కథలు

(February,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

శంఖంలో పోస్తేనే....

         ముగ్గురు బిడ్డల తల్లయినా శారదమ్మ అలా కనబడదు. నాజూగ్గా,సన్నగా,తెల్లగా ఉంటుంది శంకర్రావు గారు శారదమ్మ భర్త. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసి ఆరు నెలల కిందట పదవీ విరమణ పొందారు. ఛామనచాయ సన్నగా పొడుగ్గా ఉంటారు.
పెళ్లయిన నాటి నుంచి ఆ భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు రాలేదంటే.... నమ్మకం వారి మధ్య ఎంత గట్టి బంధాన్ని వేసిందోమరి!
         పిల్లలు ముగ్గురూ ఉద్యోగాల్లో స్థిరపడడంతో ఏడేళ్ళ క్రితం కొడుకులకీ, నాలుగేళ్ల కిందట కూతురికి. పెళ్లిళ్లు చేశారు. పిల్లలంతా 24 గంటల్లోపే ఇల్లు చేరుకునేంత దగ్గర్లోనే ఉన్నారు. సంవత్సరంలో మూడు సార్లు పెద్ద పండక్కి, దీపావళికి,ఉగాదికి అంతా వచ్చి వెళ్తుంటారు.పిల్లలకి తండ్రంటే గౌరవం, భయం. తల్లంటే అభిమానం.
         ***                *****                  ****--
      
వాట్సాప్ లో ఉదయం వచ్చిన ఆ ఇన్విటేషన్ గురించే పిల్లలు ముగ్గురూ మాట్లాడుకున్నారు. ఆ ఇన్విటేషన్ సుమ నుండే వచ్చింది. తనిప్పుడు అమెరికాలో ఉంటోంది. శారదమ్మ దగ్గర చిన్నప్పుడు సంగీతం నేర్చుకునేది. రెండేళ్లకిందట వచ్చినపుడు శారదమ్మను కలిసింది. అంతే తెలుసు పిల్లలకి. శారదమ్మ కు. సుమకు మధ్య ఏం జరిగిందో వాళ్లకి
తెలీదు.
                            ******   
       
అందరూ ఇంటికొచ్చేసరికి శారదమ్మ వంటలన్నీ
సిద్ధం చేసింది. అందరూ తయారయ్యే లోగానే ఆమె గది లోకి వెళ్లి పోయింది. హడావుడి పడుతూనే అందరూ మొబైల్లో జూములో కలిశారు. అమెరికాలో చికాగో నుంచి సభ ప్రారంభమైంది. తెలుగు వాళ్ళందరూ ఒక్కక్కరూ వచ్చి, శారదమ్మను ప్రేమగా పలకరిస్తున్నారు.సుమ కార్యక్రమం మొదలు పెట్టింది.
              "ఈరోజు చాలా సంతోషంగా వుంది. అంతర్జాల వేదిక మీద నా చిన్ననాటి గురువు ఋణం  తీర్చుకుంటున్నందుకు.అమ్మ చాలా గొప్పవారు. సంగీతమే కాదు. ఇంటి వైద్యమూ బాగా తెల్సినవారు. కరోనా కష్టకాలంలో ఒకరింటి కొకరు వెళ్లలేని వేదనాభరిత సమయంలో ఒంటరితనం ఎంతగానో బాధించేది. అప్పుడే జూమ్ సమావేశాల్లో కల్సు కునే వాళ్ళం. ఆ సమయంలోనే, భారతీయత, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు, ఇత్యాది వన్నీ పిల్లలకు  నేర్పించడానికిది అనువైన కాలం అనుకున్నాం. అప్పుడు నాకు అమ్మ గుర్తుకు వచ్చారు. అమ్మని అడగటం, ఆమె సరే అనడంతో పాటలు, కధలు కీర్తనలు ఒకటేమిటి రోజూ ఆమె చెప్పినవన్నీ ఆసక్తి గా నేర్చుకున్నారు పిల్లలు. ఆవిడ మాటలకి పెద్దలం కూడా ఫిదా అయిపోయేవాళ్ళం. అమ్మ తండ్రి గొప్ప ఆయుర్వేద వైద్యులు. ఆమె మా చిన్న చిన్న అనారోగ్యాలెన్నింటికో వంటింటి వైద్యం చెప్పేవారు. అవి చాలా మంచి ఫలితాన్నిచ్చేవి మాకు. దాంతో అమ్మ చెప్పేవన్నీ "అమ్మ ---వంటిల్లు "పేరుతో పుస్తకంగా తెచ్చాను. ఆమె పాడే పాటలు, చెప్పేకథలు మంచి విషయాలు ఇంకా ఆమె జీవితానుభవాలు రికార్డ్ చేసి యూ ట్యూబ్ లో పెట్టాను.ఆమె కిక్కడ చాలా మంది
ఫాలో వర్స్ వున్నారు. నా గురువుకిదే నే నిచ్చుకుంటున్న కానుక ". అంటూ ముగించింది సుమ. అందరి మాటలూ అయ్యాక అమ్మ స్పందన అడిగారు.
"నిజంగా ఇలాంటి ఓ క్షణం వస్తుందని నేనెనాడూ అనుకోలేదు. చిన్ననాడే అమ్మ నుంచీ సంగీతం, నాన్న నుంచీ ఇంటి వైద్య, అబ్బింది నాకు. పిల్లల భాద్యత ల తో అవి ఏటిలోని ఇసక లా కదలకుండా పడి వున్నాయి. మనవలకి అమ్మమ్మ కథలు అవసరం లేదిపుడు. పిల్లలకు అమ్మ చెప్పే అనుభవాలు ఓ చాదస్తం. హాని చేయని వంటింటి వైద్యం ఒక్క మాత్ర..
ముందు ఓడిపోతుంది.అలాంటిది ఈరోజు ఇంత మంది
మనవలకి నా విద్యలునేర్పే అవకాశం, నా అనుభవాలు నెమరేసుకునే అవకాశం రావడం నా అదృష్టం గా భావిస్తాను. పరాయి దేశం లో బ్రతుకుతూ కూడా భారతీయతను, తెలుగు భాష ను, కాపాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నా కెంతో ఆనందంగా వుంది. శారదమ్మ సందేశం తో సభ ముగిసింది.
        ""పిల్లలందరూ భోంచేసి పడుకోండి రేపు మాట్లాడుదాం "తండ్రి ఆదేశం తో అందరూ పడుకున్నారు. ఆరాత్రి అమ్మ పట్ల వాళ్ళకున్న తేలిక భావాల చీకట్లు తొలగి ఉదయం తో పాటు వాళ్ళ హృదయాలూ వెలిగాయి. సుమ అమ్మ పాట యూట్యూబ్ లో పెట్టి పంపింది. ఉదయాన్నే సూర్య కిరణాలు తనువును తాకుతుంటే, అమ్మ సంగీత స్వరాలు వాళ్ళ చెవిని చేరుకున్నాయి."ఎంత బాగా పాడావమ్మా నువ్వు "ఘుమ ఘుమ లాడే కాఫీ పిల్లల
  కందిస్తున్న ఆమె పెదాలపై  చిరునవ్వు."మీ అమ్మ మీ ఉయ్యాలనాడు పాడే పాట లేరా ఇవి. సుమ శంఖం లో పోసిందతే. శంఖం లో పోస్తేనేకదా తీర్ధ మయ్యేది నవ్వుతూ అన్నాడు తండ్రి.
  ఏ దేశ మేగినా ఎందుకాలిడినా పొగడారా నీ తల్లి భూమి భారతిని. యూ ట్యూబ్ లో శారదమ్మ పాట ఎందరికో కర్తవ్యాన్ని భోదిస్తూ....


             
               

 


ఈ సంచికలో...                     

Jul 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు