సాహిత్య వ్యాసాలు

(April,2022)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

హిజాబ్....ఎందుకు చర్చయనీయమైంది

కర్ణాటక కాలేజీల్లో మొదలైన హిజాబ్ ఇష్యూ... కర్నాటక విద్యార్థుల్ని రెండు మతాలుగా విభజించి అగ్గిపుట్టించింది. కాలేజీల్లో అమ్మాయిలు హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకిస్తూ.. కాషాయ జెండాలతో చాలా చోట్లో విద్యార్థులు నిరసనలకు దిగారు. అవి ఎంత ఉన్మాదంగా మారాయంటే... షిమోగాలోని గవర్నమెంట్ కాలేజీలో.. జై శ్రీరాం నినాదాలు చేస్తూ కాషాయ జెండా ఎగరేశారు...

మాండ్యలోని ఓ కాలేజీలోకి ఒక స్టూడెంట్¬ని హిజాబ్¬తో రాగానే.. జై శ్రీరాం నినాదాలతో వందల మంది ఇలా వెంటపడ్డారు..

బాగల్కోట్¬లో హిజాబ్¬కి నిరసనగా.. పోలీసులపై కొందరు రాళ్లు విసరడంతో ఈ నిరసన ఉద్రక్తంగా మారింది..

అమ్మాయిలు హిజాబ్¬తో కాలేజీకి రావడంపై ఇంతకాలం లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు..? హిజాబ్ ఇష్యూ.. హిందు ముస్లిం విద్యార్థుల మధ్య ఘర్షణగా ఎందుకు మారింది..?

జనవరి 1, 2022న.. ఎప్పట్లాగే వచ్చిన ముస్లిం గర్ల్స్¬ని కాలేజీ సిబ్బంది అడ్డుకున్నారు. కాలేజీలోకి వెళ్లాలంటే హిజాబ్ తీసెయ్యాలన్నారు. అమ్మాయిలు అలా కుదరదు అని చెప్పడంతో.. మీరు క్లాసులకు అటెండవడానికి వీళ్లేదని ప్రిన్సిపాల్ అభ్యంతరం చెప్పడంతో వివాదం మొదలైంది. మర్నాడు తల్లిదండ్రులతో కలిసి కాలేజీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తే గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఇంతలో తళతళలాడే కొత్త కాషాయ కండువాలు వేసుకొని అబ్బాయిల బృందం ఉడిపి కాలేజీలోకి వెళ్లేందుకు ట్రై చేసింది. అమ్మాయిల్ని హిజాబ్¬తో క్లాస్¬లోకి రానిస్తే.. మమ్మల్నీ కాషాయ కండువాలతో రానివ్వాలని పట్టుబట్టారు.

ఉడిపి ఇష్యూ కొనసాగుతుండగానే... జనవరి 3న కొప్ప జిల్లాలోని ఓ గవర్నమెంట్ కాలేజీలో, జనవరి 6న చాలా మంగుళూరు కాలేజీల్లో హిజాబ్¬కి వ్యతిరేకంగా కాషాయ కండువాలతో పెద్ద ఎత్తున విద్యార్థులు జై శ్రీరాం నినాదాలతో ఆందోళనలకు దిగారు.

ఇక్కడ మనకొక సందేహం రావాలి.. విద్యాసంస్థల్లో యూనిఫాం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యూనిఫాం వేసుకోవాల్సిందే. విద్యాసంస్థలు యూనిఫాం వేసుకునేలా చూడాల్సిందే. కానీ కర్ణాటకలో ఇప్పుడే ఈ ఇష్యూ ఎందుకు రైజ్ అయ్యింది. ఇది అకడమిక్ ఇయర్ స్టార్టింగ్ టైం కాదు.. ఎండింగ్ టైం.. పోనీ.. ముస్లిం యువతులెవరైనా యూనిఫాం వేసుకోము బురఖాలే వేసుకుంటాం అంటే అప్పుడు కచ్చితంగా ఖండించాల్సిందే. కానీ కర్ణాటకలో ముస్లిం యువతులంతా కాలేజీ యూనిఫాంలోనే వస్తున్నారు. యూనిఫాంతో పాటు.. తల, మెడ కవర్ అయ్యేలా ఒక చిన్న గుడ్డ చుట్టుకుంటున్నారు. హెడ్ స్క్రార్ఫ్ చుట్టుకోవచ్చు అని కాలేజీ నిబంధనల్లో కూడా ఉంది.

ఉన్నట్టుండి కర్ణాటక ప్రభుత్వం యూనిఫాంను స్ట్రిక్టుగా అమలు చెయ్యాలని విద్యాసంస్థలకు ఆర్డర్స్ పాస్ చేసింది. ఉడిపి కాలేజీ సిబ్బంది.. వెంటనే హిజాబ్ బ్యాన్ అన్నారు. హిజాబ్ వేసుకొని కాలేజీకి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రన్సిపల్ చెప్పాడు. ఉడిపి సహా అనేక జిల్లాల్లోని కాలేజీలోకి  కాషాయ కండువాలతో విద్యార్థులు రావడం.. హిజాబ్¬ ధరించడానికి వ్యతికేకంగా నిరనసలు  మొదలయ్యాయ్.

జనవరి 26న ఈ ఇష్యూ సాల్వ్ చేయడానికి ఒక ఎక్స్¬పర్ట్ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా.. యూనిఫాం రూల్స్ పాటించాల్సిందే అని చెప్పింది. దీంతో జనవరి 31న ఉడిపికి చెందిన ఒక విద్యార్థి హిజాబ్ ధరించడం మా ప్రాథమిక హక్కు అని కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది.

ఫిబ్రవరి 5న కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఈ ఇష్యూ మీద విద్యాశాఖ మంత్రితో మీటింగ్ పెట్టారు. విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్... విద్యాసంస్థల్లో హిజాబ్¬నీ అనుమతించమూ.. కాషాయ కండువాలనూ అనుమతించమూ అన్నారు.. అంటే.. ఎప్పటినుంచో అమ్మాయిలు ధరిస్తున్న హిజాబ్¬ను.. ఇప్పటికిప్పుడు రంగంలోకి దించిన కాషాయ కండువాలనూ ఒకే గాట్లో కట్టేసి మాట్లాడారు. అయితే.. సీఎం మీటింగ్ తర్వాత... ఉడిపిలో హిజాబ్¬తో వచ్చిన ముస్లిం అమ్మాయిల్ని కాలేజీలోకి రానివ్వాలని నిర్ణయం తీసుకున్నారు కానీ... క్లాసులోకి రానివ్వకుండా వాళ్లను విడిగా కూర్చోబెట్టారు. దీంతో ఇదేం అంటరానితనం అంటూ.. చిక్ మంగులూరులో ముస్లిం యువతులకు మద్దతుగా దళిత్ స్టూడెంట్స్ జై భీమ్ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు..

అదే సమయంలో ఉడిపి కాలేజీకి దగ్గర్లో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు మారణాయుధాలతో తిరుగుతుండటంతో పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు. వాళ్లు ముస్లింలు కావడం కూడా వివాదాన్ని పెంచింది.

ఈ ఇష్యూపై కర్ణాటక హైకోర్టులో వాడీ వేడి వాదనలు జరిగాయి. సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ ముస్లిం విద్యార్థుల తరఫున వాదించారు.

నాలుగు అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

బాలికలు తలచుట్టూ కట్టుకున్నహిజాజ్, బురఖా ఒక్కటి కాదు.. హిజాబ్ అనేది ఇస్లాంలో ఒక భాగం. ఆయన ఇంకో విలువైన మాటకూడా అన్నారు. నేను బ్రాహ్మణున్ని కాబట్టి.. నా కొడుకు రేపు నామం పెట్టుకొని స్కూలుకు వెళ్తే అది నేరమౌతుందా..? నామం పెట్టుకున్న నా కొడుకు క్లాస్ రూంలోకి వచ్చి చదువుకోవడానికి వీలుండదా అని ప్రశ్నించారు.

అలాగే... హిజాబ్ ధరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 రైట్ టు ఎక్స్ ప్రెషన్ కిందికి వస్తుందీ.. ఆర్టికల్ 21 కింద రైట్ టు ప్రైవసీ కిందికి వస్తుందన్నారు.

ఒక మతానికి సంబంధించి ఏది ఆచరించాలో ఏది వద్దో రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెప్తుందని న్యాయవాది అన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కోర్టు సూచించింది.

అదే సమయంలో... ఈ వివాదం కర్ణాటక మొత్తానికి వ్యాపించింది. చాలా చోట్ల భజరంగదళ్ కార్యకర్తలు, హిందుత్వ గ్రూపులు ప్రవేశించాయి. కాషాయ జెండాలు, తలపాగాలు పంచిపెట్టి విద్యార్థుల్ని రెచ్చగొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మత సంప్రదాయాన్ని తెలిపే వస్త్రధారణను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం.

సంప్రదాయాలు, ఆచారాలేవీ ఇవాళ కొత్తగా వచ్చినవి కావు.. కాషాయ కండువాలతో హిజాబ్¬పై యుద్ధం ప్రకటించడమే ఇప్పుడు కొత్తగా వింతగా తెరపైకి వచ్చింది.

మనందరికీ తెలిసిందే.. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సరస్వతి దేవి విగ్రహాలుంటాయి. అక్కడ ముస్లిం, క్రిస్టియన్ పిల్లలు చదువుకుంటారు.

వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేసి నిరసనలు తెలిపిన దాఖలాలుండవు.

అంతెందుకు ఆగస్టు 15, రిపబ్లిక్ డే రోజున కొబ్బరికాయలు కొట్టి, అగర్ బత్తులు వెలిగించడం, చిత్రపటాలకు పూలమాలలు, కుంకుమ బొట్లు పెట్టడం చాలా సహజంగా జరిగిపోతుంది. అది మతాచారమే అయినా అక్కడ ఎవరూ పాయింట్ ఔట్ చెయ్యరు.

అసెంబ్లీకీ, పార్లమెంటు చట్టసభలు. కులమతాలకు, ఆచార సంప్రదాయాలకు అతీతం. అలాంటి చోట కూడా మహిళా ప్రజా ప్రతినిధులు బొట్టు, తాళిబొట్టు, మెట్టెలు, సింధూరంతో కనిపిస్తారు. ముస్లింలైతే బుర్ఖాలతో, క్రైస్తవులైతే మెడలో శిలువతో అసెంబ్లీకీ పార్లమెటుంకు వస్తారు. వాళ్లు పుట్టిపెరిగిన ఆచార సంప్రదాయాలు కాబట్టి పాటించాలనుకున్న వాళ్లు పాటిస్తారు.

అంతెందుకు... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సిక్కుమతాచారంలో భాగంగా తలపాగ పెట్టుకుంటారు. తలపాగా లేని మన్మోహన్ సింగ్ ఎలా ఉంటారో కూడా ఎవరికీ తెలియాదు. ఆయనకు అది కంఫర్ట్. సిక్కు  మతస్తుల్లో ఎల్ కే జీ పిల్లలు కూడా తలకు టర్బన్¬తోనే కనిపిస్తారు. అంతెందుకు యూపీలో యోగీ ఆధిత్యనాథ్ ఏ బట్టలు వేసుకుంటారు.. ప్రజ్ఞాసింగ్ సాధ్వి వేసుకునే బట్టలేవి.. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలకు అనుకూలంగా ఎన్ని రంగుల బట్టలు మారుస్తారో.. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తారో చూస్తూనే ఉంటాం.. మరి ఆయన ప్రధాని పదవికి అనర్హుడా ?

హిందువుల్లో కొందరు మగ పిల్లలకు చెవి పోగులు, కమ్మలు, నుదుటిపైన నిలువు నామాలు, అడ్డనామాలు పెట్టుకొని స్కూలుకు కాలేజీకి వెళ్తుంటారు. అయ్యప్ప మాలలు వేసుకున్న పిల్లలు స్కూలు, కాలేజీలకు వెళ్తారు. అలాంటివాళ్లను స్కూలుకు రావద్దని అడ్డుకోం కదా..

ఇంకో ఎగ్జాంపుల్.. సానియా మీర్జా, పీవీ సింధు లాంటి స్పోర్ట్స్ స్టార్స్-గానీ.. సినిమా స్టార్స్¬, టీవీల్లో పని చేసే న్యూస్ రీడర్స్ ఏ మతాల్లో పుట్టినా వాళ్ల వృత్తికి తగిన డ్రెస్సింగ్¬తో ఉంటారు.. అది వాళ్ల కంఫర్ట్. మహిళల పట్ల వివక్ష అన్ని మతాల్లో ఉంది. ఉపవాసాలు... వ్రతాలు నోముల పేరుతో హిందుమహిళలు అనారోగ్యంపాలౌతుంటారు. ఇష్టంలేకపోయినా కట్టుబాటు కాబట్టే తాలిబొట్టును వేసుకునే వాళ్లుంటారు. అలాగే ముస్లిం మహిళలు సంప్రదాయం పేరుతో కట్టుబాటు పేరుతో బుర్ఖా వేసుకుంటారు. కానీ ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు వస్త్ర ధారణతో ఏంటి సంబంధం.

ఇప్పుడు కాషాయ కండువాలను విద్యార్థులకు సప్లై చేస్తున్న వాళ్లే.. గతంలో మహిళలు జీన్స్ వేసుకోకూడదనీ.. పబ్బులకు వెళ్లకూడదని గొడవలు చేశారు. అంటే బట్టలు ఎక్కువ వేసుకున్నా.. తక్కువ వేసుకున్నా వీళ్ల గొడవ మహిళల్ని అణచివేయడం.. వాళ్లకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం విద్య దూరం చెయ్యడం.

పరీక్షలకు రెండు నెలల ముందు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఈ వివాదం రాజుకుందంటే.... ఇది కచ్చితంగా యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం రాజేసిన నిప్పే. ఈ నిప్పు మిగతా దేశమంతా విస్తరించడానికి ఎంతో సమయం పట్టదు.. 

చివరిగా ఒక్క మాట... భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేముందు బ్రిటీషర్లు మన నాయకుల ముందు ఒక ప్రశ్న పెట్టారంట.. మీరు అనేక కులాలు, మతాలుగా విడిపోయారు. మేం మీ దేశాన్ని వదిలి వెళ్లిపోయిన మరుక్షణం.. మతఘర్షణలతో దేశం అల్లకల్లోలమైపోతుందని హెచ్చరించారట. బ్రిటీషర్ల ఆలోచన తప్పు అని... భారతదేశం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. ఇన్ని మతాలు, భాషలు, సంస్కృతులు కలిసి కూడా ఉండగలవు అని ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసిన దేశం మనది.

అలాంటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు... ఎంఐఎం ముస్లింలను రెచ్చగొడుతోంటే... బీజేపీ మెజారిటీ హిందువుల్ని రెచ్చగొడుతోంది. లేని భయాలను వీళ్లు సృష్టిస్తున్నారు. 

కర్ణాటక హిజాబ్ ఇష్యూ కచ్చితంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకీ, ఎంఐఎంకీ ఓట్లు తెచ్చిపెడుతుంది. కానీ.... హిజాబ్ ఇష్యూ మత ఘర్షణల్లోకి రూపం మార్చుకుంటే...భారత ప్రజాస్వామ్యం ఘోరంగా ఓడిపోతుంది. అలా ఓడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత భారతీయులందరిదీ. మతోన్మాదాన్ని శాస్వతంగా ఓడించడానికి ఇదే సరైన సమయం.

 

 


ఈ సంచికలో...                     

Jul 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు