.

2.         సాహిత్యం వ్రాస్తున్న క్రమములో మీకు ఎదురయిన అనుభవాలు ఏమిటి?

పంచుకునే అంతగా ప్రత్యేకంగా ఎదురయిన అనుభవాలు  పెద్దగా ఏమి లేవు...

3.         మీరు సాహిత్యం లోకి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులు , రచయితలు, పుస్తకాలు, సంస్థల గురించి తెలుపండి?

మా నాన్న  లెఫ్టిస్టు అందుకని ఇంట్లో  ఎక్కువగా వామపక్ష సాహిత్యం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాహిత్యం  ఉండేవి. తద్వారా  నేను కూడా ఎక్కువగా వామపక్ష సాహిత్యంతో, అస్తిత్వ సాహిత్యంతో   ప్రభావితం చెందాను.నా యవ్వనపు తొలి రోజుల్లో తెలుగులో నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం "చనుబాల ధార".  కౌముది రచనల్లోని ఇంటెన్సిటి నచ్చుద్ది నాకు.    

4.         మీరు సాహిత్యంలోకి రాకముందు , సాహిత్యంలోకి వచ్చిన తర్వాత సాహిత్య వాతావరణం ఎలా ఉందని మీరు భావిస్తున్న్నరు

సాహిత్యంలోకి రాకముందు(కేవలం చదివే అలవాటు ఉన్నప్పుడు... రాయటం ఇంకా మొదలు పెట్టకముందు)  కవులు, రచయితలు అంటే ఒక ఆరాధనా భావం ఉండేది. సాహిత్యంలోకి వచ్చిన తరువాత (రాయటం మొదలు పెట్టిన తరువాత) కవులు, రచయితల మీద ఉన్న ఆరాధనా భావం తగ్గింది. అంతటా ఉన్నట్టే ఇక్కడ కూడా అవలక్షణాలు ఉన్న వ్యక్తులు ఉంటారని అర్థం అయ్యింది.  అందుకే నేను సాహిత్యం గురించి పట్టించుకున్నంతగా  సాహితీవేత్తల వ్యక్తిగతం పట్టించుకోను. వ్యక్తిలో విలువలు ఉన్నట్టు అనిపిస్తే కొంచెం ఎక్కువ  గౌరవిస్తాను.     

5.         మీరు రాసిన కవిత్వం మీకు తెచ్చిన గుర్తింపు గురించి మీరేమి అనుకుంటున్నారు?

కొత్తగా రాస్తున్న వారికి నేను తెలుసు అనుకుంటున్నాను. అయినా నాకు నచ్చింది, తోచింది రాస్తూ పోతున్నాను.  ప్రత్యేకంగా గుర్తింపు గురించి ఆశిస్తలేను. 

6.         కొత్తగా వెలువడుతున్న కవిత్వం ఎలా ఉండాలి అనుకుంటున్నారు?  

ఇలా ఉండాలి అని నాకు ఎలాంటి నియమం లేదు. పాత నీరు ని వెళ్ళగొట్టి కొత్త నీరు చేరుద్ది అది సహజం. అయితే ఎంత బలంగా చేరుద్దిఎంత బలంగా ప్రభావం చూపెడుతాది అన్నది ముఖ్యం. గ్లోబలైజేషన్ వచ్చి మూడు పదులు అవుతుంది.  అంటే  పూర్తిగా కొత్తగా గ్లోబలైజేషన్ నీడన పెరిగిన ఒక తరం వస్తుంది. ఈ తరం కొత్తగా ఏం రాస్తుందో చూడాలి.

7.          భిన్న సాహిత్య ఉద్యమాలు మీ రచనలపై చూపిన ప్రభావం ఏమిటి?

ప్రత్యేకంగా ఇది ఆ ప్రభావం  అని చెప్పలేను

8.         మీ రచనలు పుస్తక రూపంలోకి రావల్సినవి ఏవి ఉన్నాయి? ఎప్పుడు మీ కొత్త పుస్తకం వస్తుంది?

సుమారు దశాబ్ద కాలం రాసిన కవితలని మొదటి పుస్తకంలో చేర్చాను. మళ్ళీ రెండవ పుస్తకం అంటే ఇంకో రెండు సంవత్సరాలు పట్టవచ్చు.  ఒక  పాతిక కవితలు సిద్దంగా ఉన్నాయి అచ్చు వెయ్యటానికి.

9.         స్థానికంగా మిమ్మల్ని   ప్రోత్సహిస్తున్న వారి గురించి చెప్పండి?

నాది వరంగల్ అయినా దాదాపు పది సంవత్సరాలు చదువు రీత్యా , ఉద్యోగ రీత్యా నేను వేర్వేరు స్థలాలకు వెళ్ళటం జరిగింది.  దాని ద్వారా స్థానిక రచయితలు, కవులతో సాన్నిహిత్యం తక్కువగా ఏర్పడింది. ఇకముందు వరంగల్ లోనే ఉంటాను. ఇకపై చూడాలి  ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో...  నన్ను ప్రోత్సహిస్తున్న వారిలో ముఖ్యులు జయధీర్ తిరుమల రావు గారు.


ఈ సంచికలో...                     

Sep 2021

ఇతర పత్రికలు