(May,2021)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
కూలి బతుకులు – నాల్గవ భాగం
(కూలి బతుకులు నవల గత సంచిక తరువాయి భాగం )
4
పొద్దున్నె చీకటితోని శ్రీను బయటుదేరి కంట్ట్రార్ దివాకర్‍రావు ఇంటికి పోయిండు. అప్పటికే అక్కడికి చేరుకున్న భగవాన్ మేస్త్రీ ఎదురొచ్చి ‘‘ఇవ్వాళ పనులు బాగున్నాయి. నువ్వుతొందరగాపోవాలి’’ అంటూ క్షణమాగి జెబులోని చిన్న నోట్ బుక్‍తీసి లావు పాటి కండ్లద్దలనుండి ఒక సారి పరిక్షగా చూసి.
‘‘ఎలుకలపల్లి గేటు కాడ రోడ్డు పనులు జరుగుతానయి అక్కడ నాల్గు ట్రాక్టర్ల కంకరపోయ్యాలి. పొద్దున పదిగంటలకల్లా తిలక్ నగర్‍లో కన్‍స్టక్షన్ జరుగుతున్న బిల్డింగ్‍ల కాడికి బండ తీసుకపోవాలి. మధ్యహ్నం వరకల్లా పని పూర్తియితే అతరువాత ఏం చెయ్యలన్నది నేను వచ్చి చెప్పుతా అంటూ పని పురమాయించిండు.
రోడ్డుకు కంట్రాక్టర్ బంగ్లాకు మధ్యన వేప చెట్టునీడలో నిలిపి ఉన్న ట్రాక్టర్‍ను తీసుకోవటానికి ముందుకు కదిలిన శ్రీనుకు హరత్‍గా ట్రాక్టర్ జాకిలు సరిగా పనులు చేస్తలేవన్న సంగతిగుర్తుకు వచ్చింది.
‘‘మెస్త్రీ జాకీలు సరిగా పనిచేస్తలేవు’’ అన్నాడు.
‘‘మెకానిక్ జానిమియాగానికి చూపించక పోయినవా’’
‘‘చూయించిన బాగా అరిగిపోయినవట కొత్తది మార్చాలంట’’
‘‘సరే ఈ పూటకు ఎట్లాగో నడవనియ్... సాయంత్రం దాని సంగతి చూద్దాం’’ అన్నాడు మెస్త్రీ...
భగవాన్ మెస్త్రీ కంట్ట్రారు దివాకర్‍రావుకు నమ్మకమైన వ్యక్తి రామగుండాం కాడ కంట్రాక్టరుకున్న రెండు క్రషర్‍లు ఆయనే చూస్తడు. అర్డర్ తీసుకోవడం, పనులు చేయించటం, సప్లయిచేసి వాటికి డబ్బులు వసలు చేయటం, వర్కర్స్ మంచి చెడు అన్ని ఆయనే నడిపిస్తడు.
భగవాన్ మెస్త్రీ కూడా అందరిలాగే ఓరిస్సా నుండి బ్రతక వచ్చిండు. కాస్త రాతపూత తెలిసినోడు ఏ పని చేసిన ఓళ్ళుదాచుకోకుండా పనిచేస్తడు. అటు వంటి పని మంతుడు దొరకంటంతో కంట్రాక్టరుకు ఏ చీకు చింత లేకుండా పోయింది.
శ్రీను ట్రాక్టర్ తీసుకొని బయలు దేరిండు.
ట్రాక్టర్ మెయిన్ రోడ్డు దిగి మట్టి బాటలో కాస్త దూరం పోయే సరికి ‘‘శీనన్నా శీనన్నా’’ అన్న పిలుపు విన్పించి అటువైపు చూసిండు.
దావన్ కూతురు హీరా, పదమూడు పద్నాల్గెండ్లు ఉంటాయి. కాని అంత వయస్సు ఉన్నట్టు అన్పించదు. బక్కగా ఉంటుంది. నెత్తంతా దుమ్ముకొట్టుక పోయి,మసి బారిన బట్టలో ఉంది.
‘ఏంటి’ అన్నట్టుగా చూసిండు శీను.
‘‘అన్నా జర మా ఇంటిదాక తీసుకపోవా’’ అంది.
అతను పోయే తోవలోనే క్రషర్ నగర్ ఉంది. హిరా వాళ్ళు ఉండేది అక్కడే దాంతో శ్రీను ట్రాక్టరు అపి ‘‘అయితేరా’’ అన్నాడు.
‘‘ఒక్క క్షణం’’ అంటూ అంత వరదాక రోడ్డు దిగువన మొదుగు చెట్టు గుబురుకాడ ఉన్న బొగ్గు బస్తాను బలవంతంగా ఎత్తుకొని వచ్చి ట్రాక్టర్లోవేసి ఎక్కింది.
‘‘ఇంత పొద్దున్నే ఎటు పోయినవు బొగ్గుకా’’ అని అడిగిండు.
‘‘అవునన్నా రెండు రోజులనుండి తిరుగుతాంటే ఇవ్వాళ దొరికింది’’ అంది.
ఇబ్బందేకాని దివాకర్‍రావు బండ్లను ఎవరు అపరు.
దావన్ ఆయన భార్య ఇద్దరు క్వారీలో పనిచేస్తరు వాలికి ముగ్గురు పిల్లలు కూతురు హీరా పెద్దది. అతరువాత ఇద్దరు మగపిల్లలు భార్య భర్తలు ఇద్దరు పనిలోకి పోతే ‘హీరా’ ఇంటికాడ పనులు చేస్తది. తమ్ముల్లను చూసుకుంటది.
వర్షకాలం కన్‍స్ట్రక్షన్ పనులు పెద్దగా సాగవు. వర్షలు పోయి ఎండకాలం మొదలవటంతోనే కూలీలకు క్రషర్‍నగర్ గుట్టబోరు మీద ఉంది. అక్కడ ఒక చెట్టు చేమలేదు. ఓరియా కూలీలు వంట చేసుకోవటానికి బొగ్గు పొయ్యిలను వాడుతారు. గతంలో అయితే ఏది ఇరువై రూపాయలకే సిమెంటు బస్తానిండా బొగ్గు దొరికేది. సింగరేణికంపినికి చెందిన డంపింగ్ యార్డులనుండి, సీలు కుప్పల నుండి పనిపాటలేని పిల్లలు బొగ్గు ఏరుకొని సైకిల్ల మీద తెచ్చి అమ్మెవాళ్ళు. వారికి అదోరకమైన ఉపాధి. కాని ఎప్పుడైతే సింగరేణి కంపిని బొగ్గు దొంగతనాలు అరికట్టడానికి డంపింగ్ యార్డుల చుట్టు పెన్సింగ్ వేసి, అక్కడ మూడు పూటల వాచ్‍మన్‍ను పెట్టడంతో డంపింగ్ యార్డుల నుండి బొగ్గుతేవటం కష్టమై పోయింది. దాంతో సేలు కుప్పల కాడ బొగ్గు ఎరుకొని వచ్చేవారు. అక్కడేమో విపరీతమైన పోటి బొగ్గు బాయిలో బొగ్గుతో పాటు సేలుబండలు కూడా వస్తవి. అటువంటి సేలు బండలను ఏరి ఒక చోట కుప్పగా పోయే కంపిని తప్పిదారి పోయి అబండాల మధ్య అక్కడోకటి ఇక్కడోకటిగా మిగిలిపోయిన బొగ్గును ఏరుకొనేందుకు అడమగా పిల్లలు అనకుండా సంచులు పట్టుకొని పోయేవాళ్ళు. పొద్దంతా ఏరినా ఒక బస్తనిలడటం కష్టమయ్యేది. దాంతో మునపటిలా బొగ్గు దొరకటం కష్టమైపోయి బస్తాబొగ్గు ధర యూబై రూపాయలకు పెరిగింది. అంత ధర పెట్టి బొగ్గు కొనే స్థోమతలేక వంట చెఱుకు కోసం అనివార్యంగానైనా బొగ్గు దొంగతనంగా తెచ్చుకోవలిసి వచ్చింది.
ఎన్టిపిసిలో అకలోడింగ్ కోసం అగిన వ్యాగన్ల నుండి దొంగతనంగా బొగ్గు తెచ్చుకునేవాళ్ళు. దీన్ని అరికట్టడం కోసం ఎన్టిపిసి అక్కడ ముసలి వాచ్‍మెన్ పెట్టింది. వాడేమో కర్రపట్టుకొని ఇయ్యర, మయ్యర కొట్టెవాడు. దాంతో బొగ్గు కోసం వచ్చే పిల్లలకు వాడంటే ఎక్కడ లేని భయం. అయిన బొగ్గు తెచ్చుకోవటం అనివార్యమై వానికంట్లె పడకుండా బొగ్గు దొంగతనం చెయ్యాల్సి వచ్చెది. క్రషర్ నగర్‍లో నివసించే కూలీలు పనులు లేనప్పుడు తిండికి కటకట లాడుతారు. ఇతరత పనులు ఎమన్నా దొరికితే చేస్తరు లేకుంటే లేదు. అటువంటి సమయంలో ఇండ్లు సగబెట్టు కుంటూనో, సామాన్లు బాగు చేసుకుంటూనో కాలం గడుపుతారు. లేదంటే ఏ చెట్టుక్రిందనో కూచొని పొగాకు నములుతు ప్యాకాట అడుకుంటారు.
హీరాను చూసే సరికి శీనుకు తులసిగుమారి గురించి అడగాలనిపించింది.
‘‘హీరా’’ తులసి కన్పిస్తలేదేమి’’ అన్నాడు యధాలాపంగా అడుగుతున్నట్టు...
‘‘ఉంది... తులసక్క ఇప్పుడు ఇటుకబట్టిల పనికి పోతాంది కదా’’ అంది.
‘‘ఇటుక బట్టిల పనికా’’
‘‘అవును’’
‘‘అదే ఎందుకు’’
‘‘కంట్ట్రారుతోని లొల్లి అయ్యింది కదా ఇక అపని బందుపెట్టింది’’ అంది.
అ మాటలు విని శ్రీనుకు మనసులో బాధనిపించింది.
తులసి గుమారిని మొదటి సారి కలిసింది. సుబాస్ నగర్‍లోని బాల కార్మికుల పాఠశాలలో కూలీల పిల్లలకు చదువు చెప్పాకే లక్ష్యంతో అంతార్జాతీయ కార్మిక సంఘం నిధులతో ఎర్పాటు చేసింది. దానికి హిందు మజ్దూర్ సంఘంకు చెందిన నరెందర్ దానికి బాధ్యుడు. ఆయనేమో ఎన్టిపిసిలో ఉద్యోగి, పైగా యూనియన్ నాయకుడు వాళ్ళ నాయకత్వాన్ని పట్టుకొని పాఠశాలను సాంక్షన్ చెయించిండు. అందుకోసం దాదాపు ఇరువై లక్షల దాక నిధులు వచ్చాయి,
దాన్ని ఎర్పాటు చేసిన తనికి పిల్లలలకు సేవ చేయాటం కంటే వచ్చే నిధులమీదే అశ ఉండి పోయింది. అర్భాటంగా పాఠశాలను ప్రారంభించిండు. దాన్ని నిజాయితీగా నిర్వహించలేదు. పాఠశాల ఎర్పాటు చేసిన కొత్తలో పిల్లలను చేర్పించటం కోసం, కూలీలు ఎక్కువగా ఉండే వికే రామయ్య కాలని క్రషర్‍నగర్, కాకతీయనగర్, సుభాస్ నగర్ ఇంటింటికి తిరిగి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పుతాం. మధ్యహ్నం తిండి కూడా పెడుతాం, పుస్తకాలు బట్టలు అన్ని ఫ్రీ అని నచ్చచెప్పి దాదాపు యాబై అరువై మంది పిల్లలను జమ చేసిండ్లు.
ఎట్లాగు చదువు లేక తమ బ్రతుకులు అగమైనవి పిల్లలు చదువు కుంటేనైనా బాగు పడ్తరని నాగయ్య తన చిన్న కొడుకు శ్రీను ఆ పాఠశాలకు పంపించిండు.
పరదేశిరాం కూడా తనకూతురు తులసి కుమారిని స్కూలుకు పంపించిండు. ఇద్దరు ఒక్కటే క్లాసు చేరిండ్లు అట్లా వారికి పరిచయం ఎర్పడింది.
సుభాస్ నగర్ ఓర్రె ఓడ్డున ఉన్న విశాలమైన మైదానంలో ఒక్క గుడిసే వేసి అందులో స్కూలు నడిపించేది. చదువు కొని ఏం పనిలేకుండా తిరుగుతున్న ఇద్దరు యువకుల్ని తాత్కలిక టీచర్‍గా పెట్టిండ్లు.
కొన్ని రోజులు స్కూలు బాగానే నడిచింది. క్రమంగా నిధులు రాక క్రమంగా స్కూలు మూతపడింది. ఒకప్పుడు స్కూలు ఉన్న చోట ఇప్పుడు మొండి గోడలు మిగిలాయి.
తులసి కుమారిది మాతృబాష తెలుగు కాకున్నా తెలుగు చాల స్పష్టంగా మాట్లాడేది. చదువులో అందరి కంటే ముందు ఉండేది. నల్లగా బక్కగా, గుండ్రటి మొఖంతో మెరిసే కండ్లతో హుషారుగా ఉండేది. శ్రీను ఎంత కష్టపడ్డా అమెకు మించి పోలేక పోయేవాడు. ఇద్దరి మధ్య చదువులో పోటి ఉండేది.
అశ్రామ పాఠశాలలో ఐదవ తరగతి చదివిన తరవాత శ్రీను రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలకు పోయిండు. కాలి నడకన రోజు ఐదారు కిలో మీటర్లు పోయి రావల్సి వచ్చేది. అంత దూరం పంపలేక పరదేశిరాం తులసిని బడి మాన్పించిండు. ‘‘అరే మంచిగా చదివే పిల్లను బడి మాన్పిస్తే ఎట్లా’’ అని సార్లు ఎంత చెప్పిన పరదేశి వినలేదు.
పరదేశీరాంది రాజనంద్ గారి నుండి బ్రతక వచ్చిండు. ఆయన భార్య ఈశ్వరి బాయ్... వారికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు శత్రుఘన్ క్వారిలో బాల కార్మికుడుగా బండరేపని చేసేవాడు. కాస్త రెక్క ముదిరే సరికి బండలు కొట్టె పనికి కుదిరిండు. తల్లి దండ్రులు ఇద్దరు పనిలోకి పోతే తులసి ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులు చూసేది. శత్రుఘన్‍కు పెండ్లి అయిన తరువాత వేరు కాపురం పెట్టిండు.
అప్పుడప్పుడు తులసి కన్పించి మాట్లాడేది. ఆమె మాట్లాడుతుంటే ఎందుకోగాని శ్రీను మంచిగ అన్పించేది. ఎంత సేపు మాట్లాడిన ఇంకా మాట్లాడాలనిపించేది. ఆమెలో చదువు పట్ల అసక్తి తగ్గలేదు. శ్రీను ఎప్పుడు కలిసిన చదువు గురించి అడిగేది. అసక్తిగా పుస్తకాలను చూసేది.
తులసి పాటలు బాగా పాడేది. ఓరియావాళ్ళు తీరిక సమయాల్లో భారత, రామాయణగాధలు పాడుకోవటం వారి సంప్రదాయం అ పాటలేవి చదివి నెర్చుకున్నవి కావు. తరతరాలుగా పాడే వాడు. చాల ఎండ్లు ఆయన బండ పని చేసిండు కాని ఇప్పుడుచాత కాకుండా అయిపోయిండు. కండ్లు కూడా సరిగా కన్పించటం లేదు. ఆయన కొడుకు కిషన్ వద్ద ఉంటున్నాడు. ఎదైనా పండుగ పబ్బం అప్పుడు సామూహికంగా కోలాటం అడుతూ మహిర్‍తాతతోని పాటలు పాడించుకునే వాళ్ళు. ప్రతిరోజు దుర్బర మైన జీవితం గడిపినా, పండుగలప్పుడు మాత్రం ఉన్నంతలో గనంగాజరుపుకునే వాళ్ళు. అట పాట వాళ్ళజీవితంలో బాగం హోలి పండుగ అడమగ అనకుండా చాల సంబంరంగా జరుపుకుంటారు.
తులసి మాహర్ తాత దగ్గర చాల పాటలు నేర్చుకున్నది. మహర్‍తాత చాల పెద్ద మనిషి కావటంలో ఇప్పుడు ఎదైనా పండుగలప్పుడు తులసి తోని పాటలు పాడించుకుంటున్నారు. సన్నటి శ్రావ్యమైన గొంతుతో పాడే తులసి పాటంటే అందరు ఇష్టపడేవాళ్ళు.
ఒక సారి హోలి పండుగా రోజున ఎదో పనిబడి శ్రీను మార్కెటుకు పోయినప్పుడు నిండారగా రంగు చల్లుకొన్న గుంపు ఒకటి క్షణాల్లో శ్రీనును చుట్టుముట్టెసి రంగుల్లో ముంచేసింది. తీరా చూస్తే వారితో కిలకిల నవ్వుతు తులసి కన్పించింది.
ఒక విదంగా సాపిగా జరిగిపోతున్న వారి కుటుంబంలో పరదేశిరాంకు క్యారీలో దెబ్బతాకటంతో పరిస్థితులన్ని తలక్రిందులైనవి. అరోజున క్వారీలో ఎత్తయిన బండలను కూల్చటానికి నడుముకు తాడు కట్టుకొని వ్రెలాడుతు బ్లాస్టింగ్ కోసం బండకు రంద్రాలు చేస్తుంటే తాడు తెగి పరదేశి అంతఎత్తునుండి క్రిందపడ్డాడు. నడుముకు బలమైన దెబ్బతాకింది. కంట్రాక్టర్ నష్టపరిహరం ఏమి ఇవ్వలేదు. అడిగేవారు లేరు. అప్పటి నుంచి బండ పనులు చెయ్యలేని పరిస్థితి వచ్చింది. ఆయన పనులు ఆయన చేసుకో గలడు కాని బరువు పనులేమి చెయ్యలేడు.
దేవునింట్ల మన్నుబోయా రాత ఇట్లా రాసేనని దు:ఖాన్ని దిగమింగుకొని ఈశ్వరిబాయి రాళ్ళు కొట్టె పనికి పోతుంది కాని ఇద్దరు చేస్తనే అంతంత మాత్రంగా వెళ్ళె సంసారంలో ఒక్క దానిసంపాధన ఎటు చాల కుండా పోయే సరికి తులసి ఊడా కొన్ని రోజులు బండ కొట్టె పనులకు పోయింది.
వయస్సు తెచ్చిన అందంతో చూడచక్కగా ఉన్నా తులసి పై రంగయ్య అనుచరుడు మంగలి లక్ష్మన్ గాని కన్నుపడింది. వాడుత్తలంగ, అడది కనిపిస్తే చాలు చిత్తకార్తెకుక్కలా మారిపోతాడు. జీవనోపాధిలేని వాళ్ళును, భర్తలు చనిపోయి ఓంటరిగా బ్రతికే వారిని, తిరుగుబోతు స్వబావం కల్గిన వారిని నిస్సయులను నయనా భయానా లొంగదీసుకోనేవాడు.
అటువంటి వాడు ఒక రోజు తులసిని చూసి ‘‘క్యారిలో అ బండ పని ఏంచేస్తవు అపీసులో పనుంది చేస్తావా రోజు కూలి దొరుకుద్ది’’ అంటూ మెల్లగా మాట కలిపిండు.
తులసికి చిన్నప్పటి నుండి అలవాటు లేనేఇ బండపని చేయటం కష్టంగా ఉంద. ఎదో తప్పని సరై అపనిలోకి పోతుంది. ఎప్పుడైతే లక్ష్మన్ అపీసు పని ఉంది చేస్తావా అనే సరికి నీడపాట్టున ఉండి పనిచేయ్యవచ్చు అని అశపడింది. అట్లా పనిలోకి కుదిరింది. నాల్గురోజులు బాగానే గడిచింది. కాని మెల్లగా లక్ష్మన్ దుర్భుద్ది బయట పడసాగింది.
ఒక రోజు ఎవరు లేందీ చూసి తులసి మీద చెయ్యి వేసిండు. ఊహించని పరిణామానికి తులసి మొదట కంగుతిన్నా మరుక్షణం తెరుకొని ఎదురు తిరిగింది. అది తెలిసి ఓరియా కూలీలంత లొల్లి చేసిండ్లు. లొల్లి పెద్దదై పోలీసుస్టెషన్ దాక పోయింది. కాని కంట్రాక్టరు రంగయ్య తన పలుకుబడితోని పోలీసుల నోళ్ళు మూయించిండు. పైగా కంట్రాక్టరు దగ్గర డబ్బు గుంజటానికి తులసి అడిన నాటకంగా ఉల్టాకేసు బనాయించిండ్లు పోలీసులు. అక్కడి నుండి భయటపడటమే గగనమైంది.
అలోచనలో పడిపోయిన శ్రీనుకు క్రషర్ నగర్ వచ్చింది గుర్తులేదు.
‘‘అన్న ఆపు’’ అని హిరా పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ట్రాక్టర్‍ను అపిండు.
హిరా క్రిందికి దిగి తన బొగ్గుల సంచి ఎత్తుకొని గుట్టమీద దొంతర్లుగా ఉన్న గుడిసెలకేసి పోయింది.
మళ్ళీ బండి స్టార్టు చేస్తుంటే... దూరం నుండి అర్జున్ చూసి ‘‘శ్రీనన్న బండి ఆపు మేము అటే వస్తానం’’ అంటూ కేకేసిండు.
అర్జున్, అత్మరాం, ఈశ్వరిబాయ్, భగవతిమరికొంతమంది సద్దులు పట్టుకొని బయలు దేరినవాళ్ళు పరుగు పరుగున ఉరికి వచ్చి ట్రాక్టర్ ఎక్కిండ్లు. లేకుంటే వాళ్ళు ఉండే చోటు నుండి క్వారీకి దాదాపు నాల్గుకిలో మీటర్లు నడిచి పోవలసివ చ్చేది. కూలీలు పొద్దున సద్దికట్టుకొని వస్తే మళ్ళి సాయంత్రం చీకటి పడ్డతరువాతనే ఇంటికి తిర్గివచ్చేది.
‘‘ఎంటీ ఇవ్వాళ పొద్దు పోయింది’’ అన్నాడు శ్రీను అర్జున్‍తో మాటకలుపుతు.
‘‘లలేచి వండుకొని తినివచ్చే సరికి ఈ యాల్ల అయ్యే’’ అన్నాడు అర్జున్.
ఇవ్వాళ భగవాన్ మెస్త్రీ వస్తడా! అని అడిగిండు అత్మారాం...
‘‘అదే ఎందుకు’’
‘‘నిన్న కూలీ పైసలు ఇవ్వాల్సి ఉండే నిన్న రాలేదు ఇవ్వాలైనా వస్తడా లేదా’’ అన్నాడు.
కరకరలాడుతు తుర్పున సూర్యుడు పొడుచుకొచ్చిండు.ఈ సారి ఎండలు తొందరగానే వచ్చినవి. బారెడు పొద్దు ఎక్కెసరికి ఎండ సురసుర లాడుతున్నది. ఇక బండల మీద పని చేయ్యటం అం నిప్పుల కొలిమిలో మెసిలినట్టే అందుకే కూలీలు ఎంత పొద్దున వీలైతే అంత పొద్దున పని ముగించుకోవాలని చూస్తరు.
‘‘నిన్న ఎందుకు రాలేదో ఎమోకాని...భగవాన్ మెస్త్రీ మాట తప్పె మనిషికాదు. ఇవ్వాళ తప్పకుండా వస్తడు’’ అన్నాడు శ్రీను.
మాటల్లో పడిపోయి క్వారీ వచ్చింది తెలియలేదు.
రామగుండంలోని రాముని గుండాలు గుట్టకు దివాకర్‍రావుకు మొదట ఒక్కటే క్వారీ ఉండేది కాని గిరాకి ఎక్కువగా ఉండటంతో గుట్టకు మరో వైపున ఇంకో క్వారీ మొదలు పెట్టిండు.
రాముని గుండాల గుట్టకు తూర్పువైపున ఒక దోనే (చిన్నగుహ) ఉంది. పెద్ద బండ రాయికి దిగువన నిలువెత్తున దాదాపు పెండు గజాల వెడల్పున దోనే ఉంది. అందులోని ఒక చిన్న బండ మీద మారెండంత ఎత్తుఉండే రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రాహలున్నాయి. సెలవు రోజుల్లో ప్రతి శ్రావణ మాసంలో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అగుహకు ఒక వైపున బండల మీద ప్రాకిన రాళ చెట్టు ఒకటి ఉంది. గుహకు ఎదురుగా కొద్ది దూరంలో నీటి బుంగ ఒకటి ఉంది. వలయాకారంలో ఏటు జానెడువెడల్పు జానెడు లోతు ఉండే బండరాలయి మీద తొలి చినట్టుగా ఉండే బుంగలో ఎప్పుడు నీరు ఉంటుంది. ఆ బుంగలో అనీటిని తోడితే మళ్ళి అంతే నీరు ఊరుతుంది తప్ప అంతకంటే ఎక్కువ నీరు ఊరదు. దాని మీద స్థానికుల్లో ఒక కథనం ఉంది. రాముడు అరణ్యవాసం చేసినప్పుడు కొన్ని రోజలు అక్కడ గుహలో ఉన్నాడని అ సందర్భంగా ఒక సారి సీతకు దాహం వేస్తే రాముడే స్వయంగా నీటికోసం ఆ బుంగను తొలిచాడని చెప్పుతారు. ఇటువంటి నమ్మకాలకు ప్రజల్లో కొదవలేదు. కాని అట్లా నీరు ఊరడం అంతా రాముని మహిమ అని నమ్ముతారు. శ్రావణ మాసంలో జాతర జరుగుతుంది. చుట్టు ప్రక్క గ్రామాల నుండి జనం వస్తారు. అ సమయంలో గుళ్ళో అయ్యగారు రోజు ఉంటాడు. మిగితా సమయంలో ఉండేది తక్కువ.
రాముని గుండాలగుట్ట చాల విశాలంగా పరుచుకొని ఉంటది. గుట్టకు దక్షణం వైపున మొదటి సారీ క్వారీమొదలైనప్పుడు దేవుని గుట్టకు క్వారీ ఎట్లా నడిపిస్తరు అంటూ జనం నుండి వ్యతిరేకత వచ్చింది. కాని దివాకర్‍రావు తన పలుకుబడి ఉపయోగించి ఆ ఉద్యమంలో ముందు పీటన నిలచిన వారిని నయనా భయానా లొంగదీసుకొని క్వారీ మొదలు పెట్టిండు.
ఇటువంటి సంఘటనలు కరింనర్ జిల్లాలో చాల జరిగినయి. ము్య•ంగా గ్రానైట్ పరిశ్రమ పుట్టుకొచ్చిన తరువాత చాల గుట్టలు మాయమైనవి. ఎంతో చారిత్రక ప్రాదన్యం కల్గిన గుట్టలు దేవుని గుట్టలు కూడా వదలకుండా క్వారీలు చేసిండ్లు. పెద్ద పెద్ద బండరాలను సైజుల వారిగా కట్‍చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేసి గ్రానైట్ పరిశ్రమాధిపతులు వందల కొట్లు సంపాధించిండ్లు. ఇట్లా సంపాధించిన డబ్బులతో తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా గ్రానైట్ పరిశ్రమాధినేతలు రాజకీయ నాయకులై, ఎమ్మెల్యెలుగా ఎంపిలుగా గేలిచి మంత్రులు అయ్యిండ్లు. గుట్టల విద్వంసం వలన ఎర్పడుతున్న పర్యావరణన విద్వంసం గురించి పర్యావరణ ప్రేమికులు ప్రజాస్వామిక వాదులు అనేక మార్లు అందోళన చేసిండ్లు. కాని గ్రానైట్ పరిశ్రామధిపతులు ప్రభుత్వా అండతో వాటిని అణిచి వేసిండ్లు. వారి నిరసనలు అరణ్యరోదనే అయ్యింది.
వీళ్ళు అక్కడికి పోయే సరికి అప్పటికే కూలీలు పనులు మొదలు పెట్టిండ్లు. పెద్ద పెద్ద బండలను క్రషర్‍లోనే వేయాటానికి వీలుగా చిన్నచిన్న ముక్కలుగా కొడుతున్నారు కొందరు. వాటిని తీసుక పోయి క్రషర్ బంకరులో వవేయాటానికి దాదాపు అరువై డెబ్బయి మంది పిల్లలు పనులు చేస్తున్నారు. గుట్టకు కాస్త దిగువన అకాశం కంటూ పొడుచుకున్న క్రషరు పెద్దగా చప్పుడు చేస్తూన్నది. బండాలు చుర అయ్యే క్రమంలో ఎగిసిన దట్టమైన దూళి ఎగజిమ్ముతు అక్కడి వాతవరణం అంతా పేరుకపోయింది. అక్కడ పనిచేస్తున్న వారంత తలకు ,ముక్కుకు మూతికి గుడ్డలు కట్టుకొని ఉన్నారు. అక్కడ పని చేస్తున్న వారంత తెల్లటి బూడిద దుమ్ముతో నిండిపోయింండ్లు.
మరో దిక్కున క్రషర్ బెల్టునుండి చిన్న చిన్న ముక్కలుగా బయిటికి వస్తున్న బండ రాళ్లను కాస్త పెద్ద సైజుబండలను ఏరుతు మరికొంత మంది పిల్లలు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత వేగంగా పని చేస్తున్నరంటే బెల్టు ఎంత వేగంగా తిరుగుతుందో అంతే వేగంగా చెతులు అడిస్తూ సైజుల వారిగా బండలు ఏరే పనిలో ఉన్నారు.
అట్లా పని చేసే పిల్లలకు ఇచ్చే కూలి చాల తక్కువ. వాస్తవానికి పిల్లలతో పనులు చేయించటం చట్టరీత్య నేరం. అటు వంటి నేరాలను అరికట్టడానికి ప్రభుత్వ లేబర్ డిపార్టు మెంటు ఉంది కాని అది నామ మాత్రమే. లంచాలకు ఎగబడిన అధికారులు అవేవి పట్టించుకోరు. ఎదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఎక్కడలేని హడావిడి మొదలైతది. అటు తరువాత వాటికి దాతు పిర్యాదు ఉండదు.
లోడర్ వెంకటెశం చెయ్యెత్తి ట్రాక్టర్‍పోను కాస్త ముందుకు తీసుక రమ్మన్నట్టుగా సైగలు చేసిండు.
శ్రీను ట్రాక్టరును కాస్త ముందుకు తీసుకపోయి కుప్పగా పోసిన కంకర కుప్ప ముందు నిలిపిండు. గతంలో అయితే లోడింగ్, అన్‍లోడింగ్ అంతా కూలీలే చేసేవాళ్ళు. ఇప్పుడు యంత్రాలు వచ్చిన తరవాత అపని తెలికైంది. కాని అమేరకు కూలి దొరకని పరిస్థితి ఎర్పడింది.
నిముషాల్లో లోడర్ ట్రాక్టర్‍లో కంకరలోడు చేసింది. ఎక్కువ అలస్యం చేయకుండా శ్రీను ట్రాక్టర్‍ను ఎల్కపల్లి గేటు కేసి పరుగులు పెట్టించిండు.
మద్యాహ్నం వరకు నాలుగు ట్రిప్‍లు కొట్టిండు ఎండ ముదిరింది. కడుపులో అకలి సురసుర లాడసాగింది. పొద్దున వెంట తెచ్చుకున్న సద్దితిని మళ్ళి పనిలో పడ్డడు.
గతుకుల రోడ్డు మీద ట్రాక్టరు ఎగిరి ఎగిరి పడుతు ముందుకు పోతున్నది.
కాస్త దూరం పోయే సరికి దిలీప్ కన్పించిండు. దీలీప్‍ని చూసి శ్రీను మనసులో జాలి అన్పించింది. అంత పది పన్నెండు సం।।రాలు మించి ఉండదు. దీలిప్ తల్లి మూడెండ్ల క్రింద దేవ్ చనిపోయింది. దీలిప్ తండ్రి వాళ్ళు వీళ్లు’’ ఎమంత వయస్సు పోయిందని, మళ్ళీ పెండ్లి చేసుకొమ్మన్నరు. కాని భార్య చినపోయిన తరువాత దేవ్ కు జీవితం మీద అసక్తి పోయింది. పిల్లవాన్ని చూసుకుంటు బ్రతుకు తున్నాడు.
దీలిప్ ప్రక్కగా ట్రాక్టరు అపి శీను. ‘‘ఎక్కడికి క్వారికేనా’’ అని అడిగిండు.
‘‘అవును’’ చిన్నగా నవ్వుతు తాలాడించిండు. దిలీప్...
‘‘అయితే ఎక్కు’’
దిలిప్ బండి ఎక్కిండు. చేతిలో సంచి ఉంది. అది చూసి..
‘‘ఏంటది’’ అన్నాడు శ్రీను.
‘‘నాన్నకు సద్దీ’’
‘‘ఎవరు వండిండ్లు’’
‘‘నేనే’’ అన్నాడు మెరిసే కండ్లతో...
‘‘నీకు వంట కూడా వచ్చా’’ అన్నాడు అక్చర్యంగా...
‘‘దీలిప్ తలాడించి’’ రోజు పొద్దున్నె నాన్నె వండి పోతడు కాని ఇవ్వాల వీలు కాలేదు. అందుకే నేను వండిన’’ అన్నాడు.
శ్రీనుకు నిజమే అన్పించింది. పిల్లవాడు అంత దూరం పోయ్యి రావటం కష్టమే అనుకున్నాడు. ఎన్టిపిసిలో పెరెన్నిక పొందిన రెండు స్కూల్లు ఉన్నాయి కాని అందులో కూలి పిల్లలకు సీటు దొరకయి. దాంతో చాల మంది కూలీల పిల్లలు చదువు కునెందుకు అవకాశాలు లేకుండా పోయింది. చెల్డు వెల్ఫేర్ వారి స్కూలు మూత పడ్డతరువాత అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు కూడా లేకుండా పోయింది. ఒక లిద్దరు కాని గిరి బడి పెట్టిండ్లు. కాని అది సరిగ్గా నడవక మూసెసిండ్లు. దాంతో కూలిల పిల్లలకు చదువు లేకుండా పోయింది.
ఇంట్లో అడవాళ్ళు ఉంటే అదోతీరు కాని అడదిక్కులేని కాడ, అందులో క్రషర్‍నగర్ వంటి చోట నీళ్ళు కావాలన్నా పోయిలోకి బొగ్గులు కావాలన్నా ప్రతిది సమస్యే. దేవ్ పనికి పోతే దిలీప్ అ చిన్న వయస్సులోనే ఇంటికాడ పనులన్ని చేసేవాడు.
సైట్‍మీదికి చేరుకున్నారు. ట్రాక్టర్‍ను మళ్ళి లోడ్‍కోసం నిలిపి దీలిప్‍ను ఉద్దేశించి ‘‘మళ్ళీ పోయేతప్పుడు వస్తవా’’ అన్నాడు బొమ్మలు ఎగరెసి...
‘‘కాసేపు అడుకున్నంక వస్తా’’
‘‘అయితే రెండో ట్రిప్‍లో తీసుకపోతాలే’’ అన్నాడు శ్రీను...
అన్నాలు తినే వేళ కావటంతో షెడ్డులో చాల మంది కూలీలు ఎక్కడికి అక్కడ కూచొని బోజనాలు చేస్తున్నారు. ఇంతలోనే బుర్ బుర్ లాడుతు భగవాన్ మెస్త్రీ మోటారు సైకిల్ చప్పుడు విన్పించింది.
భగవాన్ మెస్త్రీ బండిని క్రషర్ అపీసు ముందు నిలిపి అపీసులోకి వస్తూ శ్రీనును చూసి
‘‘అరేయ్ శ్రీను ఎంత వరకు వచ్చింది పని’’ అని అడిగిండు. ఎల్కలపల్లి గేటుకు కంకర కొట్టుడు అయిపోయింది’’ అంటూ బదలిచ్చిండు.
‘‘కంట్రాక్టరు పోన్ల మీద పోన్లు చేస్తాండ్లు. తిలక్‍నగర్‍కు (బెందడి) బెస్‍మెంట్ రాయి తీస్కపోవాలి. తొందరతినిపో...’’ అని పురమాయించి మళ్ళి వెనక్కి తిర్గి అపీసుకు పోబోతుంటే అత్మరాం ‘‘మెస్త్రీ ఇవ్వాళ పైసలు ఇస్తరా’’ అని అడిగిండు.
‘‘అరే ఇస్తం బిడ్డా.... నీపైసలు ఎక్కడికి పోవు... కూలి ఇచ్చినంకనే ఇక్కడి నుంచిపోత సరేనా’’ అన్నాడు నవ్వుతూ...
(తరువాతి భాగం వచ్చే సంచికలో )
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు