ఆ రెండు పదాలే ప్రకృతిని శత్రువుగా తనను మోసగించుకోవడమే రుచి ముందు ఆకలి మారిపోయింది దప్పిక దూరమైనది.
ఆకారం మార్చుకొని ఆలోచన కొట్టేదొంగదెబ్బకు ప్రత్యక్ష సాక్ష్యాలైన అరుపుల్లేని బాధ ఆవిరౌతున్న కన్నీరు సొంత దేహంలో పరాయిలా తప్పించుకుని ఎప్పుడూ చివరే ఉంటాయి. ముందుకొచ్చి కాపాడింది లేదు.
ఎంత లోతుకు మునిగాడో ఈ మాటల గజఈత ... ఏ ఒడ్డుకు తేలేనో.. ఏ అర్థం ఎప్పటికో...
ఏ దూరం పిలుపో ఈ అడుగుల అలసట ఏ వేళకు ఈ దప్పికను ఏ గమ్యం తీర్చునో...
దారివ్వండి వాడికి. కెరలించడం దేనికి? జరుగుతున్న కాలాన్ని వాడిలోనే జారనీయండి.
జాలితో మనసుని చిలికి చిలికి చంపొద్దు ప్రేమ మనిషిలో పొగిలి పొగిలిపారనీయండి.