గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
(కూలి బతుకులు నవల గత సంచిక తరువాయి భాగం )
8
ఒక రోజు దిలీప్ క్వారికి పోయి నాన్నకు టిఫిన్ ఇచ్చి తిరిగి వస్తుంటే తోవలో మూసేసిన బాల కార్మికపాఠశాల వద్ద తన ఈడు వారైన పిల్లలు ఆటలు అడుతు కన్పించిండ్లు. అ ప్రయత్నంగానే దీలిప్ అటువైపు కదిలిండు.
సునీల్ పొద్దంతా తిరిగి చిత్తుకాగితాలు ఎరుకొని వచ్చివాటిని అమ్మి అంతో ఇంతో సంపాదించి కుటుంబానికి సహయంగా ఉంటాడు.
కూలీల పిల్లలు చాల మందికి చదువు సంద్యలులేవు. స్వతంత్య్రం వచ్చి ఇన్నెండ్లు గడిచిన పిల్లలకు చదువు అందని కుసుమమే అయింది.
ఊరు రామగుండంలో ప్రభుత్వ స్కూలు ఒకటి కాని, పిల్లలు అంత దూరం పొయ్యిరావటం కష్టం. దానికి తోడు తల్లి దండ్రులు ఇద్దరు పనులు చేస్తేకాని పొట్టగడవని పరిస్థితిలో కాస్త పెద్ద పిల్లలు ఇంటికాడ ఉండి, తనకంటే చిన్న పిల్లలను చూసుకోవటమో, వంటకు అవసరమైన కర్రలో, బొగ్గులో ఎరుకరావటమో నీళ్ళుతేవటం వంటి పనులు చేస్తరు. కాస్త రెక్క ముదిరిన పిల్లలు ఎదో పనిలోకి పోతారు. క్యారీలల్లో హోటల్లలో ఇటుక బట్టీలల్లో చిన్న చిన్న వర్క్షాపుల్లో పనులకు కుదురు కుంటారు. లేకుంటే బుజానికి సంచులు వేలాడ వేసుకొని చిత్తుకాగితాలు ఇనుపసామన్లు ఏరుకుంటానే పొట్ట గడుపుతారు... ఎవ్వని శరీరంలో చటాకు మాంసం ఉండదు... అకలితో బరించక పోయిన మొఖలతో కంతలు తేలి బక్కచిక్కి ఉంటారు.
సునీల్ తన చిత్తుకాగితాల సంచిని ప్రక్కన పడేసి కిరణ్‍తో గోలీలాటకు దిగిండు. సునీల్ ముందు కిరణ్ నిలువలేక పోతున్నాడు. తెచ్చుకున్న గోలీలన్ని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అ సమయంలో దీలిప్ కన్పించే సరికి కిరణ్‍కు ప్రాణంలేచి వచ్చింది.
‘‘అరేయ్ దిలీప్ నావంతు నువ్వు అడరా’’ అంటూ దీలిప్‍ను బ్రతిమిలాడిండు.
దిలీప్ బెట్టుగా ‘‘నేను ఆడను’’ అన్నాడు.
‘‘అదే ఎందుకు’’
‘‘అది అంతే’’ అంటూ దిలీప్ మూతి బిగించిండు. కాని కిరణ్ చేతిలో మిలమిల లాడుతున్న నీలం రంగులో మెరిపోతున్న గోలీలను చూసి మనుసు ఉబలాట పడుతున్నా బింకానికి పోయిండు. అందుకు కారణం పోయి ఆదివారం సంతలో కిరణ్‍తో జరిగిన లొల్లి దిలీప్‍కు గుర్తుకు వచ్చింది.
ప్రతి ఆదివారం ఎన్టిపిసి రోడ్డుకు ఇరువైపులా సంత జరుగుతుంది. చుట్టు ప్రక్కల ఊర్లనుండి కూరగాయలు అమ్మెటోళ్ళు వస్తరు. చీకటి పడేవేల వరకు అమ్ముకొని, పాడుబడి పోయి, పనికి రాని కూరగాయలు ఎమన్న ఉంటే తిరిగి తీసుక పోలేక పారబోసి పోతారు.
అట్లా పారబోసిన కూరగాయల కోసం కూలి జనం ఎగబడుతారు. అందులో కాస్త మంచివి ఏరుకొని వచ్చి శుభ్రం చేసుకొని వండుకుంటారు.
పోయిన ఆదివారం సంతలో పారబోసిన కూరగాయల చెత్తలో దిలీప్ వేలు పెట్టి వెతుకుతుంటే, పొపాటున వదిలేసిన క్యాబేజీ ముక్క ఒకటి కంట పడింది. దాన్ని ఇట్లా తీసుకోబోతుంటే ప్రక్కనే ఉన్నా కిరణ్‍లటుటకున దానిన అందుకొన్నాడు.
‘‘అదినాది నేను వెతుక్కుంటుంటే నువ్వోచ్చి తీస్కున్నవు’’ అంటూ దిలీప్ జగడానికి దిగిండు.
‘‘లేదు నేనే ముందు చూసిన అదినాదే’’ అంటూ కిరణ్ నిర్లక్ష్యంగా బదులిచ్చిండు.
అట్లా ఇద్దరి మధ్య కొట్లాట మొదలైంది. అది చూసిన మాలిక్ బిహరీ వచ్చి వారిద్దరిని విడదీసి ‘‘మళ్ళి తన్నుకుంటే మీ ఇద్దరి వీపులు సాపు చేస్తా’’ అంటూ బెదిరించి ఎటోళ్ళను అటు వెళ్ల గొట్టిండు.
దిలీప్‍కు అనాటి సంఘటన గుర్తుకొచ్చి బింకానికి పోయిండు.
‘‘వాడు ఆడుతే భయపడటానికి ఇక్కడెవ్వరు అడోళ్ళులేఉద’’ అంటూ సునీల్ సవాల్ వసిరిండు. దాంతో దిలీప్ రోషం పొడుచుకొచ్చింది.
‘సరే ఆడుచుద్దాం’’ ంటూ కిరణ్ చేతిలోని గోలీలు తీసుకొని ఆటు దిగిండు.
దిలీప్ ఆట ముందు సునీల్ నిలువలేక పోయిండు. అంత వరదాక గెలుచుకున్న గోలీలన్ని పొగొట్టుకకునే సరికి కోపం వచ్చి తొండికి దిగిండు.
‘‘నేను నీలం చెప్పలే పలపిట్ట గోలీ చెపినా’’ అన్నాడు సునీల్...
‘‘లేదు నీలం గోలి చెప్పినవు ఇవన్ని నావే’’ అంటూ దిలీప్ మొండిగా బదులిచ్చిండు.
అవసరమైతే తన్నులాటకైనా సిద్దమే అన్నట్టుగా ఉంది. సునీల్ దోరణి. వానితో కొట్లాడి గెలువటం కష్టం అని బావించిన కిరణ్...
‘‘నువ్వు తోండి ఆడుతనవు’’ అన్నాడు...
‘‘కాదునువ్వె తొండి’’ అన్నాడు సునీల్ మొండిగా...
‘అయితే మళ్ళీ ఆడుదాం’’ అంటూ దిలీప్ రాజీ మార్గం చూయించిండు.
‘సరే ఆడు’ అంటూ సునీల్ మళ్ళీ ఆటకు దిగిండు ఇంతలో చక్రదర్, దెవరాజు వచ్చిండ్లు. చక్రదర్ చేతిలోని ప్లాస్టిక్ సంచికేసి కిరణ్ ఆశగా చూసి అందులో ఏముందిరా’ అని అడిగిండు.
చక్రదర్‍కు పదమూడేండ్లు. తండ్రి చనిపోయిండు. తల్లి కూలి పనిచేస్తది. చక్రదర్ రామగుండం ప్రాంతంలోనే అత్యంత అధునిక మైన అమూల్యబార్ అండ్ రెస్టారెంటులో రాత్రులు పనిచేస్తడు. నిరంతరం నీళ్లలో నానటం వలన వాని రెండు చెతివెళ్ళు చెడిపోయి పుండ్లయినవి.
‘‘ఏముందో చెప్పుకో’’ అంటూ చక్రదర్ రెండు చేతులు వెనక్కి పోనిచ్చి సంచిని దాచి ఊరించిండు.
‘నాకు తెలుసులే’ అన్నట్టుగా దిలీప్ కండ్లు చికిలించి ‘‘తినేది ఎంటో తెచ్చినవు’’ అన్నాడు.
చక్రదర్ నిజమే అన్నట్టుగా కిలకిల నవ్వి సంచితెరిచిండు. అవి రాత్రి పనిలో నుండి వస్తూ తెచ్చిన మిగిలిపోయిన అహారపదార్థాలు. అందులో ఉండలా ఉన్న ఒక్కదాన్ని తీసి దిలీప్ చేతిలో పెట్టి ‘‘తిని ఏమిటో చెప్పు’’ అన్నాడు.
మిగితా వాళ్ళు అశగా చూసిండ్లు.
దిలీప్ లటుక్కున నోట్లో వేసుకొని నములుతూనే ‘ఎమో బాగుందీ’ అంటూ మళ్ళీ ఇంకోదాని కోసం చెయ్యి సాచిండు.
చక్రదర్ అటువంటిదే తలోకటి ఇచ్చిండు.
దేవరాజు బొమ్మలు ఎగరేసి ‘బాగుందే’’ అన్నాడు.
‘‘అవి చికెన్‍రోల్స్’’ అంటూ చక్రదర్ బొమ్మలెరేసిండు.
‘మరి అదేమిటి’ అంటూ సునీల్ సంచిలోకి తొంగి చూసిండు.
చక్రదర్ సంచిలో చెయ్యిపెట్టి ప్రైయ్ చేసిన చికెన్‍లెగ్స్ బయిటికి తీసిండు. అది సగంతిని వదిలేసినవి. ప్లెట్లు కడిగెటప్పుడు వాటిని దాచిపెట్టి తెచ్చిండు. తలా ఒకటి ఇచ్చి తానోకటి తీసుకున్నడు.
‘‘వాళ్ళకు తినటం కూడా చేతకాదు’’ అన్నాడు చక్రదర్..
‘‘ఎంతో రుచిగా ఉన్నయ్ ఎందుకుతినరు’’అంటూ దిలీప్ అశ్చర్యపోయి అడిగిండు.
‘‘అసలు వాళ్ళకు ఆకాలి ఉంటే కదా.. ఇంక తాగి నోల్ల సంగతి చెప్పకు..పైసలంటే వొళ్ళకులెక్క ఉండదు.
‘‘ఒక ప్లెట్ చికన్ ధర ఎంతో తెలుసా?’’ అంటూ బొమ్మలు ఎగరెసిండు చక్రదర్...
ఎవరు చెప్పలేక పోయిండ్లు.
‘‘నూటఅరువై’’ అంటూ చక్రదర్ తానే సమాదానం చెప్పిండు.
‘అబ్బో నూట అరువైయా’’ అంటు కిరణ్ నోరెల్ల బెట్టిండు.
‘‘ఒక్కరి కూలి’’ అన్నాడు దేవరాజ్..
‘‘గట్ల పైసల మొఖం చూసేటోళ్ళు ఎవరు అక్కడికి రారు... పెద్దపెద్ద కార్లు వేసుకొని బాయి దొరలు, కంట్రాక్టర్లు, రాజకీయనాయకులు, అలుకంగా పైసలు సంపాదించేటోళ్ళె వస్తరు’’ అన్నాడు చక్రదర్...
చక్రదర్ తెచ్చిన సంచి మొత్తం కాళీ చేసిండ్లు.
ఎర్రటి ఎండ దంచికొడ్తాంది. ఒళ్లంతా చీదర చీదరగా ఉంది.
ఉండిఉండి చక్రదర్ ‘‘నాతో చెఱువుకు ఈత కొట్టెందుకు వచ్చేది ఎవరు’’ అంటూ అందరి మొఖంలోకి చూసిండు.
చెఱువులో ఈత అనే సరికి అందరికి ఊషారు ఎత్తింది. నేను వస్తాను అని అందరు బూడిద చెఱువు కేసి బయలు దేరిండ్లు.
క్రషర్ నగర్‍కు ఎగువన బూడిద చెఱువు ఉంది. ఎన్టిపిసిలో ప్రతి సం।।రము దాదాపు పది మిలియన్ టన్నులబొగ్గు కాలుస్తరు. పెద్దపెద్ద చిమ్నిలు నిరంతరం బొగ్గుపులుసు వాయువులను అకాశంలోకి చిమ్ముతు ఎటు పది ఊళ్ళపెట్టు వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. నిరంతరం వెలువడి పొగ, దుమ్ముల వలన వర్షకాలంలో యూసిడ్ వర్షాలు కురిసిన సందర్భాలు ఉన్నాయి.
ఎన్టిపసిలో కాలిన బొగ్గు బూడిదను నీళ్ళతో కలిపి బూడిద చెఱువులోకి మళ్ళిస్తరు. ఈ పక్రియ ఎండ్లకు ఎండ్లుగా సాగటం వలన ఒక్కడి వాతావరణం అంతా సన్నటి బూడిద పేరుక పోయింద. ఎండ కాలంలో ఎండకు ఎండి, గాలి దుమారం వచ్చినప్పుడు లేచిన బూడిద దుమ్ము చుట్టు ప్రక్క ప్రాంతాలను అక్రమిస్తుంది. బూడిద చెఱువు చూట్టూర ఎటు చూసిన కనుచూపు మేర చెట్టు చేమ, ఇండ్ల అంత బూడిద వర్ణంలోకి మారిపోయినవి.
పర్యావరణ పరిరక్షణ చర్యలను సమర్ధవంతంగా అమలు జరిపినందుకు కాను రామగుండం ఎన్టిపిసి అనేక సార్లు జా•తీయస్థాయిలో బహుమతులు గులుచుకున్నది. కాని ఎన్టిపిసి నిర్మాణానికి భూములు ఇచ్చి బ్రతుకు కోల్లోపయిన చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల మొఖం మీద మాత్రం బూడిద పోసింది. అ కలుషిత బ్రతికే జనం ఊహించని రోగాలతో చనిపోవటం సర్వసాదారణమైంది.
యాస్ ప్లాంటు దిగువన గుడిసెలు వేసుకొని నివసించే క్వారీ కూలీలకు, బయట నీళ్ళు దొరకక అ బూడిద చెఱువులోనే స్నానపానాదులు బట్టలు ఉతుక్కోవటం చేస్తుంటారు.
నాథురాం వృద్దుడు. ఎనుబై ఎండ్లకు పైబడి ఉంటాడు. క్రషర్ నగర్‍లో అంత వయసువరకు బ్రతికిన వారు అరుదు. ఆయన కొడుకు ఇతూరాం కొడలు భగవతి వొడ్డరి పని చేస్తరు. మనుమళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. నాథురాంది దుర్గుజిల్లా ఆయన అక్కడ చాల కాలం వ్యవసాయ చేసిండు. భార్య చనిపోయిన తరువాత ఒంటరివాడై కొడుకు పంచన చేరిండు.
పొద్దంతా ఎండ చిటపటలాడించింది. ఉక్కపోతలో ఊపిరి సలుపనిస్తలేదు. చమటతో ఒళ్ళంత చిదర చీదరగా ఉంది. స్థానం చెద్దామంటే ఇంట్లో నీళ్లులేవు. అక్కడ కసికడు తోడుకుంటూ ప్రాణాలు నిలబెట్టుకుంటాండ్లు జనం.
స్నానం చేసి వద్దామని మాసిన బట్టలు పట్టుకొని చెతకర్ర పుణుక్కుంటూ బూడిద చెఱువుకు వచ్చిండు.
బూడిద చెఱువు ఒక ప్రక్క ఎండిపోయి బూడిద వర్ణపు మైదానంలా విశాల పరుచుకుంది. వెడుగాలలకు బూడిద సుడులు సుడులుగా లేస్తూ అకాశంలోకి ఎగ చిమ్ముతుంద.ఇ ఒక వైపున చెఱువు కట్టకు దిగువన నీళ్ళు పేరుకపోయి ఉన్నాయి. అక్కడున్న ఒక బండరాయి మీద నాథురాం బట్టలు ఉతుక్కుంటుంటే పిల్లలు స్నానికి వచ్చిండ్లు.
బట్టలు విడిచేసి బిలబిల మంటూ వచ్చి పిల్లలు నీళ్ళలోకి దునికే సరికి నీళ్ళన్ని బురద బురదైనవి. నాథురాం కోపం వచ్చి ‘‘అరేయ్ నీల్లను బురద చెయ్యకుండ్లిరా’’ అంటూ అరిచిండు.
కాని అమాట లేమి పిల్లలు విన్పించుకోవటం లేదు.
బయట ఎండ వేడికి మురికి నీరే అయినా ఎంతో చల్లగా ఉన్నాయి. దేవరాజ్ నీళ్ళలో చాపలాగా ఈదుకుంటూ పోయిండు. అది చూసి చక్రదర్ బడబడ మంటూ కాళ్ళు తాడించుకుంటూ ఈతకు దిగిండు. కిరణ్‍కు ఈతరాదు. సునీల్‍కు ఎదో కొద్దిగా వచ్చు ‘‘ఈ పొరగాండ్లు చెప్పితే వినేట్టులేదు’’ అంటూ నాథురాం కోపంతో విసుక్కుంటూ ఉతికిన బట్టలను అరేసుకోవటానికి గట్టు మీదికి పోయిండు.
చక్రదర్ తపతప కాల్లాడించుకుంటూ కాస్త ముందుకు పోయి అక్కడ అడుగున ఉన్న బండ మీద నిలుచున్నడు.
‘‘ఇటు రండిరా ఇక్కడ ఎక్కువలోతులేదు’’ అంటూ కేకేసిండు.
దేవరాజ్ ఈదుకుంటూ అటూ వైపు సాగిండు.
‘‘నేను వస్తున్నా’’ అంటూ సునీల్ కదిలిండు. అతన్ని అనుసరిస్తూ కిరణ్ కూడా బయలు దేరిండు.
ఒడ్డున ఉన్న నాథురాం అది చూసి ‘‘అరేయ్ పిల్లలు అటు పోకుండ్లిరా అక్కడంత బురద ఉన్నది’’ అంటూ కేకేసిండు.
కాని పిల్లలు ఆయన మాటలేమి పట్టించుకోలే...
‘‘అరేయ్ మీకేరా చెప్పేది.. అటు పోకుండ్లీ అక్కడంతా బురద ఉంది. బురదలో కూరుక పోతారు’’ అంటూ గట్టిగా అరిచిండు.
అ మాటలేమి పట్టించుకోకుండానే సునీల్ నీళ్ళలో ముందు అడుగు వేసిండు. కిరణ్ అతన్ని అనుసరించిండు. నాలుగు అడుగులు వేసిండో లేదో సునీల్ బురుదలో కూరక పోతు ప్రక్కనే ఉన్నా కిరణ్ చెయ్యిని అసరగా అందుకున్నాడు. మరునిముషంలో ఇద్దురు మునిగిపోయిండ్లు.
చక్రధర్ దిలీప్ ఒక్కసారే అది చూసిండ్లు.
‘‘మునిగి పోతాండ్లు... మునిగిపోతాండ్లు’’ అంటూ ఎడ్పు గొంతుతో చక్రధర్ పెద్దగా అరిచిండు.
దిలీప్ ఒక్క క్షణం కూడా అలస్యం చెయ్యకుండా వాళ్లు మనిగిన దిక్కు ఈదుకుంటూ పోయి కిరణ్ జుట్టు అందుకొని బయిటికి లాగిండు. వెంటనే దేవరాజ్ చక్రధర్ అందుకొని ఒడ్డుకు చెర్చిండ్లు.
అది చూసి నాథురాం పెద్దగా అరుచుకుంటూ చెఱువు కట్టమీదకి వచ్చి ‘‘అయ్యో పోరగాండ్లు మునిగి పోతాండ్లు’’ మునిగిపోతాండ్లు అంటూ సహయం కోసం చుట్టు చూసిండు.
సరిగ్గా అసమయంలోనే చెఱువు కట్టమీద ట్రాక్టర్ ఒకటి పరుగున రావటం గమనించి దానికి అడ్డంపోయిన నాథురాం అపమన్నట్టు చెతులు రెండు బారచాపి ‘‘పొరగాండ్లు చెఱువుల మునిగి పోయిండ్లు’’ అంటూ దాదాపు ఎడుపు గొంతుతో అరవసాగిండు.
లోడు కోసం క్వారికి పోతున్న శ్రీను నాథ్‍రాం అరుపులకు ట్రాక్టర్ అపి ‘‘ఎమైంది’’ అన్నాడు అథుర్దగా...
‘‘అదిగో అక్కడ చెఱువుల పిల్లలు మునిగిపోయిండ్లు’’అన్నాడు.
చక్రధర్, దన్‍రాజ్ భయంతో ఎడుస్తూ పరుగునవచ్చి ‘‘అన్నా అక్కడ’’ అంటూ చెఱువు వైపు చూయించిండ్లు.
శ్రీను క్షణం అలస్యం చేయకుండా ట్రాక్టర్ దిగి చెఱువు వైపు పరుగుత్తెండు. ఆయన వెంట అందరు పరుగు పెట్టిండ్లు.
చక్రధర్, వెలెత్తి చూయిస్తూ అన్నా అక్కడ’’ అన్నాడు.
శ్రీను బట్టలైన విప్పకుండా నీల్లలో దుమికిండు. ఆయన్ని అనుసరిస్తూ చక్రధర్,రన్‍రాజు కూడా నీళ్ళలోకి దిగిండ్లు...
నీళ్ళలో మునిగి పోతున్న సునీల్, కిరణ్‍లను కాపాడటానికి ప్రయత్నించిన దిలీప్ కిరణ్‍ను బయిటికి లాగి, సునీల్‍ను అందుకోవటానికి చెయ్యి చాచిండు. కాని అప్పటికే నీళ్ళు మింగిన సునీల్ దీలిప్ చెయ్యి అందుకొని గట్టిగా వాటేసుకున్నాడు. దాంతో దిలీప్ కాళ్ళు చేతులు అడకుంటా అయిపోయి ఇద్దరు నీటమునిగిండ్లు.
శ్రీను కాసేపు నీళ్ళలో పిల్లలకోసం అటు ఇటు వెతుకు లాడిండు. చివరికి ఒక చోట పిల్లలు దొరికిండ్లు. చక్రధర్, దేవరాజ్ సహయంతో శ్రీను వాళ్ళను బయటకి తీసుక వచ్చిండ్లు. కాని అప్పటికే పిల్లలు నీళ్ళు మింగి ఊపిరాడక చనిపోయిండ్లు.
దీలిప్ సునీల్ శవాలను చూసి చక్రధర్, దనరాజ్, కిరణ్ బెదిరిపోయి పెద్దగా ఎడ్వసాగిండ్లు.
ముక్కు పచ్చలారని పిల్లల శవాలను చూసి శ్రీనుకు దు:ఖం అగలేదు.
‘‘కాస్త ముందైతే పొరగాండ్లు బ్రతికేటోళ్లు’’ అన్నాడు అవేదనతో...
‘‘ఆడికి నేను చెప్పుతూనే ఉన్నా, అటు పోకుండ్లిరా అని’’ కాని నామాట వినలేదు. నేను చూస్తుండగానే పిల్లలు పిడాత ప్రాణం పోయింది’’ అన్నాడు నాథురాం దు:ఖ పడుతూ...
విషయం తెలిసి జనం పరుగున వచ్చిండ్లు దీలిప్ తండ్రి దేవ్‍కు కబురు పంపిండ్లు. సునీల్ వాళ్ళ తల్లి ండ్రులు వచ్చిండ్లు ఎడ్పులు అరుపులతో అక్కడ వాతావరణం గంభీరమైంది.
దేవ్‍కు విషయం తెలిసి నెత్తి నోరు కొట్టుకుంటూ పరుగున వచ్చిండు. పిల్లవాని శవం మీద పడి హృదయ విదారకంగా రోదించిండు. అతన్ని అపటం ఎవరి తరం కాలేదు.
‘‘భార్య చనిపోయిన తరువాత పొల్లగాన్ని చూసుకుంటూ బ్రతుకుతాండు. ఉన్కొక్క పిల్లగాడు పాయే... పాపం ఎట్లా బ్రతుకుతడు’’ అంటూ చూడవచ్చిన జనం కన్నీరు కల్చిండ్లు.
పోలీసులు వచ్చి శవాలను పోస్టు మార్టంకు పంపిండ్లు.
‘నిశద్ద ప్రాంతంలోకి పోయిన పిల్లలు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయిండ్లు. కావున అందుకు తమతప్పు ఏమి లేదంటూ ఎన్టిపిసి మెనేజుమెంటు తేల్చి చెప్పింది.
ఎప్పటిటా కేసు ఎటు తేలలేదు. బూడిద చెఱువు లోకి, బూడిద కలిసిన నీళ్ళు ఎప్పటిలా వచ్చి చేరుతూనే ఉంది. దిగువన నివసించే క్రషర్ నగర్ వాసులు ఎప్పటిలాగే బూడిద చెఱువులో స్నానపానాదు నిర్వహించుకుంటూనే ఉన్నారు. అంతయదవిధిగా ఎమి జరుగనట్టుగానే జరిగిపోతున్నది.
అ సంఘటన ను కాళ్లరచూసిన శ్రీను కొన్ని రోజుల దాక మనిషి కాలేక పోయిండు.
కొడుకు చనిపోయిన తరువాత దేవ్‍కు జీవితం మీద ఆశపోయింది. కొన్ని రోజులకే అతను క్రషర్‍నగర్ వదిలేసి ఎటో పోయిండు.
(తరువాయి భాగం వచ్చే సంచికలో )
Sep 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు